Best Web Hosting Provider In India 2024
Homemade Coconut Bun: బన్ కోసం బేకరీకి వెళ్తున్నారా.. ఇంట్లోనే తయారుచేసుకునే కోకోనబట్ బన్ రెసిపీ గురించి మీకు తెలుసా?
Homemade Coconut Bun: బేకరీలో దొరికే కోకోనట్ బన్ అందరికీ ఇష్టమైన వంటకం. అయితే దీని కోసం ప్రతిసారి బేకరీకే వెళ్లాల్సిన అవసరం లేదు. మీతో పాటు మీ ఫ్యామిలీలో అందరినీ మెప్పించే బన్ మీ చేతులతోనే ట్రై చేయొచ్చు. ఇంట్లోనే తయారుచేసుకునేందుకు ఈ రెసిపీని ట్రై చేయండి.
బన్ కోసం బేకరీకి వెళ్తున్నారా.. ఇంట్లోనే తయారుచేసుకునే కోకోనబట్ బన్ రెసిపీ (Amazon)
ఇంట్లో పిల్లలు నుండి పెద్దలు వరకు అందరికీ బేకరీకి వెళ్ళడం ఇష్టం. బేకరీలలో అమ్ముడయ్యే పలు రకాల స్పెషల్ ఐటెమ్స్‌యే ఇందుకు కారణం. స్వీట్ ఫుడ్‌తో పాటు కారంగా అనిపించే వంటకాలు బేకరీలలో కనిపిస్తూ నోరూరిస్తుంటాయి. బోలెడు రకాలైన ఈ ఫుడ్స్‌లో చాలా మంది ఇష్టపడేవాటిలో కోకోనట్ బన్ కూడా ఒకటి. బేకరీకి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ బన్ తినేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. దానిని శుభ్రంగా తయారుచేశారో లేదో అనే అనుమానంతోనే తినేస్తుంటారు. ఇకపై మీరు ఇష్టమైన ఫుడ్ తినడం కోసం శుభ్రం విషయంలో రాజీపడాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైన కోకోనట్ బన్‌ను ఇంట్లోనే ఈ రెసిపీతో ట్రై చేసేయండి.
బేకరీ స్టైల్‌లో కోకోనట్ బన్ ఎలా తయారు చేయాలో చూద్దాం.
అవసరమైన పదార్థాలు
- 2 కప్పులు మైదా
- అర కప్పు వెచ్చని నీరు
- 1 టీస్పూన్ చక్కెర
- ఒక చిటికెడు ఉప్పు
- 1 టీస్పూన్ ఈస్ట్
- 2 టేబుల్ స్పూన్లు వెన్న
- 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి తురుము
- 4 టీస్పూన్లు డ్రై ఫ్రూట్స్
- 5 లేదా 6 చెర్రీ పండ్లు
- 1 టీస్పూన్ నెయ్యి
- 4 టేబుల్ స్పూన్లు పొడి చక్కెర
- 2 టేబుల్ స్పూన్లు పాలు
తయారీ విధానం
- ముందుగా ఒక పెద్ద పాత్రలో వేడి నీటిని తీసుకోవాలి.
- ఆ తర్వాత అందులో చక్కెర, ఈస్ట్‌లను కలిపి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
- ఆ తర్వాత ఈస్ట్ ఆక్టివేట్ అయిన తర్వాత అందులో మైదా, కావలసినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో పాలు కలపడం మర్చిపోవద్దు.
- ఆ తర్వాత దీనిపై కొద్దిగా నూనె రాసి మూత పెట్టి 1 గంట ఉంచాలి. పిండి ఉడికి కాస్త ఉబ్బినట్లు అవుతుంది. ఆ తర్వాత దీన్ని చపాతీ రోలింగ్ పిన్ మీద ఉంచి చేతులకు నూనె రాసుకుని బాగా నొక్కి పిండిని కలుపుకోవాలి. దీన్ని సమానంగా ముక్కలుగా కట్ చేసి ఉండలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద ఉంచి అందులో నెయ్యి పోసి వేడి చేయాలి.
- నెయ్యి వేడైన తర్వాత అందులో కోకోనట్ తురుము వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కోకోనట్ తురుము, పొడి చక్కెర, డ్రై ఫ్రూట్స్, చిన్నగా తరిగిన చెర్రీలను కలిపి ఉంచుకోవాలి.
- ఆ తర్వాత ఒక ఉండను తీసుకుని పిండి మీద ఉంచి కొద్దిగా నొక్కి దాని మధ్యలో ఈ కోకోనట్ మిశ్రమాన్ని ఉంచి మూసి ఉండగా చేయాలి.
- ఆ తర్వాత వెన్న రాసిన ప్లేట్ లో ఈ ఉండలను ఒకొక్కటిగా వేస్తూ 10 నిమిషాలు ఉంచాలి.
- ఈ ఉండల మీద కొద్దిగా పాలు రాసి బ్రష్ చేయాలి. ఆ తర్వాత కడాయిలో ఉంచి మూత పెట్టి 25 నిమిషాలు బేక్ చేయాలి. ఆ తర్వాత బన్ చల్లారిన తర్వాత దాని మీద వెన్న రాసి బ్రష్ చేసుకోవాలి. సూపర్ కోకోనట్ బన్ రెడీ.
సంబంధిత కథనం