Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా మొదలు.. పెళ్లి తర్వాత తొలి చిత్రం

Best Web Hosting Provider In India 2024

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా మొదలు.. పెళ్లి తర్వాత తొలి చిత్రం

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 03, 2025 04:35 PM IST

Lavanya Tripathi: పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి ఓకే చెప్పిన తొలి చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో మొదలైంది. సతీ లీలావతి పేరుతో ఈ చిత్రం వస్తోంది. గతంలోనే అనౌన్స్ అయిన ఈ చిత్రం ఇప్పుడు షురూ అయింది.

Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా మొదలు.. పెళ్లి తర్వాత తొలి చిత్రం
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి కొత్త సినిమా మొదలు.. పెళ్లి తర్వాత తొలి చిత్రం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి 2023 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత లావణ్య సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్నారు. మెగా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టాక నటనకు కాస్త విరామం ఇచ్చారు. పెళ్లి తర్వాత తొలి చిత్రంగా ‘సతీ లీలావతి’కి ఆమె ఓకే చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే, నేడు (ఫిబ్రవరి 3) లాంఛంగా ఈ మూవీ లాంచ్ అయింది. షూటింగ్ కూడా మొదలైంది.

yearly horoscope entry point

పూజా కార్యక్రమాలతో షురూ

సతీ లీలావతి సినిమా పూజా కార్యక్రమాలతో నేడు మొదలైంది. హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ కార్యక్రమం జరిగింది. వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సతీ లీలావతి చిత్రంలో లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కెమెరా స్విచ్ ఆన్ చేశారు వరుణ్ తేజ్. ముహూర్త సన్నివేశానికి నిర్మాత హరీశ్ పెద్ది క్లాప్ కొట్టారు.

సతీ లీలావతి చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎస్ఎంఎస్ చిత్రాలతో సత్య పాపులర్ అయ్యారు. సతీ లీలావతి చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కించనున్నారు. ఈ మూవీ మనస్ఫూర్తిగా నవ్వుకునేలా ఉంటుందని డైరెక్టర్ సత్య చెప్పారు.

సతీ లీలావతి మూవీని దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియో బ్యానర్లు ప్రొడ్యూజ్ చేస్తుండగా.. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పిస్తోంది. నాగ మోహన్ బాబు, రాజేశ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించనుండగా.. బినేంద్ర కుమార్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా నేడే మొదలైంది.

వరుణ్, లావణ్య పెళ్లి

వరుణ్ తేజ్, లావణ్య వివాహం 2023 నవంబర్ 1వ తేదీన ఇటలీలోని టస్కానీలో గ్రాండ్‍గా జరిగింది. కొణిదెల, అల్లు కుటుంబాలు, సన్నిహుతుల సమక్షంలో ఘనంగా వివాహమైంది. ఆ తర్వాత హైదరాబాద్‍లో రిసెప్షన్ జరిగింది. వరుణ్, లావణ్య హీరోహీరోయిన్లుగా మిస్టర్, అంతరిక్షం చిత్రాలు చేశారు. 2017లో మిస్టర్ మూవీ చేసే సమయంలోనూ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. సుమారు ఆరేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024