![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Krishna_and_his_Leela_1738582843175_1738582855107.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Krishna_and_his_Leela_1738582843175_1738582855107.jpg)
Siddu Jonnalagadda: అప్పుడు నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్.. ఇప్పుడు థియేటర్లలోకి సిద్దు జొన్నలగడ్డ మూవీ.. పేరు మార్చి రిలీజ్
Siddu Jonnalagadda: కష్ణ అండ్ హిస్ లీల సినిమా వేరే పేరుతో థియేర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఒకప్పుడు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన ఈ మూవీ.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
స్టార్ బాయ్, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’ చిత్రానికి మంచి ప్రశంసలు వచ్చాయి. 2020లో ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకే అడుగుపెట్టింది. కరోనా పరిస్థితులతో ఓటీటీ బాటపట్టింది. ఈ చిత్రానికి సిద్ధునే కథ అందించటంతో పాటు ఎడిటింగ్ కూడా చేశారు. ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ధుకు స్టార్ డమ్ వచ్చాక ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది. అయితే, సుమారు ఐదేళ్లకు కృష్ణ అండ్ హిస్ లీల చిత్రం మరో పేరుతో థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
కొత్త పేరు, రిలీజ్ డేట్ ఇదే
కృష్ణ అండ్ హిస్ లీల చిత్రం ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే పేరుతో థియేటర్లలో రిలీజ్ కానుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ అనౌన్స్మెంట్ కోసం మూవీ టీమ్ ఓ వీడియో రిలీజ్ చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, డైరెక్టర్ రవికాంత్ పేరపుతో పాటు సమర్పకుడిగా ఉన్న హీరో రానా దగ్గుబాటి కూడా ఈ వీడియోలో ఉన్నారు.
ఓ సినిమా చేద్దామని సిద్ధుతో రవికాంత్ అంటారు. రానా దగ్గుబాటితోనా.. అయితే చేయను అనేస్తారు సిద్ధు. ఎందుకు చేయవు అంటూ రానా ప్రత్యక్షం అవుతారు. “నువ్వు థియేటర్లో రిలీజ్ చేయవు సినిమా” అని సిద్ధు అంటే.. అప్పుడు కరోనా వచ్చిందని రానా బదులిచ్చారు. ఇప్పుడేమైందని సిద్ధు.. అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ అని రానా అంటారు. అదే పేరుతో ఇప్పుడు ఆ సినిమాను రిలీజ్ చేయాలని సిద్ధు అడుగుతారు. అది రిలీజ్ చేశాక.. వేరే మూవీకి ఒకే చెబుతానంటారు. ఇంగ్లిష్ పండగ వాలెంటైన్స్ డేకు ఇట్స్ కాంప్లికేటెడ్ రిలీజ్ చేయాలంటారు. ఇలా సరదాగా అనౌన్స్మెంట్ వీడియో ఉంది.
ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో రానా పోస్ట్ చేశారు. “టైటిల్ ఎందుకు మార్చామో అడగకండి. ఇట్స్ కాంప్లికేటెడ్ అంతే. మొత్తంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. మీ ప్రియమైన వారితో ఓసారి చూసేయండి. రెండుసార్లైనా పర్లేదు” అని క్యాప్షన్ రాశారు రానా.
ఓటీటీలో ఎక్కడ..
కృష్ణ అండ్ హిస్ లీల చిత్రం 2020 జూన్లో నెట్ఫ్లిక్స్ ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ చిత్రానికి రొమాంటిక్ డ్రామా మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మరి సుమారు ఐదేళ్లకు ఈ ఫిబ్రవరి 14న థియేటర్లలో ఇట్స్ కాంప్లికేటెడ్ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
నయా ట్రెండ్
ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన చిత్రాన్ని పేరు మార్చి.. మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తుండడంతో సిద్దు జొన్నలగడ్డ కొత్త ట్రెండ్ సృష్టించేశారు. మరి దీన్ని భవిష్యత్తులో కూడా ఎవరైనా ఫాలో అవుతారా అనేది ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ ఇట్స్ కాంప్లికేటెడ్ మంచి కలెక్షన్లు దక్కించుకుంటే.. ఈ ట్రెండ్ ఊపందుకోవచ్చు.
కృష్ణ అండ్ హిస్ లీల చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సరసన శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించారు. ఒకే సమయంలో ఇద్దరి ప్రేమలో ఉండి.. కన్ఫ్యూజ్ అయ్యే పాత్రలో సిద్ధు ఆకట్టుకున్నారు. ఈ మూవీకి సిద్దునే స్టోరీ ఇవ్వగా.. రవికాంత్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను సంజయ్ రెడ్డి నిర్మించగా.. రానా సమర్పించారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం