Rana Naidu Season 2: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న రానా నాయుడు సీజన్ 2.. టీజర్ రిలీజ్.. మరోసారి వెంకీ వర్సెస్ రానా

Best Web Hosting Provider In India 2024

Rana Naidu Season 2: నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న రానా నాయుడు సీజన్ 2.. టీజర్ రిలీజ్.. మరోసారి వెంకీ వర్సెస్ రానా

Hari Prasad S HT Telugu
Feb 03, 2025 06:23 PM IST

Rana Naidu Season 2: నెట్‌ఫ్లిక్స్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2 వచ్చేస్తోంది. తాజాగా సోమవారం (ఫిబ్రవరి 3) ఈ కొత్త సీజన్ టీజర్ రిలీజ్ చేశారు. ఈసారి వెంకటేశ్, రానా మధ్య ఫైట్ మరో లెవెల్ కు చేరనున్నట్లు ఈ టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న రానా నాయుడు సీజన్ 2.. టీజర్ రిలీజ్.. మరోసారి వెంకీ వర్సెస్ రానా
నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేస్తున్న రానా నాయుడు సీజన్ 2.. టీజర్ రిలీజ్.. మరోసారి వెంకీ వర్సెస్ రానా

Rana Naidu Season 2: రానా నాయుడు.. రెండేళ్ల కిందట వచ్చి సంచలనం రేపిన వెబ్ సిరీస్. తెలుగు హీరోలు, బాబాయ్ అబ్బాయ్ అయిన వెంకటేశ్, రానా తండ్రీ కొడుకులుగా నటించిన సిరీస్ కావడంతో తెలుగు వాళ్లలోనూ విపరీతమైన ఆసక్తి రేపింది. ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ రానుండగా.. సోమవారం (ఫిబ్రవరి 3) ఓ చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ బాబాయ్, అబ్బాయ్ వార్ మరింత ముదిరినట్లు కనిపిస్తోంది.

yearly horoscope entry point

రానా నాయుడు సీజన్ 2 టీజర్

రానా నాయుడు సీజన్ 2 ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ఈ టీజర్ ద్వారా వెల్లడించింది. రెండేళ్ల కిందట అంటే 2023లో వచ్చిన రానా నాయుడు సీజన్ 1కు కొనసాగింపుగా ఈ రెండో సీజన్ రాబోతోంది. ఈ కొత్త సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండిపోయిన ఈ టీజర్లో వెంకీ, రానా మధ్య వార్ ఈసారి పర్సనల్ కాదని తేలిపోయింది.

టీజర్ మొదట్లోనే రానా ఈజ్ బ్యాక్ అనే టెక్ట్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత అతడు బాక్సింగ్ రింగులోకి అడుగుపెట్టి ప్రత్యర్థిని చిత్తు చేయడం చూడొచ్చు. కొన్ని యుద్ధాలు కొనసాగుతాయంటూ తర్వాత వెంకీ మామ రంగంలోకి దిగుతాడు. ఈ ప్రపంచంలో రానాని ఓడించేది అతని తండ్రి ఒక్కడే అని పవర్ ఫుల్ డైలాగుతో వెంకీ వస్తాడు.

“ఇప్పుడిక అన్నీ పగిలిపోవాల్సిందే.. ఎందుకంటే ఇది రానా నాయుడు స్టైల్. రానా నాయుడు సీజన్ 2025లో రాబోతోంది. కేవలం నెట్‌ఫ్లిక్స్ లో” అనే క్యాప్షన్ తో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి వరుస ట్వీట్లలో వెల్లడించిన నెట్‌ఫ్లిక్స్.. అందులో ఈ రానా నాయుడు రెండో సీజన్ టీజర్ కూడా రిలీజ్ చేసింది.

రానా నాయుడు సీజన్ 1లో ఏం జరిగిందంటే?

రానా నాయుడు తొలి సీజన్ 2023లో వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో రానా నాయుడు, నాగనాయుడు పాత్రల్లో రానా, వెంకటేశ్ నటించారు. యాక్ష‌న్ అంశాల‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్ మేళ‌వించి రూపొందించిన సిరీస్ ఇది. కంప్లీట్ మోడ్ర‌న్ సెట‌ప్‌లో క‌థ సాగుతుంది. అందుకు త‌గిన‌ట్లుగానే ఎక్కువ‌గా మ‌సాలా సీన్స్‌, డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌క‌నిపిస్తాయి.

తండ్రిని ద్వేషించే ఓ కొడుకు, అత‌డికి గుణ‌పాఠం చెప్పాల‌ని ప్ర‌య‌త్నించే తండ్రి సింపుల్‌గా ఈ రెండు క్యారెక్ట‌ర్స్ చూట్టే ఈ క‌థ సాగుతుంది. ఈ రెండు పాత్ర‌ల‌తో మిగిలిన క్యారెక్ట‌ర్స్‌ను లింక్ చేస్తూ ప‌ది ఎపిసోడ్స్‌తో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు ద‌ర్శ‌క‌ద్వ‌యం క‌ర‌ణ్ అన్షుమ‌న్‌, సూప‌ర్న్ వ‌ర్మ‌.

అయితే తొలి సీజన్ లో విపరీతమైన అడల్ట్ కంటెంట్, బూతు డైలాగులు ఉండటంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే స్పందించిన వెంకటేశ్.. రెండో సీజన్లో అలాంటివి ఎక్కువగా లేకుండా చూస్తామని హామీ ఇచ్చాడు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన టీజర్లో అలాంటి బూతు కంటెంట్ ఏమీ కనిపించలేదు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024