Footwear Problem: షూ తీసిన వెంటనే మీ కాళ్లు వాచినట్లుగా అనిపిస్తున్నాయా..? ఇలా జరగడానికి కారణమిదే!

Best Web Hosting Provider In India 2024

Footwear Problem: షూ తీసిన వెంటనే మీ కాళ్లు వాచినట్లుగా అనిపిస్తున్నాయా..? ఇలా జరగడానికి కారణమిదే!

Ramya Sri Marka HT Telugu
Feb 03, 2025 08:30 PM IST

Footwear Problem: కొంతమందిలో షూ లేదా చెప్పులు ధరించినప్పుడు పాదాలు బొబ్బలు వచ్చినట్లుగా లేదా పాదాలు వాచినట్లుగా ఉండి నొప్పిగా ఉంటాయి. నడవడానికి కూడా ఇబ్బందిగా అనిపించే ఈ సమస్యకు వెనుక పలు కారణాలు ఉన్నాయి. ఒక్కోసారి వైద్యుడి దగ్గరకు కూడా వెళ్లాల్సి వస్తుంది !

షూ తీసిన వెంటనే మీ కాళ్లు వాచినట్లుగా  అనిపిస్తున్నాయా..?
షూ తీసిన వెంటనే మీ కాళ్లు వాచినట్లుగా అనిపిస్తున్నాయా..? (Pixabay)

కొత్త షూ లేదా చెప్పులు ధరించినప్పుడు, కొంత సమయం అలవాటు అయ్యే వరకు నొప్పిని కలిగించి, కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. ఈ సమస్య కొంతసేపే ఉన్నప్పటికీ నిదానంగా మన పాదాలకు అలవాటు అయిపోతుంది. కానీ, కొన్నిసార్లు షూ లేదా చెప్పులు ఎన్నిసార్లు ధరించినా నొప్పి అలాగే ఉంటుంది. ఈ నొప్పిని బట్టి పాదాలలో సమస్య ఉందని గుర్తించాలి. పాదాలలో బొబ్బలు లేదా వాపు వచ్చి నొప్పిగా ఉంటే, నడవడానికి, పరిగెత్తడానికి సమస్య అవుతుంది. అలాంటప్పుడు ముందుగా సరైన రకం చెప్పులు/షూలు వేసుకుని ప్రయత్నించాలి. అప్పటికీ ఇబ్బంది తగ్గకపోతే, వైద్యులను సంప్రదించాల్సిందే.

yearly horoscope entry point

న్యూఢిల్లీలోని అపోలో హాస్పిటల్స్ డాక్టర్ అభిషేక్ వైష్ చెప్తున్న దానిని బట్టి కొంతమందికి పాదాలలో బొబ్బలు అనేవి వంశపారంపర్యంగా ఉంటాయట. మరికొందరిలో అయితే సరైన షూ లేదా చెప్పులు ధరించకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా, పాదాలపై నిరంతరం అధిక ఒత్తిడి పడితే, దాని వల్ల బొబ్బలు రావచ్చు అని చెబుతున్నారు. ఈ విధంగా పాదాలపై బొబ్బలకు బాహ్య కారకాలు ఎలా కారణమో, అదే విధంగా జన్యువులు కూడా కారణం అవుతాయని గమనించాలి. ఇవే కాకుండా మిగతా కారణాలు ఏమై ఉండొచ్చంటే..

బొబ్బలు లేదా మొటిమలు రావడానికి ప్రధాన కారణం

అనువంశికత: మీ పెద్దవారికి లేదా తల్లిదండ్రులకు పాదాలలో పొక్కులు రావడం, బొబ్బలు రావడం సమస్య ఉంటే, అది మీకు కూడా వచ్చి ఉండవచ్చు.

పాదరక్షల రూపకల్పన: కొన్నిసార్లు మనం ధరించే షూ లేదా చెప్పుల డిజైనింగ్ కూడా పాదాలలో అసౌకర్యానికి కారణం కావొచ్చు. బిగుతుగా, ఇరుకుగా ఉండే షూలను ధరించే ముందు అవి మనకు సరిపోతాయా, అలవాటు అవుతాయా అని తెలుసుకోవాలి.

పాదాల వైకల్యం: కొంతమంది పాదాలు సరిగ్గా అభివృద్ధి చెందవు, చదునైన పాదాలు లేదా వైకల్యం, సరియైన ఆకారంలో లేకపోవడం కూడా దానికి కారణం కావచ్చు.

ఇన్ఫెక్షన్ సోకే సమస్యలు: సాంక్రమిక వ్యాధుల వంటి సమస్యలతో బాధపడుతుంటే, దాని వల్ల కీళ్ళు బలహీనపడి, బొబ్బలు లేదా మొటిమలు రావచ్చు.

ఏ రకమైన చికిత్స అందుబాటులో ఉంది

పాదాలలో వచ్చే వాపు, బొబ్బలు లేదా మొటిమలకు ప్రధానంగా వైద్యులు రెండు రకాల చికిత్సలను సిఫార్సు చేస్తారు. అది పాదాలలో కలిగిన రియాక్షన్‌పై ఆధారపడి ఉంటుంది.

సర్జరీ కాకుండా మిగిలిన చికిత్సలలో, సరైన పాదరక్షలను ఉపయోగించడం, ఆర్థోపెడిక్ పరికరాలను ఉపయోగించడం, పాదాల నిర్మాణానికి అనుగుణంగా ఉండే ఇన్సోల్స్ లేదా టో స్పేసర్లను ఉపయోగించడం, ఐస్ ప్యాక్, వాపు నివారణ మందులను ఇవ్వడం, స్ట్రెచింగ్, స్ట్రెంథెనింగ్ వ్యాయామాల ద్వారా పాదాలపై ఒత్తిడిని తగ్గించడం వంటివి ఉన్నాయి.

ఈ చర్యల ద్వారా ప్రయోజనం లేకపోతే, వైద్యులు సర్జరీ చేయించుకోవాలని సూచిస్తారు. పాదాల ఎముకల నిర్మాణం సరిగా లేకపోతే, వాపుగా ఉంటే, దాన్ని సర్జరీ చేసి సరిచేస్తారు. ఎముకలను మళ్ళీ అమర్చడం, కీళ్ళను సరిచేయడం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024