Karthika Deepam 2 Serial: శౌర్య ట్రీట్‌మెంట్‌కు డ‌బ్బులు క‌ట్టిన కావేరి – నిజం దాచిన దీప – బ‌య‌ట‌ప‌డ్డ జ్యోత్స్న నాట‌కం

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial: శౌర్య ట్రీట్‌మెంట్‌కు డ‌బ్బులు క‌ట్టిన కావేరి – నిజం దాచిన దీప – బ‌య‌ట‌ప‌డ్డ జ్యోత్స్న నాట‌కం

Nelki Naresh Kumar HT Telugu
Feb 04, 2025 07:52 AM IST

Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 4 ఎపిసోడ్‌లో శౌర్య ఆప‌రేష‌న్‌కు కార్తీక్ పేరుతో కావేరి డ‌బ్బు క‌డుతుంది. ఆ విష‌యం దీప‌కు తెలిసిపోతుంది. తాను డ‌బ్బులు క‌ట్టిన విష‌యం ఎట్టి ప‌రిస్థితుల్లో కార్తీక్‌కు చెప్ప‌వ‌ద్ద‌ని దీప‌తో కావేరి అంటుంది.

కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 4 ఎపిసోడ్‌
కార్తీక దీపం 2 ఫిబ్ర‌వ‌రి 4 ఎపిసోడ్‌

శౌర్య ఆప‌రేష‌న్‌కు క‌ట్టింది ఎవ‌రో తెలుసుకోవాల‌ని కార్తీక్‌, దీప అనుకుంటారు. కార్తీక్ పేరుతోనే డ‌బ్బు క‌ట్టార‌ని న‌ర్స్ చెబుతుంది. నా పేరు మీద ఎవ‌రు డ‌బ్బులు చెల్లించి ఉంటారు, మ‌న‌వాళ్లు ఎవ‌రైనా హాస్పిట‌ల్‌కు వ‌చ్చారా అని దీప‌ను అడుగుతాడు కార్తీక్‌. కావేరి వ‌చ్చి త‌న‌తో మాట్లాడిన మాట‌ల్ని దీప గుర్తుచేసుకుంటుంది. తాను వ‌చ్చిన‌ట్లు కార్తీక్‌కు చెప్పొద్దు అని ఆమె మాట‌లు జ్ఞాప‌క‌మ‌స్తాయి.

yearly horoscope entry point

ఎవ‌రు రాలేద‌ని దీప అబ‌ద్ధం ఆడుతుంది. అడ‌క్కుండా మ‌న‌కు డ‌బ్బులు ఇచ్చిన ఆ దేవుడు ఎవ‌రు అని కార్తీక్ అనుకుంటాడు. అంత విచిత్రంగా ఉంద‌ని, మ‌న‌కు తెలియ‌కుండా, మ‌నం అడక్కుండా డ‌బ్బులు క‌ట్ట‌డం ఏంటో, ఆగిపోతుంద‌నుకున్న ఆప‌రేష‌న్ జ‌ర‌గ‌డం ఏంటో అని కార్తీక్ అనుకుంటాడు. డ‌బ్బులు క‌ట్టింది ఎవ‌రో త‌న‌కు తెలుసున‌ని దీప మ‌న‌సులో అనుకుంటుంది.

శ్రీధ‌ర్ కంగారు…

కావేరి ఇంట్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో శ్రీధ‌ర్ ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. ఆమె ఫోన్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ఎక్క‌డికి వెళ్లి ఉంటుంద‌ని ఆలోచ‌న‌లో ప‌డ‌తాడు. కూతురు స్వ‌ప్న ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఉంటుంద‌ని ఆమెకు ఫోన్ చేస్తుంది. తండ్రి ఫోన్ చేయ‌డం చూసి రాంగ్ డ‌య‌లా అని తండ్రిని అడుగుతుంది స్వ‌ప్న‌.ఇద్ద‌రు ఒకే న‌క్ష‌త్రంలో పుట్టిన‌ట్లున్నారు, నువ్వు అంతే ఆ కార్తీక్ గాడు అంతే…జ‌న్మ‌నిచ్చిన తండ్రికి విలువ‌నివ్వ‌డం ఇద్ద‌రికి చేత‌కాదు అని శ్రీధ‌ర్ కోపంగా బ‌దులిస్తాడు.

పోలీస్ కంప్లైంట్ ఇస్తా…

మీ అమ్మ అక్క‌డికి వ‌చ్చిందా అని కోపంగా అడుగుతాడు శ్రీధ‌ర్‌. మ‌మ్మీ ఇక్క‌డికి రాలేద‌ని, త‌న‌ను ఏం చేశావ‌ని శ్రీధ‌ర్‌ను కోపంగా అడుగుతుంది స్వ‌ప్న‌. నువ్వు ఏం అన‌కుండా అమ్మ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోతుంద‌ని, అందుకే స్విఛాఫ్ చేసి ఉంటుంద‌ని స్వ‌ప్న తండ్రిపై విరుచుకుప‌డుతుంది.

ఇంకో రెండు గంట‌ల్లో అమ్మ సేఫ్‌గా ఉంద‌ని ఫోన్ రాక‌పోతే నేను పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కంప్టైంట్ ఇస్తాన‌ని స్వ‌ప్న అంటుంది. కావేరిని నేను వెతుక్కోగ‌ల‌ను, కంప్లైంట్ ఇవ్వ‌గ‌ల‌ను, నువ్వెళ్లి మీ మామ‌గారి కాళ్ల‌కు కొబ్బ‌రి నూనే రాసుకో అని కోపంగా శ్రీధ‌ర్ ఫోన్ క‌ట్ చేశాడు.

కార్తీక్ క‌ష్టాల్లో ఉంటే…

హాస్పిట‌ల్ నుంచి వెళ్లిపోతున్న కావేరిని క‌లుస్తుంది దీప‌. కార్తీక్ పేరు మీద మీరే డ‌బ్బు క‌ట్టారు క‌దా అని అడుగుతుంది. ఇంత పెద్ద సాయం ఎందుకు చేశార‌ని అడుగుతుంది. కాంచ‌న పుట్టింటికి వెళ్లి డ‌బ్బులు అడిగితే ఇచ్చారా? వాళ్ల రెస్టారెంట్ డెవ‌ల‌ప్ కావ‌డానికి కార‌ణం కార్తీక్‌. కానీ ఈ రోజు అత‌డు క‌ష్టాల్లో ఉంటే ఒక్క‌రు కూడా సాయం చేయ‌లేద‌ని కావేరి అంటుంది.

కాంచ‌న ఆ ఇంటి ఆడ‌ప‌డుచు క‌దా ఆమె కోస‌మైనా సాయం చేయ‌చ్చు క‌దా అని అంటుంది. తాను డ‌బ్బులు క‌ట్టానంటే కార్తీక్ ఒప్పుకోడు. ఇవి వాళ్ల నాన్న డ‌బ్బులు అనుకుంటాడు. కానీ ఇవి నా సొంత డ‌బ్బులు. బ్యాంకులో నేను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డ‌బ్బులు ఇవ‌ని, వీటికి శ్రీధ‌ర్‌కు ఏ సంబంధం లేద‌ని కావేరి అంటుంది.

త‌ప్పుకు ప్రాయ‌శ్చిత్తం…

నేను చేసిన పాపానికి ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాల‌నే ఈ సాయం చేశాన‌ని అని కావేరి అంటుంది. కార్తీక్ క‌ష్టాల‌ను, మీ క‌న్నీళ్ల‌కు తానే కార‌ణ‌మ‌ని ఎమోష‌న‌ల్ అవుతుంది కావేరి. శ్రీధ‌ర్‌కు ఇది వ‌ర‌కే పెళ్ల‌యింద‌ని తెలిసి కూడా నేను ఆయ‌న్ని పెళ్లి చేసుకున్నాను. శ్రీధ‌ర్‌ను నేను పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్లే కాంచ‌న‌కు భ‌ర్త‌, కార్తీక్ తండ్రి దూర‌మ‌య్యాడు.

కాంచ‌న కాపురం త‌న కార‌ణంగా ముక్క‌లైంద‌ని కావేరి అంటుంది. కార్తీక్‌కు తండ్రి మీద ద్వేషం క‌ల‌గ‌డానికి తానే కార‌ణ‌మ‌ని అంటుంది. అస‌లు శ్రీధ‌ర్‌తో నా పెళ్లి జ‌ర‌గ‌క‌పోయి ఉండుంటే…శివ‌నారాయ‌ణ ఫ్యామిలీకి కార్తీక్ దూర‌మ‌య్యి ఉండేవాడు కాద‌ని, నిన్ను పెళ్లి చేసుకున్నా వాళ్లు ఏమ‌నేవారు కాద‌ని కావేరి అంటుంది.

ఇవ‌న్నీ నా చేతుల‌తో నేను చేసిన పాపాలు అని కావేరి అంటుంది. శౌర్య ప్రాణాలు కాపాడి నేను చేసిన త‌ప్పుల‌కు కొంతైన ప్రాయ‌శ్చిత్తం చేసుకోవాల‌నే డ‌బ్బులు క‌ట్టాన‌ని అంటుంది.

నేను మారిపోయా…

నేను చెడ్డ‌దానినే. కానీ కాంచ‌న‌, కార్తీక్‌, నిన్ను చూసిన త‌ర్వాతే మారిపోయాన‌ని కావేరి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. నా మ‌న‌వ‌రాలికి నాన‌మ్మ‌గా ఇదంతా చేశాను, దీని వ‌ల్ల నాకు కొంతైనా మ‌న‌శ్శాంతి దొరుకుతుంద‌ని అంటుంది. కావేరి చేసిన సాయానికి ఆమెకు దండం పెడ‌తుంది దీప‌.

నీతో దండం పెట్టించుకునేంత గొప్ప‌దానిని కాద‌ని, నువ్వు నా కోసం చాలా చేశావు. దానికి నేనే నీ కాళ్లు ప‌ట్టుకోవాల‌ని కావేరి బ‌దులిస్తుంది. నేను డ‌బ్బులు క‌ట్టిన విష‌యం కార్తీక్‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో చెప్ప‌ద్ద‌ని దీప‌తో అంటుంది కావేరి.

జ్యోత్స్న ఫోన్ కాల్‌…

తీర్చుకోలేని సాయం చేసి జీవితాంతం రుణ‌ప‌డేలాచేసుకున్నార‌ని, మీ మేలు ఎప్ప‌టికి మ‌ర్చిపోలేన‌ని దీప అంటుంది. దేవుడే మీ రూపంలో వ‌చ్చి సాయం చేశాడ‌ని కావేరికి కృత‌జ్ఞ‌త‌లు చెబుతుంది. దీప నుంచి ఫోన్ కాల్ రాక‌పోవ‌డంతో జ్యోత్స్న కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది.

దీప‌కు పాప కంటే భ‌ర్తే ఎక్కువైపోయాడ‌ని అనుకుంటంది. దీప ఫోన్ చేయ‌క‌పోతేనేం నేను చేస్తాన‌ని దీప‌కు కాల్ చేస్తుంది. కార్తీక్ నీ కూతురిని కాపాడ‌లేడ‌ని దీప‌తో జ్యోత్స్న అంటుంది. కార్తీక్ జీవితంలో నుంచి నువ్వు వెళ్లిపోతానంటే నేను డ‌బ్బులు క‌ట్టి శౌర్య‌కు ఆప‌రేష‌న్ చేయిస్తాన‌ని జ్యోత్స్న చెబుతుంది.

డ‌బ్బు క‌ట్టిన కార్తీక్‌…

నా కూతురికి ఆప‌రేష‌న్ జ‌రుగుతుంద‌ని చెప్పి జ్యోత్స్న‌కు షాకిస్తుంది దీప‌. ఆప‌రేష‌న్‌కు కార్తీక్ డ‌బ్బులు క‌ట్టాడ‌ని దీప చెబుతుంది. ఉన్న‌ట్టుండి కార్తీక్ అంత డ‌బ్బు ఎవ‌రి ఇస్తారు? ఎక్క‌డి నుంచి వ‌చ్చాయి అని అడుగుతుంది. నీకు డ‌బ్బులు క‌ట్టిన మ‌నిషి పేరు, వివ‌రాలు కావాలంటే హాస్పిట‌ల్‌కు వ‌చ్చి ఎంక్వైరీ చేసుకోమ‌ని జ్యోత్స్న‌తో అంటుంది దీప‌.

నువ్వు ఆ మ‌నిషి పేరు చెప్ప‌లేవా దీప‌ను అడుగుతుంది జ్యోత్స్న‌. కార్తీక్ డ‌బ్బులు క‌ట్టాడ‌ని దీప బ‌దులిస్తుంది. ఇక నుంచైనా ఎదుటివారి బ‌ల‌హీన‌త‌ల‌తో ఆడుకోవ‌డం మానేయ‌మ‌ని, లేదంటే భ‌గ‌వంతుడు నిన్ను క్ష‌మించ‌డ‌ని జ్యోత్స్న‌కు వార్నింగ్ ఇస్తుంది దీప‌.

బ‌య‌ట‌ప‌డ్డ నిజం…

శౌర్య‌కు ఆప‌రేష‌న్ జ‌రుగుతుందట అని జ్యోత్స్న అంటుంది. ఆమె మాట‌ల్ని సుమిత్ర, శివ‌న్నారాయ‌ణ వింటారు. పాప‌కు ఒంట్లో బాగాలేక‌పోవ‌డం నిజం కాద‌న్నారు…ఇప్పుడు ఆప‌రేష‌న్ ఏంట‌ని శివ‌న్నారాయ‌ణ అంటాడు. నిజం కాద‌న్న‌ది అబ‌ద్ధ‌మ‌ని ద‌శ‌ర‌థ్ అంటాడు. శౌర్య‌కు గుండె స‌మ‌స్య ఉంద‌ని చెబుతాడు.

శౌర్య‌కు ఒంట్లో బాగాలేద‌న్న‌ది నాట‌క‌మ‌ని మాతో ఎందుకు చెప్పావ‌ని జ్యోత్స్న‌ను శివ‌న్నారాయ‌ణ నిల‌దీస్తాడు. శౌర్య హాస్పిట‌ల్‌లో ఉండ‌టం నాట‌క‌మ‌ని తాను అనుకున్నాన‌ని, కానీ అది నిజ‌మేన‌ని ఇందాకే తెలిసింద‌ని మాట మార్చేస్తుంది.

ఎంత కాద‌నుకున్న దీప అమ్మ ప్రాణాల‌ను కాపాడింది క‌దా…అందుకే త‌న‌కు ఏదైనా సాయం కావాలో తెలుసుకుందామ‌ని దీప‌కు కాల్ చేశాన‌ని కొత్త నాట‌కం మొద‌లుపెడుతుంది. ఆప‌రేష‌న్‌కు అయ్యే డ‌బ్బుల కోసం కార్తీక్ రోడ్లు ప‌ట్టుకు తిరుగుతుంటే మ‌నం ఎలా చూస్తూ ఉండ‌గ‌మ‌ని సెంటిమెంట్ డైలాగ్స్ కొడుతుంది.

మాట‌ల్లో కాదు… చేత‌ల్లో…

కూతురి మాట‌ల్ని ద‌శ‌ర‌థ్ న‌మ్మ‌డు. మంచిత‌నం అన్న‌ది మాట‌ల్లో కాదు చేత‌ల్లో ఉండాల‌ని జ్యోత్స్న‌తో అంటుంది సుమిత్ర‌. మేము ఎలాగో కృత‌జ్ఞ‌త లేని మ‌నుషుల్లా మిగిలిపోయామ‌ని బాధ‌ప‌డుతుంది. కాంచ‌న ఇంటికొచ్చిన‌ప్పుడు సాయం చేయ‌లేద‌ని అంద‌రిని కృత‌జ్ఞ‌త లేని మ‌నుషుల‌ని అంటావా అని సుమిత్ర‌పై సెటైర్లు వేస్తుంది పారిజాతం.

సొంత‌వాళ్లు త‌ప్ప‌…

కార్తీక్ సాయం చేయ‌డం గురించి నేనే నీతో మాట్లాడుదామ‌ని అనుకున్నాను. కానీ ఇంత‌లోనే ఆప‌రేష‌న్ జ‌రుగుతుంద‌ని తెలిసింద‌ని శివ‌న్నారాయ‌ణ‌తో అంటాడు ద‌శ‌ర‌థ్‌. ఇంత‌కు డ‌బ్బులు ఎవ‌రు క‌ట్టారంటా అని జ్యోత్స్న‌ను అడుగుతాడు ద‌శ‌ర‌థ్‌. కార్తీక్ క‌ట్టాడ‌టా అని జ్యోత్స్న బ‌దులిస్తుంది.

మంచివాళ్ల‌కు సొంత‌వాళ్లు త‌ప్ప‌ ఎవ‌రైనా సాయం చేస్తార‌ని, ర‌క్త బంధానికి ఉన్న ప‌ట్టింపులు, పంతాలు బ‌య‌టివాళ్ల‌కు ఉండ‌వ‌ని శివ‌న్నారాయ‌ణ‌పై ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు వేస్తుంది సుమిత్ర‌.

మ‌నుషులు అనే ప‌దానికి…

సుమిత్ర మాట‌ల‌తో శివ‌న్నారాయ‌ణ ఉబికి వ‌స్తోన్న క‌న్నీళ్ల‌ను ఆపుకుంటాడు. ఏం నాన్న శౌర్య గుండె స‌మ‌స్య నిజం అని తెలిసిన త‌ర్వాత బాధ‌గా అనిపిస్తుందా? సాయం చేసుంటే బాగుండున‌ని అనుకుంటున్నారా అని తండ్రిని అడుగుతాడు ద‌శ‌ర‌థ్‌. ఎందుకో మ‌నం మ‌నుషులు అనే ప‌దం నుంచి దూరంగా వెళ్లిపోతున్నామ‌ని అనిపిస్తుంద‌ని అంటాడు.

ఎవ‌రు శ‌త్రువులో…ఎవ‌రు మిత్రులో…

పారిజాతం టాపిక్ డైవ‌ర్ట్ చేస్తాడు. జ్యోత్స్న‌కు మంచిత‌నం, మాన‌వ‌త్వం ఎక్కువేన‌ని, దీప శ‌త్రువు అయినా సాయం చేయాల‌ని ప్ర‌య‌త్నించింద‌ని అంటుంది. అందుకే నీ కొడుకును చంపాల‌ని చూసింద‌ని మ‌న‌సులో ద‌శ‌ర‌థ్ అనుకుంటాడు. ఎవ‌రికి ఎవ‌రు శ‌త్రువులో, ఎవ‌రు మిత్రులో త్వ‌ర‌లో తెలుస్తుంద‌ని చెప్పి ద‌శ‌ర‌థ్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

ఏకైక ఆధారం…

దాసును కొట్టిన‌ప్ప‌టి నుంచి ద‌శ‌ర‌థ్‌లో మార్పు రావ‌డం చూసి జ్యోత్స్న కంగారు ప‌డుతుంది. నీ గురించి నిజం బ‌య‌ట‌ప‌డేట‌ట్లు ఉంద‌ని పారిజాతం అన‌గానే జ్యోత్స్న కంగారుతో వ‌ణికిపోతుంది. ఏం నిజం అని అంటుంది. నువ్వే ఆడే ఆబద్ధాలు బ‌య‌ట‌ప‌డేట‌ట్లు ఉన్నాయ‌ని పారిజాతం అన‌డంతో జ్యోత్స్న రిలీఫ్‌గా ఫీల‌వుతుంది.

నిన్ను అంద‌రూ ఛీ అనేట‌ట్లు ఉన్నార‌ని పారిజాతం కంగారు ప‌డుతుంది. ఇప్ప‌టికే ద‌శ‌ర‌థ్‌, సుమిత్ర దీప పార్టీ అని, మ‌న‌కు ఉన్న ఏకైక ఆధారం శివ‌న్నారాయ‌ణ అని, ఆయ‌న కూడా శౌర్య ఆరోగ్య ప‌రిస్థితి విని మంచులా క‌రిగిపోతున్నాడ‌ని, అది మ‌న‌కే ప్ర‌మాద‌మ‌ని జ్యోత్స్న‌ను పారిజాతం హెచ్చ‌రిస్తుంది. అక్క‌డితో నేటి కార్తీక దీపం సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024