Best Web Hosting Provider In India 2024
Cherlapally Fire Accident : చర్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం, కెమికల్ పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు
Cherlapally Fire Accident : చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శేషసాయి కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు పక్కనున్న కంపెనీలకు వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగలు, ఘాటైన వాసనలు వ్యాపిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
Cherlapally Fire Accident : చర్లపల్లి పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫేస్ 1లోని సర్వోదయ సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన కంపెనీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు ఇతర కంపెనీలకు వ్యాపిస్తున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
రసాయన పరిశ్రమ పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు వ్యాపించాయి. రసాయనాల ఘాటుతో స్థానిక ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ
చర్లపల్లి పారిశ్రామికవాడలో సర్వోదయ సాల్వెంట్ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి మంటలు అంటుకోవడంతో రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విషయం తెలుసుకున్న రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తక్షణమే స్పందించి అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాద స్థలంలో స్వయంగా సిబ్బందికి సూచనలు ఇస్తూ ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు.
అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ దుర్ఘటనలో ఎక్కువ నష్టం జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలలో ఎటువంటి అగ్ని ప్రమాదాలు ఇతర సాంకేతిక పరమైన ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం అధికారులకు స్థానికులకు తగిన సూచనలు జాగ్రత్తలు ఇచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్