Best Web Hosting Provider In India 2024
Karthika Deepam 2 Serial February 5: శౌర్యకు ఆపరేషన్ పూర్తి.. వెక్కివెక్కి ఏడ్చిన కార్తీక్.. అబద్ధం చెప్పిన కావేరి
Karthika Deepam 2 Serial Today Episode February 5: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్లో.. శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు ఎవరు కట్టారనే సందేహంలో కార్తీక్, కాశీ ఉంటారు. ఆపరేషన్ ఎలా జరుగుతుందోనని దీప కంగారు పడుతుంది. ఆపరేషన్ పూర్తవుతుంది. కార్తీక్ వెక్కివెక్కి ఏడుస్తాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 5) ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‌కు డబ్బు ఎవరు కట్టారని కార్తీక్ ఆలోచిస్తుంటాడు. కాశీని అడుగుతాడు. నువ్వు కూడా కట్టకపోతే.. ఎవరి కట్టి ఉంటారని అంటాడు. వారిద్దరూ మాట్లాడుకుంటున్నా.. కావేరి డబ్బులు కట్టిందనే విషయాన్ని దీప చెప్పదు. మామయ్య శ్రీధర్ కట్టాడేమోనని కాశీ అంటాడు. “మా నాన్న.. అంత సీక్రెట్‌గా సాయం చేసే మనిషి కాదాయన. దానం చేసినా.. సాయం చేసినా.. తన చుట్టూ పది మందికి తెలియాలి. ఆయన ఆయనరాడు. ఆయన సాయం కూడా నా కూతురికి అవసరం లేదు” అని కార్తీక్ అంటాడు.
పిన్ని అని తెలిస్తే అసలు ఒప్పుకోరు
తన తండ్రి శ్రీధర్ సాయం చేయడని నానామాటలు అంటాడు కార్తీక్. తండ్రి విషయంలోనే ఇలా ఉన్నారంటే.. మనకు సాయం చేసింది మీ విన్ని అని తెలిస్తే అసలు ఒప్పుకోరు అని మనసులో అనుకుంటుంది దీప. అక్కా నీకేమైనా తెలుసా అని దీపను కాశీ అడుగుతాడు. ఇంతలో తనకేం తెలుస్తుంది కాశీ.. శౌర్యకు ఆపరేషన్ జరుగుతుందో తెలియక మీ అక్క రాత్రి నుంచి ఏడుస్తోందని కార్తీక్ అంటాడు. ఏ దేవుడు కాపాడాడో, దేవర కరుణించిందో.. ఆగిపోతుందనుకున్న ఆఖరి క్షణంలో ఊపిరి పోశాడని చెబుతాడు. “ఊపిరి పోసిన ఆ మనిషి మీ పిన్ని అని కార్తీక్ బాబుకు చెప్పకూడదు” అని దీప మనసులో అనుకుంటుంది. చేసిన సాయాల పుణ్యమే వెతుక్కుంటూ వచ్చాయని కాశీ అంటాడు.
దీప కంగారు
శౌర్యకు ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఆపరేషన్ చేసినా కూడా తన కూతురు చచ్చిపోయిందంటూ ఓ మహిళ గట్టిగా ఏడుస్తుంది. దీంతో దీప కంగారు పడుతుంది. ఆపరేషన్ చేస్తే బతుకుతారు కదా అని కార్తీక్‌ను అడుగుతుంది. అది వేరే సమస్య అయి ఉంటుంది.. నువ్వు కంగారు పడకు అని సర్దిచెబుతాడు కార్తీక్. లోపల శౌర్యకు ఎలా ఉందో అంటూ దీప టెన్షన్‌తో ఏడుస్తుంది. కార్తీక్ సముదాయిస్తాడు. ముత్యాలమ్మ తల్లి నా కూతురు బతకాలని దీప నమస్కరిస్తుంది.
ఆపరేషన్ సక్సెస్
కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ మా పాపకు ఎలా ఉందని దీప అడుగుతుంది. ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది అని డాక్టర్ చెబుతాడు. దీంతో దీప సంతోషంతో ఏడుస్తుంది. ఇప్పటికైనా నమ్ముతావా మన శౌర్యకు ఏం కాదని అని కార్తీక్ అంటాడు. డాక్టర్ చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెబుతాడు. మా ప్రాణాలను కాపాడాడు అంటాడు. పాపను చూడొచ్చా అని దీప అంటే.. వేరే రూమ్‌కు మార్చి స్పృహలోకి వచ్చాక చూడొచ్చంటాడు డాక్టర్. శౌర్య ఇప్పుడు పూర్తిగా బాగుందని చెబుతాడు. ఏ ప్రమాదం లేదంటాడు. టైమ్‌కు డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ జరిగేది కాదు, మీ పాపను మీరే కాపాడుకున్నారని డాక్టర్ చెబుతాడు.
మిమ్మల్ని చూస్తుంటే రాత్రి నుంచి ఏమీ తిన్నట్టు లేరని డాక్టర్ అంటాడు. డాక్టర్ చెప్పారు కదా.. ఇక నా మేన కోడలికి ఏం కదక్కా అని సంతోషంగా అంటాడు కాశీ. తినడానికి ఏమైనా తీసుకొస్తానని చెబుతాడు. ముందు అమ్మ కాంచన, అనసూయకు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పాలని కాశీతో కార్తీక్ అంటాడు. క్యాంటీన్లో టిఫిన్ తీసుకొచ్చేందుకు కార్తీక్ వెళతాడు.
శ్రీధర్‌కు అబద్ధం చెప్పిన కావేరీ
కావేరీ కోసం తెలిసిన వాళ్లందరికీ కాల్ చేశా.. అసలు ఎక్కడికి వెళ్లింది.. ఏమైంది అని ఆలోచిస్తుంటాడు శ్రీధర్. పోలీస్ కంప్లైట్ ఇవ్వాల్సిందే అని సిద్ధమవుతాడు. ఇంతలో కావేరీ ఇంటికి వస్తుంది. బుద్ధి ఉందా లేదా అని అరుస్తాడు. లేదు అని కావేరీ అంటుంది. ఉంటే చెప్పాపెట్టకుండా పోవు కదా అని శ్రీధర్ కోప్పడతాడు. ఎక్కడికి వెళ్లావో తెలియక రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావని చెబుతాడు. సంసారం మీద విరక్తితో సన్యాసంలో కలిసిపోయావేమోనని డౌట్ వచ్చిందని వెటకారంగా మాట్లాడతాడు.
ఎక్కడికి వెళ్లావో చెప్పు అని కావేరీని శ్రీధర్ అడుగుతాడు. ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు వెళ్లానని కావేరీ బదులిస్తుంది. శౌర్య ఆపరేషన్‌కు డబ్బులు ఇచ్చిన సంగతి ఈయనకు తెలియకూడదని అని మనసులో అనుకుంటుంది కావేరీ. సూట్‌కేస్ ఏంటి అని శ్రీధర్ అడుగుతాడు. తాను పూజ సామాన్లు కొనేందుకు వెళ్లానని కావేరీ అబద్ధం చెబుతుంది. ఫోన్ ఎందుకు చేయలేదని శ్రీధర్ అంటే.. చార్జింగ్ లేదంటూ కవర్ చేస్తుంది కావేరీ. చెప్పే మాటలకు సంబంధం లేదే అని మనసులోని అనుమానిస్తాడు శ్రీధర్. నా మీద ఏమైనా డౌట్ ఉందా మీకు అని కావేరీ అడుగుతుంది. లేదు లే.. ముందు నీ కూతురు కాల్ చేసి నువ్వు చేసిన నిర్వాకం చెప్పు అని శ్రీధర్ అంటాడు. వచ్చానని చెప్పు అని చెబుతాడు. కావేరీ చెప్పింది నిజం కాదనిపిస్తోందని మనసులో అనుకుంటాడు.
గుండె ఆగిఆగి కొట్టుకుంది
ఆపరేషన్‌కు డబ్బు లేదని బాధ తప్ప ఇప్పటి వరకు ఆకలి గుర్తు రాలేదని దీప అంటుంది. ఇప్పటి వరకు బాధతో కడుపు నిండిపోతే.. ఇప్పుడు శౌర్యకు ఏమీ కాదనే సంతోషంతో కడుపు నిండిపోయిందని చెబుతుంది. తిను అంటూ దీప చేతికి ఇడ్లీని అందిస్తాడు కార్తీక్. రాత్రి నుంచి గుండె ఆగిఆగి కొట్టుకుంది కార్తీక్ బాబు అని అంటుంది. “ఆపరేషన్ జరగకపోతే శౌర్య ఏమవుతుందోననే భయం.. ఏవరైనా సాయం చేయకపోతారా అనే ఆశ. మీ ఫోన్ చేస్తూనే ఉన్నా ఎవరూ సాయం చేయలేమని అన్నారు. శౌర్యకు ఏమీ కాదని మీతో అనేందుకు కూడా ధైర్యం సరిపోలేదు. తెల్లారినా నా కంటికి ఇంకా చీకటిగానే ఉంది” అని దీప అంటుంది.
ఆఖరి క్షణాలు అని భయపడ్డా
దీప మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉంటాడు కార్తీక్. మిమ్మల్నే అడిగేది అని దీప అంటుంది. ఇంతలో కార్తీక్ కళ్లలో కన్నీరు తిరుగుతుంటుంది. ఏమైంది కార్తీక్ బాబు.. ఆ కన్నీళ్లు ఏంటి.. శౌర్యకు అంతా బాగుందని చెప్పారు కదా అని దీప అడుగుతుంది. ఎంతో ఇష్టమైన తన నాన్న శ్రీధర్ తప్పుచేసినప్పుడు.. ఆయనను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని మా అమ్మ చెప్పినప్పుడు కూడా తాను ఏడ్వలేదని, కానీ శౌర్యకు గుండె సమస్య అనగానే తనకు చాలా బాధేసిందని కార్తీక్ అంటాడు. ఈ పాపను ఎలాగైనా బతికించాలని అనుకున్నానని చెబుతాడు. నువ్వు నాన్నగా ఉంటావు కదా శౌర్య అడిగిన అని అప్పటి విషయాలను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. శౌర్యకు నాన్నను అయ్యేందుకు నీ మెడలో తాళి కట్టానని చెబుతాడు.
నాన్న అని శౌర్య మొదటిసారి పిలిచినప్పుడు దాని కళ్లలో ఓ మెరుపు చూశానని కార్తీక్ అంటాడు. అది బతుకుతుందని అప్పుడే తనకు నమ్మకం వచ్చిందని చెబుతాడు. ఆసుపత్రిలో కట్టడానికి డబ్బు లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు. నీకు జ్యోత్స్న వల్ల నిజం తెలిసింది. పాపను కాపాడతానని మాట ఇచ్చా. నాకు నిన్ను రాత్రే అర్థమైంది. మాటను కాపాడుకోలేకపోతున్నా. తన దగ్గరికి వెళితే శౌర్యతో మనం గడిపే ఆఖరి క్షణాలు ఇవేనేమోనని.. ఎవరో నాలుగో మనిషి మన మధ్య కూర్చొని చెబుతున్నట్టు అనిపించింది” అని కార్తీక్ ఏడ్చేస్తాడు. ఆ తర్వాత తనకు ఏం అర్థం కాలేదని, ఏదేదో చేశానని అన్నాడు. నా కూతురిని కాపాడు భగవంతుడా అని గట్టిగా అరవాలనిపించింది అని కార్తీక్ చెబుతాడు.
దీప ఒడిలో పడుకొని బోరున ఏడ్చేసిన కార్తీక్
శౌర్యను ఆసుపత్రి నుంచి తీసుకెళదామని నువ్వు అన్నప్పుడు.. నేను నాన్నగా చచ్చిపోయాను దీప అని కార్తీక్ ఏడుస్తూ అంటాడు. దీప కూడా కన్నీరు పెడుతుంది. “దాన్ని తీసుకెళ్లడం అంటే అర్థమేంటి.. శౌర్య చావును మనం ఒప్పుకున్నట్టే కదా. నీకు ఇచ్చిన మాట ఏమైంది. నా కూతురు చావును నేను ఒప్పుకుంటే నేను బతికి ఉండడంలో అర్థం ఏముంది దీప. నా వల్ల కాలేదు” అని దీప ఒడిలో తలవాల్చి వెక్కివెక్కి ఏడ్చేశాడు కార్తీక్. దీప కూడా కార్తీక్ బాబు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. తన చేతకానితనంతో శౌర్యను చంపేసుకుంటాననో అని.. మానసికంగా నేను ముందే చచ్చిపోయా అంటాడు కార్తీక్.
మీ మంచితనమే కాపాడింది
మీరు తండ్రిగా ఉండడం శౌర్య అదృష్టం అంటూ కార్తీక్‌ను దీప ఓదారుస్తుంది. పది మందికి సాయం చేసిన మీ మంచితనమే శౌర్యను కాపాడిందని అంటుంది. మీలోనే బాధ దాచుకొని ఎంత నలిగిపోయారో నాకు తెలుసు అని దీప అంటుంది. డాక్టర్‌ను మీరు బతిమాలినప్పుడు నేనూ అంతే నలిగిపోయానని చెబుతుంది. మీరే గెలిచారు కార్తీక్ బాబు, మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అంటుంది. శౌర్య మీ కూతురే.. మీ తర్వాతే నేను అని దీప అంటుంది. శౌర్య మన కూతురు, మనిద్దరికీ శౌర్య కావాలి.. శౌర్యకు మనిద్దరం కావాలని కార్తీక్ చెబుతాడు.
శౌర్య స్పహలోకి వచ్చిందని, చూడొచ్చని నర్స్ వచ్చి చెబుతుంది. దీంతో బెడ్‌పై ఉన్న శౌర్య దగ్గరికి దీప, కార్తీక్ వస్తాడు. ఇంతలో శౌర్య కళ్లు తెరుస్తుంది. దీప, కార్తీక్ ఆనందంగా చూస్తారు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 5) ఎపోసిడ్ ముగిసింది.
సంబంధిత కథనం