Brahmamudi February 5th Episode: రాజ్ డ‌బ్బులు కొట్టేసిన రాహుల్ – అడ్డంగా బుక్కైన రుద్రాణి – రాజ్‌ను కాపాడిన కావ్య‌

Best Web Hosting Provider In India 2024

Brahmamudi February 5th Episode: రాజ్ డ‌బ్బులు కొట్టేసిన రాహుల్ – అడ్డంగా బుక్కైన రుద్రాణి – రాజ్‌ను కాపాడిన కావ్య‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 05, 2025 07:41 AM IST

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి ఫిబ్ర‌వ‌రి 5 ఎపిసోడ్‌లో రాజ్‌, కావ్య ద‌గ్గ‌ర ఉన్న రెండు కోట్ల రూపాయ‌ల్ని కొట్టేస్తాడు రాహుల్‌. డ‌బ్బులు కొట్టేసిన రౌడీ రాజ్‌, కావ్య‌ల‌కు దొరికిపోతాడు. రాహుల్ ఈ ప‌ని చేశాడ‌ని అత‌డి ద్వారా నిజం తెలుసుకున్న రాజ్‌…రాహుల్‌ను చిత‌క్కొడ‌తాడు.

బ్ర‌హ్మ‌ముడి ఫిబ్ర‌వ‌రి 5 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి ఫిబ్ర‌వ‌రి 5 ఎపిసోడ్‌

రెండు కోట్ల రూపాయ‌ల్ని బ్యాంకులో డిపాజిట్ చేయ‌డానికి కావ్య‌తో క‌లిసి కారులో వెళుతుంటాడు రాజ్‌. ఆ డ‌బ్బును వారి ద‌గ్గ‌ర నుంచి కొట్టేయాల‌ని రౌడీతో క‌లిసి రాహుల్ స్కెచ్ వేస్తాడు. రాహుల్‌తో డీల్ కుదుర్చుకున్న రౌడీ …, రాజ్‌, కావ్యల‌ కారును ఫాలో అవుతాడు.

yearly horoscope entry point

ఎక్కిళ్లు రావ‌డంతో వాట‌ర్ బాటిల్ కొన‌డానికి రాజ్‌ ఓ చోట కారు ఆపుతాడు. అదే టైమ్‌లో రాజ్ కారులోని బ్యాగు కొట్టేసిన రౌడీ బైక్‌పై ప‌రార్ అవుతాడు. బ్యాగ్‌ను తెలివిగా రాహుల్ కారు ద‌గ్గ‌ర ప‌డేస్తాడు. రౌడీ విసిరిన బ్యాగును రాజ్‌, కావ్య‌ల‌కు క‌నిపించ‌కుండా త‌న కారులో దాచేస్తాడు రాహుల్‌.

దొరికిపోయిన రౌడీ…

డ‌బ్బులు కొట్టేసి పారిపోతున్న రౌడీని రాజ్‌, కావ్య క‌లిసి ప‌ట్టుకుంటారు. ఆ రౌడీని రాజ్ చిత‌క్కొడ‌తాడు. త‌మ ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉన్న విష‌యం ఎవ‌రికి తెలియ‌ద‌ని, మ‌న గురించి బాగా తెలిసిన‌వాళ్లే డ‌బ్బులు కొట్టేయించి ఉంటార‌ని కావ్య అనుమాన‌ప‌డుతుంది. నిజం చెప్ప‌క‌పోతే నిన్ను జైలుకు పంపిస్తాన‌ని రౌడీకి రాజ్ వార్నింగ్ ఇస్తాడు. రాజ్ కొట్టిన దెబ్బ‌ల‌కు తాళ‌లేక రాహుల్ త‌న‌తో ఈ డ‌బ్బులు దొంగ‌త‌నం చేయించాడ‌నే నిజం రౌడీ బ‌య‌ట‌పెడ‌తాడు. ఆ రౌడీని వ‌దిలేస్తాడు రాజ్‌.

రాహుల్‌ను చిత‌క్కొట్టిన రాజ్‌…

రాహుల్ సంగ‌తి తేలుద్దాం ప‌దా అని కావ్య‌తో అంటాడు రాజ్‌. మీరు ఇంటికి వెళ్లి రాహుల్ సంగ‌తి తేల్చే లోపు నేను చేయాల్సిన ఇంకో ప‌ని మిగిలి ఉంద‌ని కావ్య అంటుంది. ఆవేశంగా ఇంటికొచ్చిన రాజ్…రాహుల్‌ను చిత‌క్కొడ‌తాడు.

ఇన్నేళ్లు నిన్ను త‌మ్ముడిలా చూస్తే నువ్వు న‌న్ను శ‌త్రువుగా చూస్తావా అంటూ చెంప‌లు వాయిస్తాడు. రుద్రాణి వ‌చ్చి అడ్డుకుంటుంది. ఏ త‌ప్పు చేశాడ‌ని త‌న కొడుకును కొడుతున్నావ‌ని రాజ్‌ను నిల‌దీస్తుంది. త‌న ద‌గ్గ‌ర నుంచి రాహుల్ రెండు కోట్లు కొట్టేశాడ‌ని రాజ్ అంటాడు.

రెండు కోట్లు ఎక్క‌డివి?

రాజ్ చెప్పింది నిజ‌మేనా అని రాహుల్‌ను సుభాష్‌, అప‌ర్ణ అడుగుతారు. రుద్రాణి మాత్రం రాహుల్‌ను వెన‌కేసుకొస్తుంది. నీ ద‌గ్గ‌ర చిల్లిగ‌వ్వ లేద‌ని అన్నావు…మ‌రి రెండు కోట్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయ‌ని రాజ్‌ను కుటుంబ‌స‌భ్యుల ముందు ఇరికిస్తుంది. డ‌బ్బులు లేవ‌న్న‌ది నిజ‌మా…రాహుల్ దొంగిలించాడ‌న్న‌ది నిజ‌మా అని అడుగుతుంది. నిజంగా నీ ద‌గ్గ‌ర అంత డ‌బ్బు ఉందా అని త‌ల్లిదండ్రుల‌తో పాటు ప్ర‌కాశం రాజ్‌ను అడుగుతారు.

అబ‌ద్ధం ఎందుకు చెప్పావు…

త‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు ఉన్నాయ‌ని రాజ్ అంద‌రి ముందు ఒప్పుకుంటాడు. షేర్ బిజినెస్ వాళ్లు వ‌చ్చి న‌న్ను చంపేస్తామ‌ని చెప్పినా డ‌బ్బులు లేవ‌ని అబ‌ద్ధం ఎందుకు ఆడావ‌ని రాజ్‌ను నిల‌దీస్తుంది రుద్రాణి. వాళ్లు న‌న్ను చంపేస్తే నువ్వు, కావ్య క‌లిసి వేడుక చూసేవాళ్లు క‌దా అని రాజ్‌ను త‌ప్పుప‌డుతుంది.

కావ్య ఎంట్రీ…

మిమ్మ‌ల్ని చంపుతాన‌ని చెప్పింది వీళ్లే క‌దా అని రుద్రాణిని బెదిరించిన మ‌నుషుల్ని తీసుకొని కావ్య అక్క‌డికి ఎంట్రీ ఇస్తుంది. వారిని చూడ‌గానే రుద్రాణి త‌డ‌బ‌డిపోతుంది. మీ డ‌బ్బులు రేపు ఇస్తాన‌ని, మీరు వెళ్లి పొండి అని వారిని పంపించే ప్ర‌య‌త్నం చేస్తుంది. వారికి ఇవ్వాల్సిన ఐదు వంద‌లు నేను ఇచ్చాన‌ని కావ్య అంటుంది. వాళ్లు జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ని, డ‌బ్బుల కోసం రుద్రాణి వారితో ఈ నాట‌కం ఆడించింద‌నే సంగ‌తి కావ్య బ‌య‌ట‌పెడుతుంది.

రుద్రాణి కొత్త డ్రామా…

త‌న నాట‌కం బ‌య‌ట‌ప‌డ‌గానే రుద్రాణి సెలైంట్ అవుతుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ క‌లిసి రుద్రాణికి క్లాస్ ఇస్తారు. నాకు స‌ల‌హాలు ఇస్తూ నువ్వు చేసే ప‌నులు ఇవా అంటూ ధాన్య‌ల‌క్ష్మి కూడా రుద్రాణిపై విరుచుకుప‌డుతుంది. అర‌వ‌డం, అడ‌గ‌టం, నిల‌దీయ‌డం అన్ని అయిపోయాయా అని రుద్రాణి అంటుంది. అంద‌రూ ఆవేశం త‌గ్గించుకొని నేను ఎందుకు ఎలా చేశానో ఆలోచించండి అంటూ కొత్త డ్రామా మొద‌లుపెడుతుంది.

అడ్డంగా దొరికింది మీరు…

అడ్డంగా దొరికిపోయిన త‌ర్వాత కూడా ఇంకా బుకాయించ‌కండి కావ్య అంటుంది. అడ్డంగా దొరికింది నేను కాదు…నువ్వు నీ భ‌ర్త అని కావ్య‌కు బ‌దులిస్తుంది రుద్రాణి. రాజ్‌, కావ్య నిజ‌స్వ‌రూపం అంద‌రికి తెలియాల‌నే డ‌బ్బుల్ని తానే దొంగిలించాన‌ని రుద్రాణి ఒప్పుకుంటుంది.

రాజ్‌, కావ్య డ‌బ్బులు వెన‌కేసుకొని సెటిల్ అయ్యే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని, త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయ‌ని రుద్రాణి వాదిస్తుంది. వీళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బు ఉంద‌ని నిరూపించ‌డానికే ఇదంతా చేశాన‌ని అంటుంది.

జ‌ల్సాలు చేయ‌డానికి కాదు…

నాకు క‌ష్టం వ‌చ్చింద‌ని చెప్పినా ఈ డ‌బ్బుల విష‌యం బ‌య‌ట‌పెట్ట‌లేద‌ని, రేపు మిమ్మ‌ల్ని ఇలాగే గాలికి వ‌దిలేస్తాడ‌ని త‌న మాట‌ల‌తో రాజ్‌, కావ్య‌ల‌పై కుటుంబ‌స‌భ్యుల‌కు ద్వేషాన్ని క‌లిగించేలా చేస్తుంది రుద్రాణి. డ‌బ్బులు లేవ‌ని చెప్పి మేము జ‌ల్సాలు చేయ‌డం లేద‌ని, ఓ ముఖ్య‌మైన ప‌ని కోసం ఖ‌ర్చుకోసం చేస్తున్నాన‌ని రాజ్ అంటాడు.

స‌మాధానం చెప్ప‌లేక‌…

ఆ ముఖ్య‌మైన ప‌ని ఏంటో అని వెట‌కారంగా రుద్రాణి అడుగుతుంది. నాకు స్వ‌రాజ్ గ్రూప్ కంటే ముఖ్య‌మైన ప‌ని ఏం లేద‌ని, దానిని కాపాడుకోవ‌డం కోసం ఈ డ‌బ్బు వాడుతున్నాన‌ని రాజ్ అంటాడు. మూడు నెల‌ల త‌ర్వాత అన్నింటికి స‌మాధానం చెబుతాన‌ని ఇదివ‌ర‌కే చెప్పాన‌ని, అప్పుడే అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెబుతాన‌ని రాజ్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. స‌మాధానం చెప్ప‌లేక త‌ప్పించుకొని పోయాడ‌ని రాజ్ ఎగ‌తాళి చేసి మాట్లాడుతుంది రుద్రాణి.

ఇందిరాదేవి వార్నింగ్‌…

ఇంకోసారి ఇలాంటి చిల్ల‌ర గొడ‌వ‌లు తీసుకొస్తే ప‌ళ్లు రాల‌గోడ‌తాన‌ని రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది. రాజ్, కావ్య దొరికిపోయార‌నుకుంటే త‌ప్పించుకున్నార‌ని రుద్రాణి అంటుంది. వాళ్ల‌ను వ‌దిలిపెట్టేది లేద‌ని అనుకుంటుంది. స్వ‌ప్న‌కు పాప పుడుతుంది. ఆ గుడ్‌న్యూస్ విన‌గానే కావ్య సంతోషంతో పొంగిపోతుంది. అదే టైమ్‌లో సీతారామ‌య్య కోమాలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడ‌ని డాక్ట‌ర్లు ఫోన్ చేసి రాజ్‌కు చెబుతారు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024