Trains Stoppage: తెలుగు రాష్ట్రాల్లో 57 రైళ్లు మరో ఆర్నెల్లు ఎంపిక చేసిన స్టేషన్లలో ఆగేందుకు అనుమతి

Best Web Hosting Provider In India 2024

Trains Stoppage: తెలుగు రాష్ట్రాల్లో 57 రైళ్లు మరో ఆర్నెల్లు ఎంపిక చేసిన స్టేషన్లలో ఆగేందుకు అనుమతి

Bolleddu Sarath Chand HT Telugu Feb 05, 2025 09:02 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bolleddu Sarath Chandra HT Telugu
Feb 05, 2025 09:02 AM IST

Trains Stoppage: తెలుగు రాష్ట్రాల్లో రైలు ప్రయాణికులకు దక్షిణ మధ‌్య రైల్వే తీపి కబురు చెప్పింది. ప్రయాణికుల వినతులు, ప్రజా ప్రతినిధుల సూచనలతో ప్రయోగాత్మకంగా కొన్ని స్టేషన్లలో రైళ్లను ఆపుతున్నారు. ఆ గడువును మరో ఆర్నెల్లు పొడిగిస్తున్నట్టు సోమవారం ప్రకటించారు.

57 రైళ్లకు ఎంపిక చేసిన స్టేషన్లలో స్టాపేజీ పొడిగింపు
57 రైళ్లకు ఎంపిక చేసిన స్టేషన్లలో స్టాపేజీ పొడిగింపు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Trains Stoppage: తెలుగు రాష్ట్రాల్లో 57 రైళ్లను మరో 6 నెలల పాటు హాల్టింగ్ సదుపాయాన్ని పొడిగించారు. ప్రయాణికుల డిమాండ్‌, ప్రజా ప్రతనిధుల నుంచి వచ్చిన అభ్యర్థనలు, సూచనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలు రైళ్లను కొన్ని స్టేషన్లలో ఆపుతున్నారు. ప్రయాణికుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ రైళ్లకు హాల్టింగ్ సదుపాయం కల్పించారు. తగినంత ప్రయాణికులు లేకపోవడంతో హాల్టింగ్‌ రద్దు చేస్తారని కొద్ది నెలల క్రితం ప్రకటించారు. తాజాగా ప్రజల అభ్యర్థనలతో మరో ఆరు నెలలు ఈ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

yearly horoscope entry point

ప్రయాణికుల సౌకర్యార్థం 57 రైళ్లకు ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లలో ప్రయోగాత్మక హాల్టింగ్‌ సదుపాయాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్ల డించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి నుంచి 6 నెలల పాటు అమల్లో ఉంటుందని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

రైళ్ల జాబితాలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌, ఏపీ సంపర్క్ క్రాంతి‌తో పాటు పలు రైళ్లు ఉన్నాయి.

  • భువ నేశ్వర్-సికింద్రాబాద్ (17015) రైలును ప్రస్తుతం సత్తెనపల్లి, పిడుగు రాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆపుతున్నారు. ఈ ప్రయో గాత్మక స్టాపేజీని ఆర్నెల్లు పొడిగించారు.
  • గుంతకల్-హైదరాబాద్ (17022), జైపూర్-మైసూర్ (12976), యలహంక-కాచిగూడ, తిరుపతి-సికిం ద్రాబాద్ (12769), హజ్రత్ నిజాముద్దీన్-తిరుపతి (12708), ఎర్నాకులం-పట్నా (22669), బీదర్-హైదరా బాద్ (17009) రైళ్లను ప్రస్తుతం గద్వాల, షాద్ నగర్‌, శ్రీరాంనగర్, బెల్లంపల్లి, ఖమ్మం, మంచిర్యాల, మర్పల్లి స్టేషన్లలో మరో ఆర్నెల్లు ఆపుతున్నారు. ఈ స్టాపేజీ ఆగస్టు వరకు ఉంటుంది.
  • డాక్టర్ అంబేడ్కర్‌ నగర్-యశ్వంతపుర (19301), నాగర్‌ సోల్‌ -చెన్నై సెంట్రల్ (16004) రైళ్లను మహబూబ్‌ నగర్ స్టేషన్లో, చెన్నై సెంట్రల్-అహ్మదాబాద్ (12656), అహ్మదా బాద్-చెన్నై సెంట్రల్ (12655), సికింద్రాబాద్-హిస్సార్ (22737), హైదరాబాద్-రక్సౌల్ (17005), రక్సౌల్-హైద రాబాద్ (17006) రైళ్లకు పెద్దపల్లిలో ఆపుతారు. సికింద్రాబాద్-గుంటూరు (12706), గుంటూరు-సికింద్రాబాద్ (12705) రైళ్లకు నెక్కొండలో స్టాపేజీ సదుపాయాన్ని దక్షిణ మధ్య రైల్వే పొడిగించింది.
  • చెన్నై సెంట్రల్-హజ్రత్ నిజాముద్దీన్ (12611) రైలును వరంగల్లో.. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603) రైలును సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో మరో ఆరు నెలలు ఆపుతారు.
  • తిరుపతి-లింగంపల్లి (12733) ఎక ప్రెస్‌ను పిడుగు రాళ్లలో, నడికుడి, మిర్యాలగూడల్లో ఆపుతారు. నర్సాపూర్-లింగంపల్లి (17255) నల్గొండలో స్టాపేజీ ఇస్తారు. లింగంపల్లి-నర్సాపూర్ (17256)కు మంగళగిరిలో ఆగుతుంది.
  • విశాఖపట్నం-సికింద్రాబాద్ (20833), సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) రైళ్లకు సామర్లకోటలో స్టాపేజీ కల్పించారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లకు స్టాపేజీని 6 నెలలు పొడిగించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటారు.
Whats_app_banner

టాపిక్

TrainsSouth Central RailwaySpecial TrainsTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024