Illu Illalu Pillalu Today Episode: ఒక్క‌టైన ధీర‌జ్‌, ప్రేమ -న‌ర్మ‌ద ప్లాన్ వ‌ర్క‌వుట్ -సేనాప‌తికి బుద్దిచెప్పిన రామ‌రాజు

Best Web Hosting Provider In India 2024

Illu Illalu Pillalu Today Episode: ఒక్క‌టైన ధీర‌జ్‌, ప్రేమ -న‌ర్మ‌ద ప్లాన్ వ‌ర్క‌వుట్ -సేనాప‌తికి బుద్దిచెప్పిన రామ‌రాజు

Nelki Naresh Kumar HT Telugu
Feb 05, 2025 09:32 AM IST

Illu Illalu Pillalu: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు ఫిబ్ర‌వ‌రి 5 ఎపిసోడ్‌లో ట్యాబ్లెట్స్ వేసుకోవ‌డానికి ధీర‌జ్ నీళ్ల కోసం వెళ్ల‌బోతూ కింద‌ప‌డ‌తాడు. అత‌డిని ప్రేమ ప‌ట్టుకొని కాపాడుతుంది. విశ్వ‌కు రామ‌రాజు వార్నింగ్ ఇచ్చాడ‌ని తెలిసి భ‌ద్రావ‌తి కోపంతో ర‌గిలిపోతుంది. రామ‌రాజు ఇంటిపైకి గొడ‌వ‌కు వ‌స్తుంది.

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు ఫిబ్ర‌వ‌రి 5 ఎపిసోడ్‌
ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు ఫిబ్ర‌వ‌రి 5 ఎపిసోడ్‌

Illu Illalu Pillalu: ధీరజ్‌పై ఎటాక్ చేసిన విశ్వ‌కు రామ‌రాజు వార్నింగ్ ఇస్తాడు. మ‌రోసారి త‌న కొడుకు జోలికి వ‌స్తే చంపేస్తాన‌ని హెచ్చ‌రిస్తాడు. రామ‌రాజు వార్నింగ్‌తో విశ్వ భ‌య‌ప‌డ‌తాడు. ట్యాబ్లెట్స్ క‌నిపించ‌క‌పోవ‌డంతో వాటి కోసం త‌న రూమ్‌లో వెతుకుంటాడు ధీర‌జ్‌.

yearly horoscope entry point

ఏం వెతుకుతున్నావు…నేను హెల్ప్ చేయ‌నా అని ప్రేమ అడుగుతుంది. నా సంతోషం, మ‌న‌శ్శాంతి, ప్ర‌శాంత‌త అన్నింటిని పొగొట్టుకున్నాను…వెతికిపెడ‌తావా అని వెట‌కారంగా ప్రేమ‌తో అంటాడు ధీర‌జ్‌. నువ్వు నా జీవితంలో వ‌చ్చి చేసిన పెద్ద సాయం చాల‌ని, ఇంకా కొత్త హెల్ప్‌ల‌ను భ‌రించే శ‌క్తి త‌న‌కు లేద‌ని ప్రేమ‌ను మ‌న‌సు గాయం చేసేలా మాట్లాడుతాడు. ధీర‌జ్ మాట‌ల‌తో హ‌ర్ట్ అయిన ప్రేమ బాధ‌గా అక్క‌డి నుంచి వెళ్లిపోతుంది.

వేదావ‌తి అపోహ‌…..

ట్యాబ్లెట్స్ వేసుకోవ‌డానికి వాట‌ర్ కావాల‌ని వేదావ‌తిని అడుగుతాడు ధీర‌జ్‌. వాట‌ర్ గ్లాస్ ప‌ట్టుకొని వేదావ‌తి వెళ్ల‌బోతుండ‌గా న‌ర్మ‌ద అత్త‌ను ఆపేస్తుంది. ధీర‌జ్‌ను త‌న నుంచి దూరం చేయ‌డానికే న‌ర్మ‌ద అడ్డుకుంటుంద‌ని వేదావ‌తి అపోహ‌ప‌డుతుంది. నీ మ‌న‌సులో కుట్ర‌లు, కుతంత్రాలు ఉన్న‌ట్లున్నాయిగా అంటుంది. నా కొడుకుకు నేను కాక‌పోతే నీళ్లు ఎవ‌రిస్తార‌ని న‌ర్మ‌ద‌తో అంటుంది వేదావ‌తి.

న‌ర్మ‌ద స‌ల‌హా…

ఇక నుంచి ధీర‌జ్‌కు ప్రేమ సేవ‌లు చేయాల‌ని, అప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త ఏర్ప‌డుతుంద‌ని, ఇలాంటి ప‌నుల‌తోనే ఇద్ద‌రి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతుంద‌ని వేదావ‌తికి స‌ల‌హా ఇస్తుంది న‌ర్మ‌ద‌. కోడ‌లి స‌ల‌హాతో వేదావ‌తి ఖుషి అవుతుంది.

త‌ల‌బిరుసు ఎక్కువ‌…

ధీర‌జ్ ఎన్నిసార్లు పిలిచిన వేదావ‌తి, న‌ర్మ‌ద ప‌ల‌క‌రు. వాట‌ర్ తీసుకురారు. ప్రేమకు ధీర‌జ్ అరుపులు వినిపించిన ప‌ట్టించుకోన‌ట్లు గా ఉంటుంది. ప్రేమ‌కు కూడా నీలాగే త‌ల‌బిరుసు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఉంద‌ని న‌ర్మ‌ద‌తో వేదావ‌తి అంటుంది. నా మీద కౌంట‌ర్ వేస్తున్నారా అని న‌ర్మ‌ద అడుగుతుంది. కౌంట‌ర్ కాదు నిజ‌మేన‌ని వేదావ‌తి బ‌దులిస్తుంది.

విషం లాగే ఉంటుంది…

వేదావ‌తి, న‌ర్మ‌ద రాక‌పోవ‌డంతో చివ‌ర‌కు ప్రేమ‌నే మంచినీళ్ల గ్లాస్ తీసుకొచ్చి ధీర‌జ్‌కు ఇవ్వ‌బోతుంది. నేను అడ‌గ‌లేద‌ని ధీర‌జ్ బ‌దులిస్తాడు. నీ చేతితో మంచి నీళ్లు ఇచ్చిన విషం లాగే ఉంటుంద‌ని ధీర‌జ్ కౌంట‌ర్ వేస్తాడు. నీ గురించి తెలిసి జాలి ప‌డి నీళ్లు తీసుకొచ్చాను చూడు నాది బుద్ది త‌క్కువ అని ప్రేమ కోపంగా గ్లాస్ అక్క‌డే పెట్టేసి వెళ్లిపోతుంది.

బిల్డ‌ప్పులు ఎందుకు?

తానే నీళ్లు తాగ‌డానికి రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు ధీర‌జ్‌. టేబుల్ త‌ట్టుకొని కింద‌ప‌డ‌బోతాడు. ధీర‌జ్ ప‌డ‌కుండా ప్రేమ ప‌ట్టుకుంటుంది. ధీర‌జ్ న‌డ‌వ‌టానికి ఇబ్బంది ప‌డ‌టంతో ప్రేమ సాయం చేస్తుంది.

కాలు బాగా లేన‌ప్పుడు ఓవ‌రాక్ష‌న్ ఎందుకు? ఈ బిల్డ‌ప్పులు, ఎక్స్‌ట్రాలు అవ‌స‌ర‌మా? అని ధీర‌జ్‌కు క్లాస్ ఇస్తుంది ప్రేమ‌, వాట‌ర్ తీసుకొచ్చి ఇస్తుంది. తానే ట్యాబెట్స్‌ను కవ‌ర్ నుంచి తీసి ధీర‌జ్‌కు ఇస్తుంది. ప్రేమ డామినేష‌న్‌కు బెదిరిపోయిన ధీర‌జ్ ఆమె చెప్పిన‌ట్లే చేస్తాడు. ఆ సీన్ చూసి వేదావ‌తి సంబ‌ర‌ప‌డుతుంది. ధీర‌జ్‌, ప్రేమ మ‌న‌సులు క‌లిసిపోతాయ‌ని న‌మ్మ‌కం వ‌స్తుంద‌ని అంటుంది.

విశ్వ ఆవేశం…

విశ్వ కోపంగా ఇంట్లోకి వ‌స్తాడు. ఎవ‌రు పిలిచిన ప‌ల‌క‌డు. రామ‌రాజు త‌న‌కు ఇచ్చిన వార్నింగ్ గుర్తుచేసుకొని కోపంతో ర‌గిలిపోతాడు. ఏమైంది…పిలిస్తే ఎందుకు ప‌ల‌క‌డం లేద‌ని విశ్వ‌ను అడుగుతుంది వేదావ‌తి. మీరు మాత్రం ప్రాణాలు తీయ‌డం త‌ప్ప‌ని అంటారు. కానీ వాళ్లు మాత్రం ప్రాణాలు తీయ‌డానికే వ‌స్తార‌ని రామ‌రాజు త‌న‌కు ఇచ్చిన వార్నింగ్ గురించి కుటుంబ‌స‌భ్యుల‌కు చెబుతాడు విశ్వ‌. రామ‌రాజు త‌న‌కు ప్రాణ భిక్ష పెట్టి వ‌దిలేశాడ‌ట‌, లేదంటే ఇంటికి శ‌వాన్ని పంపిస్తాన‌ని హెచ్చ‌రించాడ‌ని విశ్వ అంటాడు.

భ‌ద్రావ‌తి గొడ‌వ‌…

విశ్వ మాట‌ల‌తో కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది భ‌ద్రావ‌తి. రామ‌రాజు ఇంటిపైకి గొడ‌వ‌కు వెళుతుంది. ఒరేయ్ రామ‌రాజు ద‌ద్ద‌మ్మ‌లా ఇంటి లోప‌ల దాక్కోవ‌డం కాదు బ‌య‌ట‌కు ర‌మ్మ‌ని పిలుస్తుంది. శార‌దాంబ వారిస్తున్న భ‌ద్రావ‌తి విన‌దు. ద‌మ్ముంటే ఇప్పుడు విశ్వ‌పై చేయివేయ‌మ‌ని రామ‌రాజుతో అంటుంది భ‌ద్రావ‌తి.

ఇప్పుడు చేయి వేయి..,.

నా కొడుకు జోలికి వ‌స్తే వ‌దిలేది లేద‌ని రామ‌రాజు అంటాడు. ప్రాణాలు తీస్తానంటే చూస్తూ ఊరుకోన‌ని భ‌ద్రావ‌తికి రివ‌ర్స్ వార్నింగ్ ఇస్తాడు. ధీర‌జ్ చేయిప‌ట్టుకొని అత‌డిని ముందుకు తీసుకొస్తాడు రామ‌రాజు. ద‌మ్ముంటే ఇప్పుడు నా కొడుకుపై విశ్వ‌ను చేయివేయ‌మ‌ని వార్నింగ్ ఇస్తాడు రామ‌రాజు. విశ్వ ప‌రిస్థితి ఎంత భ‌యంక‌రంగా ఉంటుందో మీరు క‌ళ్లారా చూస్తార‌ని రామ‌రాజు అంటాడు.

విశ్వ చేసిన త‌ప్పు,..

ధీర‌జ్ ప్రాణాలు తీయాల‌ని చూడ‌టం విశ్వ చేసిన త‌ప్పు అని, వాడికి బుద్ధిచెప్ప‌కుండా నా ఇంటికి మీద‌కు గొడ‌వ‌కు వ‌స్తే ఊరుకోన‌ని సేనాప‌తితో అంటాడు రామ‌రాజు. మీ పెంప‌కం వ‌ల్లే విశ్వ ఇలా త‌యార‌య్యాడ‌ని కోపంగా అంటాడు. రెండు కుటుంబాల మ‌ధ్య కోపాలు, గొడ‌వ‌లు ఉంటే…ప్రాణాలు తీస్తారా అని నిల‌దీస్తాడు. మీరు ఎలాగు బుద్ది చెప్ప‌డం లేద‌ని విశ్వ‌కు భ‌యం చెప్పాన‌ని రామ‌రాజు అంటాడు.

నా పిల్ల‌ల జోలికి వ‌స్తే ఊరుకోను…

నువ్వు ఎవ‌డ్రా నా కొడుకుకు భ‌యం చెప్ప‌డానికి అని సేనాప‌తి కోపంగా రామ‌రాజుపై అరుస్తాడు. భ‌యం చెప్ప‌లేదు భ‌య‌పెట్టాన‌ని రామ‌రాజు బ‌దులిస్తాడు. మీరు నాకు ఎన్ని అవ‌మానాలు చేసినా స‌హిస్తాను. కానీ నా పిల్ల‌ల జోలికి వ‌స్తే మాత్రం ఊరుకోన‌ని రామ‌రాజు వార్నింగ్ ఇస్తాడు. ఎదురుగా ఉన్న‌ది ఎవ‌రు అన్న‌ది కూడా చూడాన‌ని అంటాడు. వేదావ‌తి కూడా సేనాప‌తి పెంప‌కాన్ని త‌ప్పు ప‌డుతుంది.

ముందు మీ కొడుకుల‌కు సంస్కారాల‌ను, ప‌ద్ద‌తుల‌ను నేర్పించి ఆ త‌ర్వాత ఊళ్లోవాళ్ల‌కు స‌ల‌హాలు ఇవ్వండి అని భ‌ద్రావ‌తి అంటుంది. బుద్దులు, ప‌ద్ధ‌తుల విష‌యంలో త‌న కొడుకుల‌కు ఎవ‌రూ సాటిరార‌ని, పోటీ లేర‌ని భ‌ద్రావ‌తితో వేదావ‌తి అంటుంది.

బ‌య‌ట‌ప‌డ్డ చందు ల‌వ్‌స్టోరీ…

నీ మొగుడు ఒక్క కొడుకును ప‌ద్ద‌తిగా పెంచ‌లేద‌ని వేదావ‌తిపై భ‌ద్రావ‌తి ఫైర్ అవుతుంది. నీ రెండో కొడుకు ఓ పిల్ల‌ను లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. మూడో కొడుకు తండ్రిని ఆద‌ర్శంగా తీసుకొని మా ఇంటి ఆడ‌పిల్ల‌కే మాయ‌మాట‌లు చెప్పి పెళ్లి చేసుకున్నాడు.

మ‌హా బుద్ది మంతుడు అనుకుంటున్న నీ పెద్ద కొడుకు కూడా ఓ అమ్మాయిని ప్రేమించాడ‌ని, కానీ ఆ అమ్మాయికి పెళ్లి జ‌రిగిపోయి బ‌తికిపోయింద‌ని, లేదంటే అత‌డు కూడా ఆ అమ్మాయిని లేపుకొచ్చి ఇంట్లో పెట్టేవాడ‌ని భ‌ద్రావ‌తి అంటుంది. చందు తాగి రోడ్ల‌పై ప‌డిపోతున్నాడ‌ని, ఆ విష‌యం మీకు తెలుసా అంటూ చందు ల‌వ్‌స్టోరీని బ‌య‌ట‌పెడుతుంది భ‌ద్రావ‌తి.

మీ పిల్ల‌లు ఏం చేస్తున్నారో నీకు తెలియ‌దు కానీ ఎదుటివాళ్ల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డానికి వ‌చ్చారా అంటూ రామ‌రాజు, వేదావ‌తిని అవ‌మానిస్తుంది భ‌ద్రావ‌తి. చందు ల‌వ్‌స్టోరీ గురించి విని రామ‌రాజు బాధ‌ప‌డ‌తాడు. చందు మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించిన ప‌ట్టించుకోకుండా వెళ్లిపోతాడు. అక్క‌డితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024