Samantha: సమంత మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇలా వివరిస్తోంది, ఒక్కరూ పాటిస్తే మంచిది

Best Web Hosting Provider In India 2024

Samantha: సమంత మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇలా వివరిస్తోంది, ఒక్కరూ పాటిస్తే మంచిది

Haritha Chappa HT Telugu
Feb 05, 2025 10:00 AM IST

Samantha: సమంత రూత్ ప్రభు తన మానసకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధ్యానం మీద ఆధారపడుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యానికి శక్తివంతమైన సాధనంలా ఉపయోగపడుతుంది. ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోండి.

సమంత రూత్ ప్రభు
సమంత రూత్ ప్రభు ((Instagram/ Samantha Ruth Prabhu))

సమంత సినిమాలతోనే కాదు వ్యక్తిగత జీవితంలో వచ్చిన గొడవల ద్వారా కూడా పాపుల్ అయింది. నాగచైతన్యతో విడాకులు తరువాత ఆమె మానసికంగా చాలా కుంగిపోయినట్టు కనిపించింది. అలాగే మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి వల్ల కూడా ఆమె ఎంతో ఇబ్బంది పడింది. సమంత మన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలో ఎప్పటికప్పుడు తన ఇన్ స్టా ఖాతా ద్వారా చెబుతూ ఉంటుంది. 

yearly horoscope entry point

ధ్యానం అనేది మనస్సు, శరీరాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి భావాలను కూడా తగ్గిస్తుందని సమంత వివరిస్తోంది. మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో తాను పడిన కష్టాల గురించి, అలాగే 2021 లో నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం తన మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఓపెన్ గా చెప్పింది సమంత రూత్ ప్రభు. 

జిక్యూ ఇండియాకు ఇచ్చిన కొత్త ఇంటర్వ్యూలో సమంత రూత్ ప్రభు తన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  ధ్యానం ఎలా సహాయపడుతుందో మాట్లాడింది. పర్ ఫెక్ట్ గా ఉండాలనే ఆలోచనను వదిలేసి ఉన్నది ఉన్నట్టు స్వీకరించడం నేర్చుకోవాలని ఆమె చెప్పింది. 

‘ నటీనటులు నార్సిసిస్టిక్ గా ఉంటారు. అంటే వారు స్వీయ ప్రాముఖ్యతకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రపంచం అంతా తమ చుట్టే తిరగాలని, తిరుగుతుందని భావిస్తారు. నటులపై విపరీతమైన ఒత్తిడి ఉంటుంది.  సినిమా రంగం అభద్రతా భావాన్ని పెంచేస్తుంది’ అని చెప్పింది సమంత

తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏం చేయాలని అడిగిన ప్రశ్నకు సమంత సమాధానమిస్తూ..  ‘శ్రద్ధగా ధ్యానం చేయండి.  ప్రతిరోజు నేను కూర్చుని కొన్ని ప్రశ్నలు నన్ను నేనే అడుగుతాను. నిర్మాణాత్మక విమర్శలను స్వీకరిస్తాను.  నాతో నిజాయితీగా ఉండగల వ్యక్తులను ఆకర్షించడంలో ఇది నాకు  ఎంతో సహాయపడింది. నేను చెప్పే ప్రతి దానికి అవును అని చెప్పే మనషులు వద్దు’ అని తెలిపింది.

ధ్యానం అంతర్గత శాంతిని, ప్రశాంతతను అందిస్తుంది. ధ్యానం శక్తివంతమైన ఆధ్యాత్మిక పద్ధతిగా చెప్పుకుంటారు. మీ మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మీ శ్వాసపై లేదా మంత్రం వంటి ఒక నిర్దిష్ట వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించడం ఇందులో ఉంటుంది. రోజువారీ దినచర్యలో ధ్యానాన్ని చేర్చడం ఎంతో ముఖ్యమని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

మైండ్ ఫుల్ నెస్, ధ్యానం అభ్యసించడం వల్ల వర్తమాన క్షణంపై దృష్టి పెట్టడం నేర్పిస్తుంది. ధ్యానం అనేది స్వీయ-అవగాహన అభివృద్ధికి, ఉద్రిక్తత, ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించడానికి సహాయపడుతుంది

లోతైన శ్వాస వ్యాయామాలు మీ హృదయ స్పందన రేటును నియంత్రించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి మీకు సహాయపడతాయి. మీ మనస్సు, శరీరాన్ని రిలాక్స్ చేయడానికి శ్వాస వ్యాయామాలు అవసరం.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024