Depression: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త పడండి డిప్రెషన్ కావచ్చు

Best Web Hosting Provider In India 2024

Depression: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త పడండి డిప్రెషన్ కావచ్చు

Haritha Chappa HT Telugu
Feb 05, 2025 02:00 PM IST

Depression: డిప్రెషన్ ఒక వ్యక్తి ఆలోచనలు, భావాలు మరియు ప్రవర్తనపై చాలా ప్రభావాన్ని చూపడమే కాకుండా, వ్యక్తిని పూర్తిగా అదుపులో ఉంచుతుంది. నిరాశకు గురైన వ్యక్తి మనస్సు చాలా బలహీనంగా మరియు సున్నితంగా ఉంటుంది. మానసికంగా మరియు శారీరకంగా మీరు చాలా కాలం కష్టపడాల్సి ఉంటుంది.

డిప్రెషన్ లక్షణాలు ఇవిగో
డిప్రెషన్ లక్షణాలు ఇవిగో (PC: Canva)

డిప్రెషన్… ఇప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న మానసిక సమస్య. విద్యార్థులు, ఉద్యోగులు అధికంగా డిప్రెషన్ కు గురవుతున్నారు. అయితే డిప్రెషణ్ బారిన పడినా కూడా ఆ విషయాన్ని ఎంతో మంది గుర్తించలేకపోతున్నారు. డిప్రెషన్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఎలా చేస్తారు? వంటి అంశాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.

yearly horoscope entry point

రోజువారీ పనులు వల్ల విసుగు, విచారం వంటివి వస్తాయి. సాధారణ విసుగు కొద్దిసేపు మాత్రమే ఉంటాయి. ఇది కాసేపటికి మాయమవుతాయి. ఇది మీ దినచర్యను, ఆరోగ్యాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. కానీ డిప్రెషన్ భిన్నమైనది.

డిప్రెషన్ అంటే ఏమిటి?

డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత. ఈ వ్యాధి అకస్మాత్తుగా ఎవరికీ రాదు. ఇది క్రమేపీ అభివృద్ధి చెందుతుంది. డిప్రెషన్ ను వైద్యులు మూడు విధాలుగా వర్ణిస్తారు. ఇది ఎంత తీవ్రమైనదనే దానిపై ఆధారపడి ఉంటుంది.

  • తేలికపాటి నిరాశ – ఇది మీ రోజువారీ జీవితంపై కొంత ప్రభావాన్ని చూపుతుంది.
  • మితమైన నిరాశ – ఇది మీ రోజువారీ జీవితంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
  • తీవ్రమైన నిరాశ – ఇది మీ రోజువారీ జీవితాన్ని గడపడం కష్టతరం చేస్తుంది.

నిరాశకు నిర్దిష్ట కారణం లేదు, కానీ వంశపారంపర్యంగా రావచ్చు, ఇతరత్రా అనేక కారణాలు ఉండవచ్చు.

డిప్రెషన్ ఏ వయసు వారికి వస్తుంది?

డిప్రెషన్ బారిన పడడానికి కనీసం 2 నుండి 3 నెలల సమయం పడుతుంది. ఈ వ్యాధి వచ్చిన సంగతి కూడా ఆ వ్యక్తికి తెలియనివ్వదు. డిప్రెషన్ ఒక వ్యక్తి ఆలోచనలు, భావాలు, ప్రవర్తనపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. వ్యక్తిని పూర్తిగా తన అదుపులో ఉంచుతుంది డిప్రెషన్. నిరాశకు గురైన వారి మనస్సు చాలా బలహీనంగా మారిపోతుంది. మానసికంగా, శారీరకంగా కూడా ఇది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది.

డిప్రెషన్ ను అధిగమించాలంటే సైకాలజిస్టులు సూచించిన మందులు, కౌన్సిలింగ్ అవసరం. డిప్రెషన్ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే త్వరగా చికిత్స తీసుకోవచ్చు.

డిప్రెషన్ లక్షణాలు

  • రోజువారీ దినచర్యను నిర్వహించలేకపోవడం, స్నానం, తినడం, నిద్రపోవడం వంటి పనులు కూడా చేయలేకపవడం, పరిశుభ్రత పాటించకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం
  • శరీర బరువు పెరగడం
  • నిద్రలేమి లేదా అధికంగా నిద్ర పోవడం
  • ఎక్కువగా తినడం లేదా లేదా తినడం తగ్గించడం
  • శరీరంలో మరింత అలసట, శక్తి లేనట్లు అనిపించడం.

ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలే. డిప్రెషన్ లక్షణాలు ఉన్నవారు మూడ్ స్వింగ్స్, నిద్ర, ఆహారం తీసుకోవడంలో మార్పులు ఉంటాయి. ఎటువంటి కారణం లేకుండా శారీరక నొప్పులను కూడా అనుభవించవచ్చు.

మానసిక లక్షణాలు

  • ప్రతిదానికి చిరాకు పడతారు
  • అన్ని పనుల్లో నిరుత్సాహానికి లోనవుతారు.
  • ఏ పనీ చేయలేరు.
  • నిరాశ, నిస్సహాయతతో బాధపడుతున్నారు
  • వీలైనంతగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.
  • పర్సనల్ లైఫ్, వర్క్, సోషల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు.
  • తనను పనికిమాలినవాడినని, అనర్హుడినని భావించడం ప్రారంభిస్తారు.
  • నన్ను ఎవరూ అర్థం చేసుకోరు, నాకు ఎవరూ వద్దు, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరూ లేరు… అంటూ మానసికంగా బాధపడుతుంటారు.
  • మనసు స్థిరంగా ఉండదు
  • జీవించడం ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారు.
  • స్వీయ హాని చేసుకోవడం లేదా ఆత్మహత్య ఆలోచనలు రావడం వంటివి జరుగుతాయి.

డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తిని ఎలా చూసుకోవాలి?

కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, బంధువులు డిప్రెషన్ కు గురైన వారితో దయతో వ్యవహరించాలి. వారి మానసిక స్థితి, సున్నితత్వాన్ని అర్థం చేసుకుని వారికి మానసికంగా మద్దతు, ప్రోత్సాహం, ప్రేమ, సంరక్షణను వంటివి అందించాలి. డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తిని ఒంటరిగా వదిలేయకూడదు. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తికి తన జీవితాన్ని తనంతట తానుగా ముగించే ఆలోచనలు ఉండవు. ఆ వ్యక్తికి మద్దతు ఇవ్వడానికి మీరు ఎల్లప్పుడూ ఉంటారని భరోసా ఇవ్వండి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024