Best Web Hosting Provider In India 2024
Minister Nara Lokesh : ‘డేటా చోరీ నిరూపిస్తే రూ.10 కోట్లు కానుకగా ఇస్తా’ – వైసీపీ నేతలకు లోకేశ్ ఛాలెంజ్
వైసీపీ నేతలకు మంత్రి లోకేశ్ ఛాలెంజ్ విసిరారు. వాట్సాప్ గవర్నెన్స్ లో డేటా చోరీ జరిగినట్లు నిరూపిస్తే రూ. 10 కోట్ల కానుకగా ఇస్తానని చెప్పారు. ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా తానే చెక్ ఇస్తానని చెప్పుకొచ్చారు. ఫోనే లేదని చెప్పిన జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుందని ప్రశ్నించారు.
వాట్సప్ గవర్నెన్స్ లో ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తానంటూ వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ ఛాలెంజ్ విసిరారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… గతంలో కూడా వైసీపీ నేతలు ఇదే మాదిరిగా విమర్శలు చేశారని గుర్తు చేశారు. కానీ వారి ఐదేళ్ల పాలనలో ఎక్కడా కూడా నిరూపించలేకపోయారని చెప్పుకొచ్చారు.
ఫోన్ లేదని చెప్పాడు..ఆయనకు ఎలా తెలుసు..?
“చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి, చేయని తప్పునకు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచారు. అలాంటి వాళ్లు నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసి ఉంటే ఊరికే వదిలిపెడతారా. మాకు ప్రజల డేటా అక్కర్లేదు. కావాల్సింది ఓటర్ లిస్టు మాత్రమే. అది పబ్లిక్ డాక్యుమెంట్. తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుంది..?” అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
“ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రాబోతున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏపీ సిద్ధంగా ఉంది. ఇందుకు కేంద్రం సహకరించాలని కోరాం. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాలని మంత్రి అశ్వినీ వైష్ణవ్ ని కోరాను” అని లోకేశ్ వెల్లడించారు.
వైజాగ్ లో టీసీఎస్ కార్యకలాపాలు 2నెలల్లో ప్రారంభమవుతాయని లోకేశ్ ప్రకటించారు. దాని శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు భూ అన్వేషణ జరుగుతోందని చెప్పారు. “కాగ్నిజెంట్ ఏర్పాటుపై త్వరలో ప్రకటన వస్తుంది. ఏడాదిలో రాష్ట్రంలో ఒక్కో ప్రాజెక్టును ఏర్పాటు చేసుకుంటూ వెళ్తాం. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఏపీకి తీసుకురావడానికి కల్పించాల్సిన వాతావరణంపై కేంద్రమంత్రితో చర్చించాం. డేటాసిటీల కోసం ఏటా ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు. అందులో 100 బిలియన్ డాలర్లు ఇండియాకు వచ్చే వీలుంది. అందులోనూ మెజార్టీ వాటా ఏపీకి రావాలన్నదే నా లక్ష్యం” అని లోకేశ్ స్పష్టం చేశారు.
ఏపీకి ఒకే రాజధాని – లోకేష్
“ఏపీకి ఒకే రాజధాని. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో పనిచేస్తున్నాం. ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ లు, ఈఎంసీ 1, 2, 3ల్లో పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించాం. అమెరికాలో పర్యటించినప్పుడు నా దృష్టికి వచ్చిన కంపెనీల ఫీడ్ బ్యాక్ ను మంత్రికి వివరించాను. మంత్రి వైష్ణవ్ గారు త్వరలో విశాఖ, తిరుపతిలలో పర్యటించి, గతంలో టీడీపీ హయాంలో చేసిన పనులను స్వయంగా చూస్తానని హామీ ఇచ్చారు” అని లోకేశ్ వెల్లడించారు.
సంబంధిత కథనం
టాపిక్