వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డిపై త‌ప్పుడు కేసు 

Best Web Hosting Provider In India 2024

 తిరుపతి: వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమన అభినయ్‌రెడ్డిపై అలిపిరి పోలీస్‌ స్టేషన్ లో త‌ప్పుడు కేసు నమోదు చేశారు. రాజేష్‌ అనే వ్యక్తిని అలిపిరి పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయ‌డంతో అభినయ్‌రెడ్డి నిలదీశారు. రాజేష్‌ను పీఎస్‌ నుంచి తీసుకెళ్లారంటూ సీఐ ఫిర్యాదుతో కేసు నమోదైంది. 

కూట‌మి నేత‌ల అరాచ‌కం
తిరుపతి డిప్యూటీ మేయర్‌ ఉప ఎన్నిక సంద‌ర్భంగా కూట‌మి నేత‌లు అరాచ‌కం సృష్టించారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు అనీష్‌ రాయల్‌ భార్య మమతను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. విష‌యం తెలుసుకున్న‌ భూమన అభినయ్‌­రెడ్డి.. అనీష్‌ రాయల్‌ నివాసానికి చేరుకుని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కూటమి గూండాలు అక్కడికి కూడా చేరుకుని ఆమె ఉన్న నివాసం తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నించడంతో తొలుత 100కి ఫోన్‌ చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవటంతో తిరిగి అభినయ్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అక్కడకు వచ్చిన అభినయ్‌­రెడ్డి, ఎంపీ గురుమూర్తిపై కూటమి గూండాలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో కౌశిక్, వాసుయాదవ్, అభినయ్‌ డ్రైవర్‌ గాయాలపాలు కాగా, ఓ కారు ధ్వంసమైంది. 

Best Web Hosting Provider In India 2024