![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/vidaamuyarchi_1738802176845_1738802190928.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/vidaamuyarchi_1738802176845_1738802190928.jpg)
Ajith Pattudala Twitter Review: పట్టుదల ట్విట్టర్ రివ్యూ – ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ – అజిత్, త్రిష మూవీ టాక్ ఏంటంటే?
Pattudala Twitter Review: అజిత్ పట్టుదలమూవీ గురువారం థియేటర్లలో రిలీజైంది. తమిళంలో విదాముయార్చి పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రీమియర్స్ టాక్ ఏంటంటే?
Pattudala Twitter Review: అజిత్ హీరోగా నటించిన పట్టుదల (తమిళంలో విదాముయార్చి) సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ యాక్షన్ లవ్‌స్టోరీ మూవీకి మగీజ్ తిరుమేని దర్శకత్వం వహించాడు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీకి లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గురువారం తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
స్టైలిష్ యాక్షన్…
స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు మగీజ్ తిరుమేని ఈ మూవీని తెరకెక్కించాడు ఓవర్సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. యాక్షన్ రోల్లో అజిత్ అదరగొట్టాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో అజిత్ ఇంట్రడక్షన్ సీన్ థియేటర్లలో గూస్‌బంప్స్‌ను కలిగిస్తుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అజిత్, త్రిష కాంబోలో వచ్చే సీన్స్ బాగుంటాయట.
నెక్స్ట్ లెవెల్…
యాక్షన్ సీక్వెన్స్‌లు అయితే హాలీవుడ్ స్థాయిలో నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని అంటోన్నారు. ఇంటర్వెల్ బ్లాక్ ఫైట్ సీన్, అజిత్, అర్జున్ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచుతాయట.
తప్పిపోయిన తన భార్యను వెతుక్కుంటూ ఓ వ్యక్తి చేసే జర్నీ నేపథ్యంలో పట్టుదల మూవీ సాగుతుందంట. ఆమె మిస్సింగ్‌కు సంబంధించి వచ్చే ట్విస్ట్‌లు, టర్న్‌లు ఆకట్టుకుంటున్నాయని చెబుతోన్నారు. తన స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో చివరి వరకు ఏం జరుగుతుందో అనే టెన్షన్‌ను డైరెక్టర్ బిల్డ్ చేశాడని ఓ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. ఫాస్ట్ ఫేజ్డ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఇదని అన్నాడు.
అజిత్‌కు కమ్‌బ్యాక్ మూవీ…
పట్టుదల మూవీకి మంచి కమ్‌బ్యాక్‌గా నిలుస్తుందని ఓవర్సీస్ ఆడియెన్స్ పేర్కొంటున్నారు. స్క్రీన్ ప్రజెన్స్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయని అంటున్నారు. అజిత్, అర్జున్ క్యారెక్టర్స్ ఈ మూవీలో పోటాపోటీగా ఉంటాయట. త్రిష రోల్ సర్ప్రైజింగ్గా ఉంటుందని చెబుతోన్నారు.
అనిరుధ్ బీజీఎమ్…
పట్టుదల మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరో హీరోగా నిలిచాడని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తోన్నారు. తన బీజీఎమ్‌తో సినిమాకు హై యాక్షన్ ఫీల్‌ను తీసుకొచ్చాడని చెబుతోన్నారు.
హాలీవుడ్ మూవీ బ్రేక్‌డౌన్ ఆధారంగా విదాముయార్చి మూవీ రూపొందింది. దాదాపు మూడు వందల కోట్ల బడ్జెట్‌తో సుభాస్కరణ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.