Best Web Hosting Provider In India 2024
AP EHS Services: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా వైద్య సేవలు, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP EHS Services: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లోనూ వారు చికిత్స తీసుకునేందుకు అనుమతించింది. ఈమేరకు తెలంగాణలో రిఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోను ఆదేశించింది.
AP EHS Services: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వచ్చారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల కుటుంబాలు హైదరాబాద్‌లో స్థిరపడటంతో వారికి వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య సేవల విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద వైద్య సేవలను తెలంగాణలో కూడా అందించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
తెలంగాణ రాష్ట్ర డైరె క్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) తెలంగాణలోని జిల్లాల్లో గుర్తించిన అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబా లకు చికిత్స పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
2015 లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం తెలంగాణలో కేవలం 11 ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఈహెచ్ఎస్ కార్డు ద్వారా ఉచితంగా సేవలు పొందే అవకాశం ఉంది. దీని వల్ల ఉద్యోగులు, పెన్షనర్లకు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉద్యోగుల నుంచి అందిన విజ్ఞప్తులపై రాష్ట్ర ప్రభుత్వం పునః పరిశీలన జరిపింది.
ఈ క్రమంలో తెలంగాణలోని డీఎంఈ అధికారులు గుర్తింపునిచ్చిన అన్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వీలు కల్పించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో నివాసం ఉంటున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యు లను దృష్టిలో పెటుకుని తెలంగాణలో గుర్తించిన అస్పత్రుల్లో కూడా వైద్య సేవలు పొందే అవకాశాన్ని కల్పించారు.
టాపిక్