Best Web Hosting Provider In India 2024
Jr NTR: రొనాల్డోకు ఫిఫా నాటు నాటు స్టైల్ విషెస్.. జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఇదీ..
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు కదా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోనే కాదు.. వెస్టర్న్ దేశాలను కూడా ఊపేసింది. ఇందులోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా వచ్చింది. అందుకే ఈ పాట స్టైల్లో ఫిఫా వరల్డ్ కప్ అధికారిక పేజీ స్టార్ ఫుట్‌బాలర్లు రొనాల్డో, నెయ్‌మార్, టెవెజ్ లకు బర్త్ డే విషెస్ చెప్పింది. దీనిపై తారక్ స్పందించాడు.
ఫిఫా వరల్డ్ కప్ నాటు నాటు బర్త్ డే విషెస్
ఫిఫా వరల్డ్ కప్ అధికారిక పేజీ బుధవారం (ఫిబ్రవరి 5) ముగ్గురు స్టార్ ఫుట్‌బాలర్లు క్రిస్టియానో రొనాల్డో, నెయ్‌మార్, కార్లిటోస్ టెవెజ్ లను నాటు నాటు స్టైల్లో క్రియేట్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ ముగ్గురి పేర్లలోని మొదటి ఇంగ్లిష్ అక్షరాలు NTR వచ్చేలా ఈ పోస్ట్ చేసింది.
బర్త్ డే ఉంటే మూడ్ ఇలాగే ఉంటుందనే రైటప్ తో క్రియేట్ చేసిన ఈ స్పెషల్ పోస్టర్ బాగా ఆకట్టుకుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా దీనిపై స్పందించాడు. “హహ… హ్యాపీ బర్త్ డే నెయ్‌మార్ టెవెజ్ రొనాల్డో” అని విష్ చేశాడు. అటు ఆర్ఆర్ఆర్ మూవీ అధికారిక ఇన్‌స్టా అకౌంట్ కూడా హార్ట్ ఎమోజీలతో విష్ చేసింది.
అటు అంతకుముందు గోల్డెన్ గ్లోబ్ లోనూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కింది. ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు కూడా అదిరిపోయాయి. జేమ్స్ కామెరాన్, స్పీల్‌బర్గ్, రుసో బ్రదర్స్ లాంటి వాళ్లు కూడా ఆర్ఆర్ఆర్ మూవీని ప్రశంసించారు.
ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గతేడాది దేవర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు అతడు ప్రశాంత్ నీల్ తో మరో మూవీ చేస్తున్నాడు. అటు వార్ 2 మూవీతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
సంబంధిత కథనం
టాపిక్