Body Odor: వేసవి వచ్చేసింది, శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Best Web Hosting Provider In India 2024

Body Odor: వేసవి వచ్చేసింది, శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Haritha Chappa HT Telugu
Feb 06, 2025 04:30 PM IST

Body Odor: ఇంట్లో అద్దం ముందు నిలబడి అందంగా ముస్తాబై బయటికి వెళ్లిన కాసేపటిలో చెమటలు పట్టేస్తాయి. ఆ చెమటల వల్ల కొందరికి విపరీతమైన దుర్వాసన వచ్చేలా చేస్తాయి. కాబట్టి శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో టిప్స్ తెలుసుకోండి.

శరీర దుర్వాసన రాకుండా టిప్స్
శరీర దుర్వాసన రాకుండా టిప్స్

శరీర దుర్వాసన వేసవిలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది నలుగురిలో ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. దీని వల్ల ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణం బ్యాక్టీరియా, చెమట. విచిత్రమేమిటంటే చాలా మందికి తమ శరీరం నుంచి వచ్చే వాసన గురించి తెలియదు. మరికొందరికి తెలిసినా ఏం చేయాలో తెలియక వదిలేస్తారు. ఆ దుర్వాసన పీల్చలేక చుట్టు ఉన్నవారు దూరంగా వెళ్లిపోతారు.

yearly horoscope entry point

మారిన వాతావరణం, హార్మోన్ల మార్పులు, వారసత్వంగా వచ్చే సమస్యలు, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు వల్ల శరీర దుర్వాసనను పెంచే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆహార నియంత్రణ ద్వారా శరీర దుర్వాసన నుంచి దూరంగా ఉండవచ్చు.

హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు (ఇంగ్లిష్)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ తృప్తి అగర్వాల్ సరైన చర్యల ద్వారా ఆ సమస్యలను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు.

శరీర దుర్వాసనను తగ్గించే చిట్కాలు

ఆరోగ్యకరమైన అలవాట్లు

శరీర దుర్వాసనను నివారించడానికి పరిశుభ్రత పాటించడంతో పాటూ కొన్ని పనులను చేయాలి.

  • ప్రతిరోజూ స్నానం: రోజుకు కనీసం ఒకటి నుండి రెండుసార్లు స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది. శుభ్రమైన, మురికి లేని చర్మం దుర్వాసనను నివారిస్తుంది.
  • తగిన దుస్తులు ధరించడం: తేలికపాటి, గాలి తగిలేలా కాటన్, లినిన్ దుస్తులను ధరించడం మంచిది.
  • చెమట ఎక్కువగా ఉంటే: చెమట పట్టే ప్రాంతాన్ని పొడిగా ఉంచడానికి పౌడర్లు లేదా యాంటీపెర్స్పిరెంట్లను ఉపయోగించవచ్చు.
  • శరీర దుర్వాసన రాకుండా ఉండాలంటే తగిన ఉత్పత్తులను వాడటం ఉత్తమం. కొన్ని ఉత్పత్తులు చర్మం రకాన్ని బట్టి శరీర దుర్వాసనను తగ్గిస్తాయి. సబ్బు, బాడీవాష్, పెర్ ఫ్యూమ్ వాడాలి.
  • యాంటీ బాక్టీరియల్ సబ్బు వాడకం: టీ ట్రీ ఆయిల్, లెమన్ ఎక్స్ట్రాక్ట్ లేదా చార్కోల్ కలిగిన సబ్బులను ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది.
  • ఎక్స్ఫోలియేటింగ్ (చర్మాన్ని సున్నితంగా శుభ్రపరచడం): షవర్ లూఫా లేదా స్క్రబ్ ఉపయోగించి చనిపోయిన చర్మ కణాలను వదిలించుకోవడం నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడుతుంది.
  • యాంటీమైక్రోబయల్ వైప్స్: మీరు బయటకు వెళ్ళేటప్పుడు తక్షణ తాజాదనం కోసం కలబంద కలిగిన వైప్స్ ఉపయోగించవచ్చు. ఇది చెమటను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది.

తినాల్సిన ఆహారం

ఆహారం ద్వారా కూడా శరీర దుర్వాసనను నియంత్రించవచ్చు. ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగటం చెమట ద్వారా హానికరమైన విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లి, ఉల్లిపాయలు, అతిగా స్పైసీ ఫుడ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన పెరుగుతుంది.

లావెండర్, రోజ్మేరీ లేదా టీ ట్రీ నూనెల వాడకం వాసనను తగ్గిస్తుంది. రసాయన రహిత, సహజ డియోడరెంట్ ఎంపికలు దుర్వాసనను నివారించడంలో సహాయపడతాయి. ఈ విధంగా కొన్ని చిట్కాలు పాటిస్తే శరీర దుర్వాసనను నివారించవచ్చు.

దైనందిన జీవితంలో శరీర దుర్వాసన ఒక సాధారణ సమస్య అయినప్పటికీ, సరైన పరిశుభ్రత పద్ధతులు, ఆహార నియంత్రణ ద్వారా దీనిని నియంత్రించవచ్చు.ప్రతిరోజూ స్నానం చేయడం, సహజ డియోడరెంట్ ఉపయోగించడం, ఆహారంలో సమతుల్యతను పాటించడం వల్ల దుర్వాసనకు శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024