Best Web Hosting Provider In India 2024
అరకు రైల్వే స్టేషన్‌లో రిక్వెస్ట్ స్టాఫ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి ఆదేశాలు
న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎంపీ గుమ్మా తనుజారాణి కృషి ఫలించింది. అరకు రైల్వే స్టేషన్ -1, అరకు రైల్వే స్టేషన్‌లో రిక్వెస్ట్ స్టాఫ్ (మిని స్టేషన్) త్వరితగతిన ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఎంపీ తనుజారాణి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వాల్తేరు డివిజన్ లో ఉన్న అరకు రైల్వేను ఒరిస్సా రాయగాడ్ డివిజన్ కు విభజించే ప్రతిపాదనను పునః పరిశీలన చేయాలని, కిరండోల్ లైను లేని వాల్తేరు డివిజన్ ఊహించుకోలేమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. ఇదివరకే అరకు రైల్వే రిక్వెస్ట్ స్టాప్ లో పాసింజర్ రైలు నిలుపుదల కోసం డిఆర్ఎం, ఇతర రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పరిష్కరించలేదని ఆమె మరోసారి కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేయడంతో ఆయన వెంటనే స్పందించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.