Amaravati : రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఈసీ క్లియరెన్స్.. కండిషన్స్ అప్లై!

Best Web Hosting Provider In India 2024

Amaravati : రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ఈసీ క్లియరెన్స్.. కండిషన్స్ అప్లై!

Basani Shiva Kumar HT Telugu Feb 06, 2025 05:54 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Feb 06, 2025 05:54 PM IST

Amaravati : అమరావతి పనులకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పనులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. సీఆర్‌డీఏ అధికారులు ఈసీకి లేఖ రాయగా.. ఎన్నికలు పూర్తయ్యాకే టెండర్లు ఫైనలైజ్ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

అమరావతి నిర్మాణ పనులకు ఈసీ క్లియరెన్స్
అమరావతి నిర్మాణ పనులకు ఈసీ క్లియరెన్స్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

రాజధాని అమరావతి నిర్మాణ పనులకు కేంద్ర ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇచ్చింది. రాజధాని పనులకు టెండర్లు పిలిచేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. కానీ.. ఎన్నికలు పూర్తయ్యాకే టెండర్లు ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కోడ్‌ నుంచి రాజధాని టెండర్ల ప్రక్రియకు.. మినహాయింపు ఇవ్వాలని ఈసీకి సీఆర్‌డీఏ కమిషనర్‌ లేఖ రాశారు. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందించింది.

yearly horoscope entry point

పెద్దఎత్తున బిడ్లు..

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పనులకు సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ గత నెలలో పెద్ద ఎత్తున బిడ్లు ఆహ్వానించాయి. వీటిలో చాలా పనులకు గడువు ముగిసింది. మరికొన్నింటిని 7వ తేదీన తెరవాల్సి ఉంది. బిడ్లను తెరిచి ఖరారు చేసే దశలో.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. షెడ్యూల్ వెలువడింది. దీంతో టెండర్ల ఖరారు, కొత్తవి పిలిచే ప్రక్రియకు బ్రేక్ పడింది.

అమల్లో ఎన్నికల కోడ్..

ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే కాంట్రాక్టర్లను ఖరారు చేసి.. పనులు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వచ్చేనెల 3వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం ఇప్పుడు సమస్యగా మారింది. దీంతో పనుల ప్రాధాన్యత దృష్ట్యా టెండర్ల ప్రక్రియకు అడ్డంకులు లేకుండా చూడాలని.. సీఆర్‌డీఏ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. కేవలం పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు అయినందున.. నియామాలు సడళించాలని విజ్ఞప్తి చేయగా.. ఈసీ మినహాయింపు ఇచ్చింది.

మిగతా పనులకు టెండర్లు..

తాము రాసిన లేఖ పట్ల కేంద్ర ఎన్నికల సంఘం అనుకూల నిర్ణయం తీసుకోవడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రూ.40 వేల కోట్లకు సంబంధిన పనులను దశల వారీగా ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా టెండర్లు పిలిచేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలలో ఏపీ అసెంబ్లీ, సచివాలయం, ఐకానిక్ టవర్ల బిడ్‌లు తెరవనున్నారు.

కీలక పనులు వేగవంతం..

రాజధాని అమరావతిలో వివిధ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలోని లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైన్లు, ఇంటర్నెట్ తీగలు వేసేందుకు డక్ట్‌ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవే కాకుండా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస భవనాల్లో విద్యుత్, ప్లంబింగ్, సెక్యూరిటీ, అగ్నిమాపక వ్యవస్థ వంటి పనులు చేపట్టనున్నారు.

సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ కలిసి..

మిగిలిపోయిన వరద నియంత్రణ పనులు, రోడ్లు, సైకిల్ ట్రాక్‌లు, పాదచారుల బాటల అభివృద్ధి, వీధి దీపాలు అమర్చడం వంటి పనులకు సంబంధించి.. మొత్తం రూ. 14,185 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇందులో సీఆర్‌డీఏవి రూ.8,477.30 కోట్లు కాగా.. ఏడీసీఎల్‌వీ రూ.6,397 కోట్లు. పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. అటు త్వరలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి తొలి విడద రుణం అందనుందని అధికారులు చెబుతున్నారు.

Whats_app_banner

టాపిక్

AmaravatiElection Commission Of IndiaAp Mlc ElectionsAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024