Best Web Hosting Provider In India 2024
OTT Weekend Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రాబోతున్న 7 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. యాక్షన్ నుంచి కామెడీ వరకు..
OTT Weekend Releases: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్, ఓ డాక్యుమెంటరీ అడుగుపెట్టనున్నాయి. వీటిని నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీలివ్, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చూడొచ్చు.
OTT Weekend Releases: వీకెండ్ వస్తే చాలు ఓటీటీలో కొత్తగా ఏ సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయో అని వెతికే వారి కోసం ఈ న్యూస్. ప్రతి వీకెండ్ లాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్, వెబ్ సిరీస్ మరికొన్ని గంటల్లోనే అడుగుపెట్టబోతున్నాయి. వాటిలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ తోపాటు నేరుగా ఓటీటీలోకి వస్తున్న మిసెస్, ది మెహతా బాయ్స్ లాంటి సినిమాలు ఉన్నాయి.
వీకెండ్ ఓటీటీ రిలీజెస్ ఇవే
మరికొన్ని గంటల్లో అంటే శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, సోనీలివ్ లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి మూవీస్,వెబ్ సిరీస్, ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ డాక్యుమెంటరీ రాబోతున్నాయి.
గేమ్ ఛేంజర్ – ప్రైమ్ వీడియో
రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడగా.. ఇప్పుడు ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి.
వివేకానందన్ విరళను – ఆహా వీడియో
మలయాళం కామెడీ మూవీ వివేకానందన్ విరళను సుమారు ఏడాది తర్వాత తెలుగులో ఓటీటీలోకి రాబోతుంది. టామ్ చాకో నటించిన ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇద్దరు భార్యలను చేసుకొని, వాళ్లను వేధిస్తూ తిరిగే ఓ భర్త.. అతనికి బుద్ది చెప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే కథ ఇది.
ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డాక్యుమెంటరీ
నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ రాబోతోంది. ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ రైవల్రీపై రూపొందిన ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి స్ట్రీమింగ్ అవబోతోంది. ఇరు దేశాలకు చెందిన లెజెండరీ క్రికెటర్లు సెహ్వాగ్, గవాస్కర్, గంగూలీ, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ లాంటి వాళ్లు దాయాదుల మధ్య క్రికెట్ వార్ ఎలా ఉంటుందో అభిమానులతో ఈ డాక్యుమెంటరీ ద్వారా పంచుకోనున్నారు.
ది మెహతా బాయ్స్ – ప్రైమ్ వీడియో
అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి నేరుగా వస్తున్న మూవీ ది మెహతా బాయ్స్. ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అతడు కూడా నటించాడు. జనరేషన్ గ్యాప్ వల్ల ఇద్దరు తండ్రీకొడుకుల మధ్య తలెత్తే ఇబ్బందుల చుట్టూ తిరిగే సినిమా ఇది. శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
మిసెస్ – జీ5
జీ5 (Zee5) ఓటీటీలోకి నేరుగా వస్తున్న మూవీ మిసెస్ (Mrs.). దంగల్ ఫేమ్ సాన్యా మల్హోత్రా, కన్వల్జిత్ సింగ్, నిషాంత్ దహియాలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా కూడా శుక్రవారం నుంచే స్ట్రీమింగ్ కానుంది. మలయాళం సూపర్ హిట్ మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ రీమేకే ఈ మిసెస్ మూవీ.
బడా నామ్ కరేగా వెబ్ సిరీస్ – సోనీ లివ్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, ఫ్యామిలీ సినిమాల ఫేమ్ సూరజ్ బార్జాత్యా తొలిసారి ఓటీటీలోకి ఈ బడా నామ్ కరేగా వెబ్ సిరీస్ తో అడుగుపెడుతున్నాడు. సోనీ లివ్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. శుక్రవారం నుంచి చూడొచ్చు. జనరేషన్ జెడ్ కు చెందిన ఓ జంట తమ కలలను సాకారం చేసుకుంటూనే తమ కుటుంబ సాంప్రదాయాలను ఎలా కొనసాగిస్తారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.
మద్రాస్కారన్ – ఆహా తమిళం
మలయాళ నటుడు షేన్ నిగమ్ చేసిన తొలి తమిళ మూవీ ఈ మద్రాస్కారన్. ఈ సినిమాను ఆహా తమిళం స్ట్రీమింగ్ చేయనుంది. వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. పెళ్లి చేసుకోవడానికి తన సొంతూరికి వచ్చిన వ్యక్తి, అతని పెళ్లి రోజే జరిగే ఘటన అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్న స్టోరీతో సాగుతుంది.
సంబంధిత కథనం