Best Web Hosting Provider In India 2024
Teenmaar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. కుల గణనపై కూడా చేసిన కామెంట్స్ పై వివరాలను ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
తీన్మార్ మల్లన్న
తెలంగాణ కాంగ్రెస్ లో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన విషయంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ సభలో ఓ కులాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు కుల గణన వివరాలపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
టాపిక్
Ts PoliticsTpccCongressTeenmar Mallanna
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.