![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/rose_day_1707276303_1738849552132.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/rose_day_1707276303_1738849552132.jpg)
Rose Day Wishes: వాలెంటైన్స్ వీక్లో రోజ్ డే వచ్చేసింది, ఈ అందమైన కవితలతో మీ ప్రేమికులకు శుభాకాంక్షలు చెప్పండి
Rose Day Wishes: వాలెంటైన్స్ వీక్ మొదలైపోయింది. ఫిబ్రవరి 7న రోజ్ డే నిర్వహించుకుంటారు. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు ఎర్ర గులాబీలను ఇవ్వడం ద్వారా తమ ప్రేమ భావాలను వ్యక్తపరుస్తారు. గులాబీలు ఇవ్వడంతో పాటు, మీ గర్ల్ ఫ్రెండ్ కు ఈ అద్భుతమైన సందేశాలను పంపండి.
ప్రేమికులందరూ ఎదురుచూసే ఫిబ్రవరి మాసం సంవత్సరంలో అత్యంత రొమాంటిక్ నెల. వాలెంటైన్స్ డేకు ముందు వారం రోజులను వాలెంటైన్స్ వీక్ పేరుతో వేడుకలా నిర్వహించుకుంటారు ప్రేమికులు. ఫిబ్రవరి 7న రోజ్ డేతో వాలెంటైన్స్ వీక్ మొదలవుతుంది. ఈ రోజున అత్యంత అందమైన పువ్వులైన గులాబీలను ప్రేమికులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి 7న దంపతులు ఒకరికొకరు గులాబీలు ఇచ్చిపుచ్చుకుంటారు. గులాబీని ఇవ్వడంతో పాటూ ఒక పేపరుపై అందమైన కవితను రాసి ఇచ్చారంటే వారు గుండె ఉప్పొంగిపోవడం ఖాయం. లేదా ఫోన్ మెసేజులు, వాట్సాప్ లో రోజ్ డే శుభాకాంక్షలు కూడా పంపవచ్చు. రోజ్ డే శుభాకాంక్షలు ఇక్కడ తెలుగులో ఇచ్చాము.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
రోజ్ డే శుబాకాంక్షలు
1. గులాబీ పువ్వు అందమైన చిరునవ్వులాంటిది
ఆ చిరునవ్వు నీ పెదాలపై అంతే అందంగా ఉండాలని కోరుకుంటూ
హ్యాపీ రోజ్ డే మై లవ్
2. గులాబీలాంటి అందమైన ఈ అమ్మాయికి
నేను ఎన్నో గులాబీలను అందిస్తాను
మీరు ప్రతి క్షణం అంతే అందంగా ఉండాలని కోరుకుంటూ
ప్రతి క్షణం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను.
హ్యాపీ రోజ్ డే
3. నా హృదయాన్ని మీ హృదయంతో జోడించేందుకు
ఎంతో ఆనందంగా ఉంది
ఈ సంతోషాన్ని ఈ అందమైన ఎర్రగులాబీతో మీకు తెలియజేస్తున్నాను
హ్యాపీ రోజ్ డే
4. అత్యంత అందమైన గులాబీలు నీకోసమే
ఈ గులాబీలను తీసుకుంటే నువ్వు నా ప్రేమను అంగీకరించినట్టే
అదే జరిగితే నీ కోసం ఆకాశం నుంచి గులాబీల వర్షం కురిపిస్తాను
హ్యాపీ రోజ్ డే
5. ఈ క్షణం నా గుండె ప్రేమతో నిండి పోయింది,
ఈ సమయం నా ప్రేమతో పొంగిపోతోంది,
ఈ గులాబీని కేవలం గులాబీగా భావించవద్దు.
ఈ గులాబీ నా ప్రేమను మీ వరకు తీసుకొచ్చే అందమైన సందేశం
హ్యాపీ రోజ్ డే
6. నా ప్రేమను నీకెలా పంపాలి?
ఈ గులాబీలో నా ప్రేమను నింపేశాను
నా గుండెను గులాబీగా మార్చేశాను
ఈ గులాబీలో నిక్షిప్తమైన నా ప్రేమను స్వీకరించు
హ్యాపీ రోజ్ డే
7. ఈ రోజు నీ హృదయాన్ని గులాబీలతో నింపేయాలని ఉంది,
నీపై నా ప్రేమనంతా కురిపించాలని ఉంది
నీ ప్రేమలో మొత్తం ప్రపంచాన్ని మరచిపోవాలని ఉంది.
హ్యాపీ రోజ్ డే
8. నువ్వు వికసించే ఈ గులాబీవి
ఈ లోకంలో నీలా అందంగా ఉన్నది ఈ ఎర్రగులాబీనే
ఈ ఎర్రగులాబీతో నా ప్రేమను నీకు పంపిస్తున్నాను.
హ్యాపీ రోజ్ డే
9. నా ప్రేమ ఎర్రగులాబీలా స్వచ్ఛమైనది
ఆ స్వచ్ఛమైన ప్రేమ నీకే సొంతం
నేను నీకోసం ఈ అందమైన గులాబీని తెచ్చాను,
నీ జీవితం ఈ గులాబీలాగా అందంగా ఉండాలని కోరుకుంటున్నాను
హ్యాపీ రోజ్ డే
10. రోజ్ డే మళ్లీ వచ్చేసింది
గతేడాది నీకు ఇచ్చిన గులాబీ అందమైన మెమోరీగా మారింది
ఇప్పుడు ఇల్లంతా గులాబీలతో నీకోసం ఎదురుచూస్తున్నాను
నా ప్రేమను స్వీకరిస్తావని ఆశిస్తూ
హ్యాపీ రోజ్ డే
11. నా ప్రేమకు అవధులు లేవు,
నాకు నీ ముఖం తప్ప ఇంకేదీ గుర్తు ఉండడం లేదు
నువ్వు నా ఎర్ర గులాబీవి
ఒక గులాబీని మరొక గులాబీ కోసం పంపిస్తున్నాను.
హ్యాపీ రోజ్ డే
12. ప్రతి పువ్వు స్వచ్ఛంగా జీవితంపై కొత్త ఆశను పెంచుతుంది
మీరు కార్చిన ప్రతి కన్నీరు భవిష్యత్తులో,
దేవుడు మీకు రెట్టింపు ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ…
హ్యాపీ రోజ్ డే
13. నువ్వు నా మదిలో జ్ఞాపకానివి
అవి గులాబీల వలె తాజాగా ఉండనివ్వు
ఆ గులాబీ నన్ను గుచ్చుతున్నా నువ్వు నా ప్రేమవే
హ్యాపీ రోజ్ డే
14. ప్రపంచంలో ఎన్నో గులాబీలు ఉండొచ్చు
కానీ నేను పంపిన గులాబీ అత్యంత అందమైనది
అది నీకు మాత్రమే అంకితం
హ్యాపీ రోజ్ డే
15. నేను పంపిన అందమైన గులాబీని స్వీకరించండి
ఆ గులాబి పువ్వు నా ప్రేమకు అందమైన చిహ్నం.
హ్యాపీ రోజ్ డే
సంబంధిత కథనం