![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Vivekanandan_Viral_OTT_1738856763021_1738856781698.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Vivekanandan_Viral_OTT_1738856763021_1738856781698.jpg)
Today OTT Movies ఓటీటీలో ఇవాళ 13 సినిమాలు- స్పెషల్ 9, తెలుగులో 3- రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, నిహారిక కొణిదెల తమిళ మూవీ కూడా!
Today OTT Release Movies Telugu: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 13 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 9 స్పెషల్‌గా ఉంటే, తెలుగులో 3 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతోపాటు మెగా డాటర్ నిహారిక తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీతోపాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
OTT Release Movies Today Telugu: ఓటీటీలోకి వారం వారం సరికొత్త సినిమాలు వచ్చినప్పటికీ ఎక్కువగా శుక్రవారం రోజునే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలాగే, ఇవాళ (ఫిబ్రవరి 7) కూడా అధిక సంఖ్యలో సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోని లివ్, ఆహా ఓటీటీల్లో ఇవాళ రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
గేమ్ ఛేంజర్ (తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 7
ది మెహాతా బాయ్స్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7
న్యూటోపియా (సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7
సోనీ లివ్ ఓటీటీ
రేఖా చిత్రం (తెలుగు డబ్బింగ్ మలయాళ మిస్ట్రరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 7
బడా నామ్ కరేంగే (హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7
మనోరమ మ్యాక్స్ ఓటీటీ
స్వర్గం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7
ఓషానా (మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా)- ఫిబ్రవరి 7
వాలియెట్టన్ 4కె (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 7
వివేకానందన్ వైరల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ డ్రామా సినిమా) ఆహా ఓటీటీ- ఫిబ్రవరి 7
మద్రాస్కారన్ (తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఆహా తమిళ్ ఓటీటీ- ఫిబ్రవరి 7
ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్)- నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ- ఫిబ్రవరి 7
మిసెస్ (హిందీ ఫ్యామిలీ డ్రామా సినిమా) -జీ5 ఓటీటీ- ఫిబ్రవరి 7
ఐయామ్ నాట్ ఏ రోబోట్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఫిబ్రవరి 7
ఓటీటీలోకి ఇవాళ 13
ఇలా ఇవాళ ఒక్కరోజే 13 సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ చాలా స్పెషల్‌గా ఉండనుంది. అలాగే, మెగా డాటర్ నిహారిక కొణిదెల నటించిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా మద్రాస్కారన్ కూడా స్పెషల్‌గా నిలవనుంది.
స్పెషల్‌గా 9, తెలుగులో 3
ఈ రెండు చిత్రాలతోపాటు క్రికెట్ నేపథ్యంలోని హిందీ డాక్యుమెంటరీ సిరీస్ ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్తాన్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ రీమేక్ హిందీ ఫ్యామిలీ డ్రామా సినిమా మిసెస్, తెలుగు డబ్బింగ్ మలయాళ కామెడీ సినిమా వివేకానందన్ వైరల్, జాంబీ నేపథ్యంలోని కొరియన్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ న్యూటోపియా, మలయాళ ఫ్యామిలీ డ్రామా సినిమా స్వర్గం, హిందీ ఫ్యామిలీ డ్రామా ది మెహతా బాయ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
వీటితోపాటు మలయాళ మిస్టరీ థ్రిల్లర్ రేఖా చిత్రం కూడా స్పెషల్ కానుంది. ఇలా 13లో 9 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలో తెలుగులో 3 వరకు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి.
సంబంధిత కథనం