Karthika Deepam 2 Serial February 7: గుమ్మం నుంచి దీప ఆహ్వానం.. పంతంతో శివన్నారాయణ మాటలు.. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Serial February 7: గుమ్మం నుంచి దీప ఆహ్వానం.. పంతంతో శివన్నారాయణ మాటలు.. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్

Karthika Deepam 2 Serial Today Episode February 7: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. హోమానికి రావాలంటే తాత శివన్నారాయణ కుటుంబాన్ని ఆహ్వానించేందుకు దీప వస్తుంది. గుమ్మం వద్దే నిలబడాల్సి వస్తుంది. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్ ఇస్తుంది దీప. పూర్తి ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
Karthika Deepam 2 Serial February 7: గుమ్మం నుంచి దీప ఆహ్వానం.. పంతంతో శివన్నారాయణ మాటలు.. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్
Karthika Deepam 2 Serial February 7: గుమ్మం నుంచి దీప ఆహ్వానం.. పంతంతో శివన్నారాయణ మాటలు.. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్
 

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 7) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. నగలు తాకట్టు దీపకు సాయం చేసిందా అనే అనుమానంతో తల్లి సుమిత్ర రూమ్‍లో జ్యోత్స్న చెక్ చేస్తుంది. తాను సాయం చేయలేదని చెప్పిన సుమిత్ర.. తనపై జోత్స్నకు ఎందుకు అనుమానం వచ్చిందని అనుకుంటుంది. సాయం చేయాల్సిన నేను చేయలేకపోయానని, దీప ఎదురుపడితే ముఖం ఎలా చూపించాలని అంటుంది. ఇంతలో శౌర్యకు ఆపరేషన్ సక్సెస్ అయినందుకు చేయిస్తున్న హోమానికి ఆహ్వానించేందుకు శివన్నారాయణ ఇంటికి వస్తుంది దీప. గుమ్మ వద్దే నిల్చొని ‘తాతగారు’ అని పిలుస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎందుకు ఊడిపడిందని జ్యోత్స్న అనుకుంటుంది. లోపలికి రావొచ్చా అన దీప అడుగుతుంది.

అక్కడే ఆగు.. గుమ్మం బయటే దీప

దీప లోపలికి వస్తానంటే.. అక్కడే ఆగాలని శివన్నారాయణ అంటాడు. రెండు విషయాలు అడగాలని, వాటికి సమాధానం చెప్పి లోపలికి వస్తే అభ్యంతరం లేదంటాడు. చంటి దానికి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని దీపను శివన్నారాయణ అడుగుతాడు. దీంతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతారు. ఈ మాట అడిగినందుకు సుమిత్ర సంతోషిస్తుంది. శౌర్య ఆరోగ్యంగానే ఉంది తాతగారు అని దీప బదులిస్తుంది. ముందు నువ్వు తాతయ్యగారు అనడం ఆపు.. మనసులో విషం ఉన్నా మాటలు తియ్యగా ఉంటాయని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న నన్ను మాట్లాడనిస్తావా అని శివన్నారాయణ అంటాడు. గుమ్మం బయటే దీపను నిలబెట్టి ప్రశ్నలు వేస్తాడు.

శివన్నారాయణ పంతం

కాంచన, కార్తీక్ మా ఇంటికి వచ్చినప్పుడు నన్ను అనకూడని మాటలు అన్నారని దీపతో శివన్నారాయణ చెబుతాడు. తన కూతురు కాంచన శాపనార్థాలు పెట్టిందని అంటాడు. ఈ ఇంటి గుమ్మం ఎప్పటికీ తొక్కనని కార్తీక్ అన్న మాటలను దీపకు చెబుతాడు. “ఆరోజు ఇక్కడి నుంచి వెళ్లిపోయే ముందు నీ కొత్త భర్త కార్తీక్.. నా మీద సవాల్ చేసి వెళ్లాడు” అని శివన్నారాయణ అంటాడు. ఈ జన్మలో మీ ఇంటి గుమ్మం తొక్కబోమని, కావాల్సి వస్తే మీరే మా గుమ్మం తొక్కాలని కార్తీక్ అన్న మాటలను గుర్తుచేస్తాడు.

 

ఇద్దరికీ రెండు మాటలు లేవు అంటాను

ఈ మాటలు కార్తీక్ నీకు చెప్పలేదా దీపను శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. చెప్పే ఉంటాడంటూ కల్పించుకుంటుంది పారిజాతం. చెప్పిన తర్వాత కూడా దీప వచ్చిందంటే.. భర్త అంటే లెక్కలేదనే కదా గ్రానీ అంటూ కుటిలంగా అంటుంది జ్యోత్స్న. ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకోవాలని కదా అని సుమిత్ర చెబుతుంది. ఇప్పుడు లోపలికి రావాలని దీపను పిలవొచ్చని సుమిత్రతో శివన్నారాయణ అంటాడు. లోపలికి రావాలని దీపను సుమిత్ర పిలుస్తుంది.

రాలేనమ్మా అని దీప అంటుంది. భర్త మాటను జవదాటను అంటావా అని సుమిత్ర ప్రశ్నిస్తుంది. “ఇద్దరికీ రెండు మాటలు లేవు అంటాను” అని దీప అంటుంది. గుమ్మం దాటి లోపలికి రాలేననేలా చెబుతుంది. దీంతో చప్పట్లు కొడుతూ షభాష్ దీప అని పారిజాతం వెటకరిస్తుంది. “గుణస్త్రీవి అనిపించావ్. నీ భర్తను రెచ్చగొట్టి ఇంటికి పంపించిందే కాకుండా.. ఆ అనిపించిన మాట మీద నిలబడి ఉన్నావ్” అని పారు అంటుంది. ఆరోజు వాళ్లు వచ్చిన సంగతి నాకు తెలియదు అని దీప చెబుతుంది.

అప్పుడెందుకు రాలేదు..

నీ భర్తకు తెలియకుండానే ఇప్పుడు ఇక్కడికి వచ్చావా అని దీపను శివన్నారాయణ అడుగుతాడు. అవునంటుంది దీప. నీ కూతురికి ఆరోగ్యం బాగోలేనప్పుడు, డబ్బు అడిగేందుకు నువ్వు ఎందుకు రాలేదని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. నా కూతురికి ప్రాణాలు పోయేందు ప్రమాదం ఉందని అందరికీ తెలిశాకే ఆ విషయం తనకు తెలిసిందని, అప్పటికే జరగాల్సిందంతా జరిగిందని దీప సమాధానమిస్తుంది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చావ్ అని పారిజాతం అంటే.. దీపను మాట్లాడనిస్తారా అత్తయ్య అని సుమిత్ర అంటుంది.

 

గండం దాటింది.. హోమం చేస్తున్నాం

నా కూతురు పెద్దగండం దాటిందని, అది క్షేమంగా ఇంటికి వస్తే కాంచనమ్మ దేవుడికి మొక్కుకున్నారని దీప అంటుంది. రేపు ఇంటి దగ్గర శివుడికి హోమం జరుగుతోందని చెబుతుంది. ఏ ఇంట్లో అయినా హోమం జరిగినా, వ్రతం ఆ ఇంటి మనుషులంతా వచ్చి ఆశీర్వదిస్తేనే శుభం జరుగుతుందని అంటారని, అందులోనూ మీ లాంటి పెద్దల ఆశీర్వాదం నా కూతురికి కావాలని దీప అంటుంది. పెద్ద మనసు చేసుకొని మీరంతా రావాలని ఆహ్వానిస్తుంది.

అత్తరావాలి కదా.. జ్యోత్స్న కన్నింగ్ మాటలు

దీప మాటలకు వెటకారంగా చప్పట్లు కొడుతుంది జ్యోత్స్న. సుమిత్ర కోప్పడితే.. ముందు కారణం వినాలని అంటుంది. శౌర్యకు ఆరోగ్యం బాగోలేకపోతే అందరం బాధపడ్డామని, నేను ఇంకాస్త ఎక్కువ బాధపడ్డానని జోత్స్న అంటుంది. నీ బాధ ఎందుకు నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది దీప. హోమం చేస్తానని కాంచన మొక్కుకుంటే పిలవడానికి వచ్చిందెవరు అని జ్యోత్స్న.. తాత శివన్నారాయణను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుంది. పారిజాతం వత్తాసు పలుకుతుంది. డబ్బుల కోసం దీప రావాలి, పిలిచేందుకు అత్త రావాలి అంటూ కన్నింగ్‍గా లాజిక్‍లు మాట్లాడుతుంది జ్యోత్స్న. అత్త వస్తే రెండు కుటుంబాలు కలిసిపోతాయని దీప భయపడుతుందని, అందుకే ఈవిడ వచ్చిందని వెటకారంగా అంటుంది. జ్యోత్స్న అని అరుస్తుంది దీప.

 

అది చావుతో సమానం

చూడమ్మా.. మేం ఎవరి ఇంటికి రాము అని శివన్నారాయణ అంటాడు. “చంటిది నన్ను ముద్దుల తాత అని పిలిచేది.. దాని కోసమైనా రావాలని అనిపించేదేమో.. కానీ నీ భర్త నన్ను ఎన్ని మాటలు అన్నాడు. ఇప్పుడు వస్తే వాడిని గెలిపించడమే అవుతుంది. అంటే నీ కోసం నీ భర్త ముందు తలదించుకోవాలా” అని శివన్నారాయణ అంటాడు. తల దించుకోవడం అంటే.. ఇది నాకు చావుతో సమానం అని చెబుతాడు. శౌర్యకు అక్షింతలు వేసేందుకైనా రావాలని దీప పిలుస్తుంది. కాంచనమ్మకు తండ్రి హోదాలో రావాలని, హోమం చేయించాలనుకున్నది ఆమెనే అని దీప అడుగుతుంది.

నేను అనాథను..

హోమం జరిగితే పుట్టింటి వాళ్లు ఆశీర్వదించి బొట్టు పెట్టాలని దీప అంటుంది. తాను అనాథను అని, తనకు దిక్కులేదని చెబుతుంది. నువ్వు అనాథవు ఏంటే.. మీ అమ్మానాన్న మీ ముందే ఉన్నారని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కాంచనమ్మకు మీరంతా ఉన్నారు కదా, ఆమెను అనాథను చేయవద్దని అని కన్నీటితో అంటుంది దీప. మా బావకు అందరినీ దూరం చేసింది నువ్వు అంటూ జ్యోత్స్న కల్పించుకుంటుంది. పిలవాలని కాంచనకు, కార్తీక్‍కు అనిపించలేదా అని పారిజాతం అంటుంది. కాంచన వచ్చినప్పుడు ఎందుకు సాయం చేయలేదని పారును సుమిత్ర ప్రశ్నిస్తుంది. దీపకు, కాంచనకు ఎలాంటి సంబంధం లేదని పారిజాతం అంటుంది. నీరు మూస్తే మంచిదని పారుకు కళ్లెం వేస్తాడు శివన్నారాయణ.

 

గుమ్మానికే బొట్టు పెట్టిన దీప

నువ్వు చెవ్వాల్సింది చెప్పావ్.. ఈ ఇంటి నుంచి ఎవరూ రారనే పంతం మీదే ఉంటాడు శివన్నారాయణ. నిలబడితే కాళ్ల నొప్పి అని అంటాడు. బయలుదేరు అని పారిజాతం అరుస్తుంది. అందరూ కలిసి ఉండాలన్నదే తన కోరిక అని దీప చెబుతుంది. బొట్టు పెట్టి పిలవాలంటే గడప దాటాలని, ఇది గడప కాదు.. కార్తీక్ బాబు మాట అని దీప అంటుంది. దాన్ని దాటలేదని చెబుతుంది. ఇంటి గడప మహాలక్ష్మి అంటారు కదా.. అందుకే మహాలక్ష్మికి బొట్టు పెట్టి అందరికీ ఆహ్వానం పలుకుతున్నానని దీప అంటుంది. గుమ్మానికి బొట్టు పెడుతుంది. వస్తారన్న ఆశతోనే వెళుతున్న తాతయ్యగారు అంటూ కన్నీటితో అక్కడి నుంచి వెళుతుంది దీప.

అందరినీ దూరం చేసుకొని మొండిగా బతికేయండి అని దశరథ్‍ను సుమిత్ర అంటుంది. అప్పుడు మీ చెల్లిని, ఇప్పుడు దీపను ఇద్దరినీ సాగనంపింది మాత్రం కన్నీటితోనే అని చెబుతుంది. దీప కార్చిన కన్నీరు గుమ్మంపై పడిందని, కన్నీరు దీపదే అయినా కార్చింది మాత్రం మీ చెల్లి కాంచన కోసం అని సుమిత్ర బాధగా ఉంటుంది. అది మరిచిపోవద్దని అక్కడి నుంచి వెళుతుంది. శివన్నారాయణ మనసు మార్చుకుంటాడేమోనని, నిప్పు మీద నెయ్యి వేయాలని పారు అనుకుంటుంది. ఈ ఇంటి గడపను ఎన్ని కన్నీళ్లు కడగాలో అని దశరథ్ బాధపడతాడు. ఈ గడపను రక్తంతో కడగాలి, దీపను అడగాల్సినవి బ్యాలెన్స్ ఉన్నాయని జ్యోత్స్న అనుకుంటుంది.

 

జ్యోత్స్నకు దీప వార్నింగ్

దీపను ఆపి మరీ తిట్టుంచుకుంటుంది జ్యోత్స్న. సెంటిమెంట్‍కు కరిగిపోయి వచ్చేస్తారని అనుకుంటున్నావా అని దీపతో అంటుంది. ఈ ఇంట్లో వాళ్లు నీ లాంటి హృదయం లేని వాళ్లు కాదు జ్యోత్స్న అని దీప బదులిస్తుంది. గొంత తగ్గించాలని అంటుంది. గొంత తగ్గించకపోతే అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. “కొడితే వెళ్లి మీ తాత కాళ్ల మీద పడతావ్” అని మాస్ వార్నింగ్ ఇస్తుంది దీప. నీలాంటి వాళ్లను చూస్తే లాగిపెట్టి కొట్టాల్సి వస్తుందని అంటుంది. మా ఇంటి కాంపౌడ్‍లో ఉన్నావన మరిచిపోవద్దని జ్యోత్స్న అంటే.. మీ నట్టింట్లో ఉన్నా ఇలాగే మాట్లాడతానని దీప అంటుంది. నువ్వు చేసిన, చేస్తున్న పనికి మాలిన పనులు మీ ఇంట్లో ఎవరికి తెసినా గూబపగలగొట్టే వారని చెబుతుంది. నీ అదృష్టం ఏంటంటే.. నేను చెప్పే మనిషిని కాదని దీప అంటుంది.

తొక్కుకుంటూపోతా

నేను ఈ రెండు కుటుంబాలను కలిపేందుకు సంకల్పంతో ఉన్నా.. అడ్డు రాకు అని దీప అంటుంది. అడ్డు వస్తే అని జ్యోత్స్న అంటుంది. తొక్కుకుంటూ పోతా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది దీప. కార్తీక్ తనకు దేవుడి లాంటి వాడని, సుమిత్ర అమ్మ లాంటి వారని చెబుతుంది. శివన్నారాయణ మనసుకు ప్రశాంతత లేకుండా నువ్వు, నీ గ్రానీ చేస్తున్నారని దీప అంటుంది.

 

డబ్బులెవరు ఇచ్చారు

నీ కూతురు ఆపరేషన్‍కు డబ్బు ఎవరు ఇచ్చారని దీపను జ్యోత్స్న అడుగుతుంది. బావ చెప్పలేదని, నువ్వు అప్పటికప్పుడు అంత డబ్బు ఎక్కడ తెచ్చావని ప్రశ్నిస్తుంది. చెప్తే ఏం చేస్తావని దీప అంటే.. వాళ్లకు సన్మానం చేస్తానని జ్యోత్స్న అంటుంది. డబ్బు ఎవరు ఇచ్చారంటే.. కార్తీక్ బాబు అని దీప సమాధానమిస్తుంది. కావేరీ ఇచ్చిన విషయాన్ని దాచేస్తుంది. కార్తీక్‍కు సన్మానం చేసేందుకు రెడీ చేసుకోవాలని, క్యాటరింగా కావాలంటే చేస్తామని చెబుతుంది. కార్తీక్ టిఫిన్ సెంటర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, టిఫిన్లు అదిరిపోతాయని అంటుంది.

తట్టుకోలేవ్

నన్ను ఇంకా రెచ్చగోడుతున్నావని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఆవేశం ఆరోగ్యానికి మంచిది కాదని, నిమ్మకాయ పిండుకొని, మజ్జిగ తాగి పడుకోవాలని దీప సూచిస్తుంది. నువ్వు మొదలుపెట్టిన యుద్ధాన్ని ఆపేయ్, నిరాశ మిగులుతుంది హెచ్చరిస్తుంది. రాటుదేలిన తన అడుగును కూడా తట్టుకోలేవని అంటుంది. వస్తా అని అక్కడి నుంచి దీప వెళ్లిపోతుంది.

నువ్వు అనాథలా ఉంటేనే ఇంత రెచ్చిపోతున్నావంటే.. నువ్వు ఈ ఇంటి వారసురాలని తెలిస్తే నిజంగానే గొంతు మీద కాలేసి తొక్కుతావేమోనని జోత్స్న రగిలిపోతుంది. “నువ్వు ఆపాలి, నిన్ను ఇంకా ఏడిపించాలి. భయపడి పారిపోయేలా చేయాలి. ఏదైనా చేయాలంటే బావకు ఆ డబ్బు ఎవరు ఇచ్చారో తెలుసుకోవాలి” అని జ్యోత్స్న అరుస్తుంది.

 

కావేరికి ఆహ్వానం

శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఇచ్చిన కాంచన సవతి కావేరి ఇంటికి దీప వెళుతుంది. దీప రావటంతో కావేరి సంతోషిస్తుంది. మీరు చేసిన మంచి, రుణం తీర్చుకునేందుకు ఈ జీవితం సరిపోతుందా అని దీప అంటుంది. కాఫీ తెస్తానని కావేరి అంటే.. వద్దంటుంది దీప. పాప కోసం హోమం జరిపిస్తానని కాంచనమ్మ మొక్కుకున్నారని, రేపు ఇంట్లో హోమం ఉందని తప్పకుండా రావాలని కావేరికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తుంది దీప. అప్పుడే బయటి నుంచి శ్రీధర్ వస్తుంటాడు దీప ఇంటికి వచ్చి, నా భార్యకు బొట్టు పెడుతుందేటి అని శ్రీధర్ అనుకుంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 7) ఎపిసోడ్ ముగిసింది.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024