Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/brahmamudi_1738893082440_1738893085957.jpg)
Brahmamudi Today Episode: ఒక్కటైన దుగ్గిరాల ఫ్యామిలీ -స్వప్న కూతురికి తల్లిగా మారిన కావ్య – బాంబు పేల్చనున్న అనామిక
పోలీస్ ఆఫీసర్ జాబ్‌లో జాయిన్ అయిన అప్పు…దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఏంటి ఈ దసరా వేషం అంటూ అప్పును పోలీస్ డ్రెస్‌లో చూసి కామెంట్ చేస్తుంది రుద్రాణి. అలాంటి వేషాలు వేయడం మీకు అలవాటు నా చెల్లెలికి కాదని కావ్య కౌంటర్ వేస్తుంది. అప్పు పోలీస్ ట్రైనింగ్ పూర్తిచేసుకొని ఇదే ఊళ్లో ఎస్ఐగా పోస్టింగ్ తీసుకున్నట్లు కావ్య చెబుతుంది.
వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా…
నిన్ను, నీ మొగుడిని అవమానించిన మీ అత్తకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా? దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వచ్చావా అంటూ రుద్రాణి తన నోటికి పనిచెబుతుంది. మీ మనసులో ఉన్న ఆలోచనలను మా మాటలుగా చెప్పాలని ఎందుకు అనుకుంటున్నారని రుద్రాణి మాటలను కళ్యాణ్ అడ్డుకుంటాడు. ఈ ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి మాత్రమే వచ్చామని చెబుతాడు.
అనుకున్నది సాధించిన మీరు జీవితాంతం పిల్లపాపలతో సంతోషంగా ఉండాలని అప్పు, కళ్యాణ్‌లను ఇందిరాదేవి దీవిస్తుంది. ధాన్యలక్ష్మి ఆశీర్వాదం తీసుకోవడానికి కళ్యాణ్ ఆలోచిస్తుంటాడు. ఏమైందని అపర్ణ అడుగుతుంది.
శత్రువులా దూరం పెట్టి…
ఇష్టం లేకపోయినా అప్పు, కళ్యాణ్‌లను ఆశీర్వదిస్తుంది ధాన్యలక్ష్మి. కొడుకు ఎన్నితప్పులు చేసినా తల్లిగా నువ్వు బాగాండాలనే కోరుకుంటాను. శత్రువులా చూసి దూరం పెట్టలేను కదా అని కళ్యాణ్‌తో అంటుంది ధాన్యలక్ష్మి. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలనే మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందని కళ్యాణ్‌ను అడుగుతుంది అపర్ణ. ఇక నువ్వు మాకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదని, అందరం కలిసి ఉందామని అంటుంది.
రుద్రాణి ఫిట్టింగ్…
కానీ రుద్రాణి ఫిట్టింగ్ పెడుతుంది. కళ్యాణ్ ఇక్కడే ఉండటానికి ఒప్పుకోవాలిగా అని అంటుంది. కళ్యాణ్ అనుకుంటున్నట్లు ఇంకా మంచి పేరు సంపాదించలేదు. ఇంటికి తిరిగి వస్తే ఏం అవమానాలు జరుగుతాయో అని కళ్యాణ్ భయం అని రుద్రాణి అంటుంది. ఇంట్లో అమ్మతో పాటు మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి కొందరు సిద్ధంగా లేరని, అందరూ మనస్ఫూర్తితో ఒప్పుకున్న రోజు తప్పకుండా వస్తామని కళ్యాణ్ అంటాడు.
స్వప్న కూతురు బారసాలనుగ్రాండ్ను నిర్వహిద్దామని కావ్య అంటుంది. మీ వాళ్లు అనేసరికి గ్రాండ్ అని మాటలతోనే కోట్లు కురిపిస్తావు. అదే మేము అనే సరికి గుడి ముందు ముష్టివాళ్లకు వేసినట్లు చిల్లర వేస్తారని రుద్రాణి గొడవకు దిగుతుంది.
రాహుల్ అసహనం…
కళ్యాణ్, అప్పులను ఆ రోజు అక్కడే ఉండమని కావ్య కోరుతుంది. ఆమె మాట కాదనలేక ఇద్దరు ఒప్పుకుంటారు. తన కూతురి బారసాలకు కావ్యతో పాటు మిగిలిన వాళ్లు చేస్తోన్న హడావిడి చూసి రాహుల్ భరించలేకపోతాడు. తమ చిన్ననాటి సంగతులు గుర్తుచేసుకుంటారు కావ్య, అప్పు, స్వప్న. మాటల్లో మునిగిపోతారు.
ఒకే ఇంటికి ముగ్గురం కోడళ్లుగా రావడానికి కారణం తానేనని, ఆ క్రెడిట్ తనకే ఇవ్వాలని స్వప్న అంటుంది. పెళ్లయిన తర్వాత ఇంట్లో గొడవలు జరిగాయని అందుకు నిన్ను తిట్టుకోవాలా అని అప్పు సెటైర్లు వేస్తుంది. స్వప్న కూతురు గుక్కపెట్టి ఏడవటంతో ఆమెను ఎత్తుకొని బుజ్జగిస్తుంది కావ్య. పాటలు పాడి నిద్రపుచ్చుతుంది.
అపర్ణ ఆనందం…
ముగ్గురు అక్కచెల్లెళ్లు కలిసిపోయి కబుర్లు చెప్పుకోవడం చూసి ఇందిరాదేవి, అపర్ణ ఆనందపడతారు. తమ ఫ్యామిలీ సంతోషగా గడిపిన రోజులను గుర్తుచేసుకుంటుంది అపర్ణ. డబ్బు తమ సంతోషాన్ని దూరం చేసిందని ఇందిరాదేవి అంటుంది. మీరు కోరుకుంటున్న ఆనందం తప్పకుండా మళ్లీ మన జీవితంలోకి వస్తుందని అత్తయ్యకు సర్ధిచెబుతుంది అపర్ణ.
కళ్యాణ్‌కు అన్యాయం…
కళ్యాణ్‌కు అన్యాయం జరుగుతుందని, అతడికి దక్కాల్సిన ఆస్తిని రాజ్, కావ్య అనుభవిస్తున్నారని భర్తతో వాదనకు దిగుతుంది ధాన్యలక్ష్మి. వాటాలు అడిగితే ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అంటుంది. కళ్యాణ్ మంచితనాన్ని చేతకానితనంగా మార్చేసి కావ్య తన వైపుకు తిప్పుకుందని గొడవ చేస్తుంది. వాడికి ఏం రావాలో, ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలా మనమే చెప్పాలని భర్తతో ధాన్యలక్ష్మి అంటుంది.
కళ్యాణ్ ఒప్పుకుంటే ఈ ఇంటి నుంచి విడిపోయి…మనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని కళ్యాణ్‌తో సంతోషంగా ఉండొచ్చని భర్తకు చెబుతుంది. నాకు ఎందుకో మనం తొందరపడుతున్నామని అనిపిస్తుందని ప్రకాశం బదులిస్తాడు. కళ్యాణ్‌కు అన్యాయం జరుగుతుందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావని చెబుతాడు.
రాజు, రాణిల్లా…
ఇంట్లో వాళ్లకు కావాలనే రాజ్, కావ్య కలిసి పేదరికాన్ని అలవాటు చేస్తున్నారని, రాజు, రాణిల్లా వారిద్దరు అధికారాన్ని చెలాయిస్తే మనం మాత్రం జీవితాంతం వాళ్ల కాళ్ల దగ్గర బానిసల్లా బతకాల్సివస్తుందని ధాన్యలక్ష్మి అంటుంది. కళ్యాణ్ ఇక్కడికి వస్తే అన్న మోచేతి నీళ్లు తాగుతూ మీలాగే బతకాల్సివస్తుందని ధాన్యలక్ష్మి అపోహపడుతుంది. రాజ్ అలాంటివాడు కాదని ప్రకాశం ఎంత చెప్పిన ధాన్యలక్ష్మి వినదు.
ఆస్తిపై కన్నేసిన తర్వాత ఎ వరైనా స్వార్థంగానే ఆలోచిస్తారని ధాన్యలక్ష్మి చెబుతుంది. బారసాల ముగిసే లోపు ఆస్తి గురించి కళ్యాణ్‌తో మాట్లాడాల్సిందేనని భర్తకు ఆర్డర్ వేస్తుంది ధాన్యలక్ష్మి.
అనామిక స్కెచ్…
దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషంగా కలిసిపోవడం చూసి రుద్రాణి భరించలేకపోతుంది. వారి ఆనందాన్ని చెడగొట్టడం అనామికతో కలిసి కొత్త ప్లాన్ వేస్తుంది. తాను రేపు దుగ్గిరాల ఇంటికి రాబోతున్నట్లు రుద్రాణితో చెబుతుంది అనామిక. తాను పేల్చే బాంబుతో దుగ్గిరాల ఫ్యామిలీ షేక్ కావడం ఖాయమని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.