TG Electricity Consumption : తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎందుకు పెరుగుతోంది.. 10 ముఖ్యమైన అంశాలు

Best Web Hosting Provider In India 2024

TG Electricity Consumption : తెలంగాణలో విద్యుత్ వినియోగం ఎందుకు పెరుగుతోంది.. 10 ముఖ్యమైన అంశాలు

Basani Shiva Kumar HT Telugu Feb 07, 2025 09:37 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Feb 07, 2025 09:37 AM IST

TG Electricity Consumption : ప్రతి ఏడాది ఎండాకాలంలో విద్యుత్ వినియోగం పెరగడం సాధారణమే. కానీ ఈసారి వేసవి రాకముందే.. తెలంగాణలో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. దానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.

తెలంగాణలో విద్యుత్ వినియోగం
తెలంగాణలో విద్యుత్ వినియోగం (istockphoto)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి 6వ తేదీన ఒక్కరోజే 15 వేల 752 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది మార్చి 8న 15 వేల 623 మెగావాట్లు వినియోగించగా.. ఈసారి ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయిలో వినియోగం పెరిగింది. ఈ స్థాయిలో విద్యుత్ వినియోగం ఎందుకు పెరుగుతోంది..? దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

yearly horoscope entry point

1.వ్యవసాయం పెరుగుదల..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ ప్రధానమైంది. వ్యవసాయానికి నీటి పారుదల సౌకర్యం కోసం విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. రైతులు పంటలకు నీరు పెట్టడానికి ఎక్కువగా విద్యుత్ మోటార్లు ఉపయోగిస్తున్నారు.

2.పారిశ్రామికీకరణ..

తెలంగాణలో పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. కొత్త పరిశ్రమలు స్థాపించడం, ఉన్న పరిశ్రమలు విస్తరించడం వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతోంది.

3.నగరాల అభివృద్ధి:..

హైదరాబాద్ వంటి పెద్ద నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీనితో పాటు జనాభా పెరుగుదల, గృహోపకరణాల వినియోగం వంటివి విద్యుత్ వినియోగాన్ని పెంచుతున్నాయి.

4.జీవనశైలిలో మార్పులు..

ప్రజల జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఎక్కువ మంది ఇళ్లలో ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి విద్యుత్ పరికరాలు వాడుతున్నారు. ఇది విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఒక కారణం.

5.ప్రభుత్వ పథకాలు..

తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వీటిలో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం వల్ల విద్యుత్ వినియోగం పెరిగింది. అటు గృహజ్యోతి కింద పేదలకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు.

6.ఐటీ రంగం అభివృద్ధి..

హైదరాబాద్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందింది. ఇక్కడ అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. దీని వల్ల విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ అవుతోంది.

7.రవాణా రంగం..

తెలంగాణలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఛార్జింగ్ స్టేషన్ల అవసరం ఏర్పడింది. అవే కాకుండా ఇళ్లలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ పెడుతున్నారు. దీనివల్ల కూడా విద్యుత్ వినియోగం పెరుగుతుంది.

8.నిరంతర సరఫరా..

తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు నిరంతరంగా విద్యుత్ సరఫరా అందిస్తోంది. ఇది కూడా వినియోగం పెరగడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.

9.వేసవి కాలం..

పూర్తిగా ఎండాకాలం రాలేదు. కానీ వాతావరణంలో మార్పుల కారణంగా వేడి పెరిగింది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల ఎయిర్ కండిషనర్లు, కూలర్లు వంటివి ఎక్కువగా వాడతున్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుంది.

10.విద్యుత్ పరికరాల వినియోగం..

ప్రజలు ఎక్కువగా విద్యుత్ పరికరాలు ఉపయోగిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, టీవీలు వంటివి నిరంతరం వాడటం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు.

Whats_app_banner

టాపిక్

ElectricityTelangana NewsElectric BusTgspdcl
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024