Best Web Hosting Provider In India 2024
Navodaya Entrance: సిద్దిపేట జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష: 10 కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు
Navodaya Entrance: జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9,11వ తరగతుల్లో ప్రవేశ పరీక్షలు ఫిబ్రవరి 8న జరుగనుండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్ధిపేటలో ప్రవేశపరీక్ష జరిగే పది కేంద్రాల్లో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు.
Navodaya Entrance: జవహర నవోదయ పాఠశాలల్లో ప్రవేశపరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 8న జవహర్ నవోదయ విద్యాలయాల్లో IX & XI తరగతులకు ప్రవేశ పరీక్ష జరుగనుంది. సిద్దిపేట జిల్లాలో ఉన్న 10 కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ తెలిపారు.
శనివారం ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు అమల్లో 163 BNSS అమ్మల్లో ఉంటుందన్నారు, పరీక్ష జరుగు సమయములో పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని, పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది పరీక్ష సమయంలో పెట్రోలింగ్ చేయడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పరీక్ష సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఎటువంటి మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
పరీక్షా కేంద్రాలు….
1 గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్.
2 జిల్లా పరిషత్ హై స్కూల్ బాయ్స్, ప్రజ్ఞాపూర్.
3 సాయి జిడిఆర్ హైస్కూల్, గజ్వేల్.
4 సెంట్ జోసెఫ్ గర్ల్స్ హై స్కూల్, గజ్వేల్.
5 సెంట్ పీటర్స్ హై స్కూల్ తూప్రాన్ రోడ్, గజ్వేల్.
6 జవహర్ నవోదయ విద్యాలయం, వర్గల్.
7 జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్.
8 జడ్పీహెచ్ఎస్ ఆర్ అండ్ ఆర్ కాలనీ, గజ్వేల్.
9 తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ గర్ల్స్ ముట్రాజ్ పల్లి కేజీ & పీజీ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్.
10 సెంట్ మేరీస్ విద్యానికేతన్, ప్రజ్ఞాపూర్.
ప్రభుత్వ హాస్టల్ లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ …
జిల్లా కలెక్టర్ మను చౌదరి గురువారం కొండపాక మండలంలోని దుద్దెడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల (బాలురు), కొండపాక లో ఉన్న జగదేవపూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్/ జూనియర్ కళాశాల (బాలికలు), కొండపాక మండల కేంద్రంలో గల వెనుకబడిన తరగతుల బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు.
హాస్టల్లో భోజనం, వసతి మరియు విద్యా సౌకర్యాలను పరిశీలించారు. ముందుగా దుద్దెడ టీజీడబ్ల్యూ ఆర్ఎస్/ జెసి ని సందర్శించి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులతో వార్షిక పరీక్షల ప్రిపరేషన్ గురించి వాకబ్ చేశారు.
ఇంటర్ లో 100 % రిజల్ట్స్ రావాలి…
మార్చి 6 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉన్నందున 100% ఉత్తీర్ణత సాధించాలంటే అన్ని సబ్జెక్టులను రిపీటెడ్ గా చదవాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టులను ప్రాక్టీస్ చేస్తూ కఠిన తరమైన సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
పరీక్షలు మంచిగా రాసేలా స్లిప్ టెస్ట్ లు ఎక్కువ పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. వంటగదిని హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆకుకూరలు అధికంగా ఉండేలా మెనూ ప్రకారం ఆహారం అందించాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ కృష్ణను ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్