![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/ajith_1738910141082_1738910144975.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/ajith_1738910141082_1738910144975.jpg)
Vidaamuyarchi Collections: పట్టుదల ఫస్ట్ డే కలెక్షన్స్ – కోట్లు అనుకుంటే లక్షలే కష్టంగా రాబట్టిన అజిత్ మూవీ
Vidaamuyarchi: అజిత్ విదాముయార్చి మూవీ తొలిరోజు బాక్సాఫీస్ వద్ద డిసపాయింట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. పట్టుదల పేరుతో తెలుగు రిలీజైన ఈ మూవీ అతి కష్టంగా యాభై లక్షల కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు ట్రెడ్ వర్గాల చెబుతోన్నాయి
అజిత్ విదాముయార్చి మూవీ (తెలుగులో పట్టుదల) తొలిరోజు బాక్సాఫీప్ వద్ద తేలిపోయింది. అజిత్‌కు తమిళంలో ఉన్న క్రేజ్, పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడంతో విదాముయార్చి మూవీ ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ రాబడుతుందని ఫ్యాన్స్ భావించారు.కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా అంచనాల్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలా పడింది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
ఇరవై రెండు కోట్లు…
మొదటిరోజు విదాముయార్చి మూవీ వైరల్డ్ వైడ్‌గా ఇరవై రెండు కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.అందులో తమిళ వెర్షన్ కలెక్షన్స్ 21.50 కోట్లు ఉండగా…తెలుగు వెర్షన్‌కు కేవలం యాభై లక్షలు మాత్రమే రాబట్టింది.
అతి కష్టంగా…
విదాముయార్చి మూవీ పట్టుదల పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. అజిత్‌కు తెలుగులో సరైన మార్కెట్ లేకపోవడం, ప్రమోషన్స్ అసలే చేయకపోవడంతో పట్టుదల బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. అతి కష్టంగా యాభై లక్షల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
తండేల్ రిలీజ్‌తో…
శుక్రవారం తండేల్ రిలీజ్ కావడంతో పట్టుదల కలెక్షన్స్ మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.త్రిష హీరోయిన్గా నటించిన ఈ మూవీలో అర్జున్, రెజీనా నెగెటివ్ పాత్రలు పోషించారు. హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్ ఆధారంగా స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు మగిళ్ తిరుమేని ఈ మూవీని తెరకెక్కించాడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది. విదా ముయార్చి నిర్మాతలకు భారీగానే నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అజిత్ గత మూవీ తినువు 24 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్నది. తినువు కంటే విదాముయార్చి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి.
విదాముయార్చి కథ ఇదే…
తన భార్య మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే ఓ భర్త కథతో విదాముయార్చి మూవీ రూపొందింది.అర్జున్ (అజిత్) కయల్(త్రిష) ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. భర్త నుంచి విడిపోవాలని కయల్ నిర్ణయించుకుంటుంది. కయల్తో కలిసి చివరగా ఓ ట్రిప్ ప్లాన్ చేస్తాడు అర్జున్. అనుకోకుండా వారి కారు ఆగిపోతుంది. అనుకోకుండా కయల్ కనిపించకుండా పోతుంది? కయల్ ఏమైంది? సాయం చేస్తున్నట్లూ నటించిన ఆమెను కిడ్నాప్ చేసిన రక్షిత్, దీపక ఎవరు? వారి బారి నుంచి కయల్‌ను అర్జున్ ఎలా కాపాడుకున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
విదాముయార్చి తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా చేస్తోన్నాడు అజిత్. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది.