Best Web Hosting Provider In India 2024
Manipulative Persons: మాటలతో మోసపోకండి! మీ చుట్టూ ఉండి మిమ్మల్ని మాయ చేసే వాళ్లను గుర్తించండిలా!
Manipulative Persons: తోటివారి వల్ల ఎప్పుడూ నష్టానికి గురవుతున్నారా..? మీ చుట్టూ ఉండే మాయగాళ్లే మిమ్మల్ని మోసం చేస్తూ ఉండొచ్చు. మాటలతో మానిప్యులేట్ చేసి మీ ద్వారా లాభం పొందాలనుకునే వారిని గుర్తించండి.
జీవితంలో కొందరి మాటలను నమ్మి మనం నష్టపోతుంటాం. మోసగాళ్ల వలలో పడి భారీ నష్టాలు కొని తెచ్చుకుంటాం. చివరికి రియలైజ్ అయి నష్టపోయామని లెంపలేసుకుంటాం. అప్పటికే పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతాం. ఇకపై అలా జరగకుండా ఉండాలంటే, ముందుగా మన చుట్టూ ఉన్న మోసగాళ్లెవరో గుర్తించాలి. వాళ్ల మాయలో పడి మోసపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ మాయగాళ్లను వారి ప్రవర్తనను బట్టే సులువుగా తెలుసుకోవచ్చట. కపటవంతులు మిమ్మల్ని మూర్ఖులను చేసి తమకు లాభం చేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారట. మనస్తత్వ శాస్త్రంలో కొన్ని శారీరక భాషా సంకేతాల ఆధారంగా వీరిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చట. అదెలా అంటారా..? మోసం చేయాలనుకునే వారు ఎలా ప్రవర్తిస్తారో, వారిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి.
కలల్లో చూపించి మాటలతో నమ్మించే ప్రయత్నం:
కపటవంతులు లేదా మోసగాళ్లు తమ మాటలను మీరు నమ్మేలా చేస్తారు. నమ్మదగిన మాటలు చెప్పి లేని విషయాన్ని, వారు చేయలేని అంశాలను కూడా చేయగలమనే భ్రమలోకి తీసుకెళ్తారు. పూర్తిగా వారిపై విశ్వాసం కలిగేలా చేసి మాటలతో నమ్మబలుకుతారు. రంగుల భవిష్యత్తును చూపించి, ప్రస్తుతాన్ని దోచేస్తారు. వారి మాటలపై నమ్మకం కలిగించడం కపటవంతుల ప్రథమ లక్షణం.
మాటల్లో చిక్కుకోవడం:
ఎవరైనా మాయగాళ్లు, మీ నుండి లాభం పొందాలనే ఆలోచనలో ఉంటే, వారు మిమ్మల్ని ఎల్లప్పుడూ మాటల్లో చిక్కుకునేలా చేస్తారు. ఎప్పుడూ మంచి మాటలు చెప్తూ , మీకు నచ్చేలా వ్యవహరిస్తారు. మీకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడరు. అలాంటి వ్యక్తులు చాలా కపటవంతులు. వారు తమ పనిని పూర్తి చేసుకోవడానికి, మిమ్మల్ని మూర్ఖులను చేయడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కళ్లను వేగంగా తిప్పుతూ:
ఎవరైనా మీతో ఎల్లప్పుడూ ఈ విధంగా ప్రవర్తిస్తే, వారు మిమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారని అర్థం చేసుకోండి. ఐ కాంటాక్ట్ ద్వారా కూడా కపటవంతులను గుర్తించి వారి నుండి తప్పించుకోవచ్చు. ఎవరైనా సంభాషణ సమయంలో వేగంగా కళ్ళను కదిలిస్తూ మాట్లాడుతుంటే, వారు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి, మీ శారీరక భాషను అర్థం చేసుకుంటున్నారని, వేగంగా గమనిస్తున్నారని అర్థం. తద్వారా అవకాశం దొరికినప్పుడు తమకు లాభం చేసుకుంటారు.
లేని అవసరాలను రుద్దుతారు:
తమకు నచ్చిన లేదా తాము మీతో కొనుగోలు చేయించాలనుకున్న వస్తువులను బలవంతంగా మీకు అప్పగించే ప్రయత్నం చేస్తారు. దాంతో మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్నదని, లేదంటే భవిష్యత్లో అవసరం ఉంటుందనే భ్రమను కలిగిస్తారు.
సన్నిహితంగానే ఉంటూ:
మీతో సన్నిహితంగానే ఉంటున్నట్లు వ్యవహరిస్తారు. మీ కోసం ఏదైనా చేసేలా కనిపిస్తారు. ప్రతి అవసరానికి మీ మీద ఆధారపడతారు. మీకు అవసరమయ్యే సమయానికి వీలు లేదని, కనపడకుండా పోతారు. తమ మీదకు అపనింద రాకుండా వేరే ఏదైనా విషయాన్ని చూపించి తప్పించుకుంటారు.
కపటవంతులు, మోసగాళ్ల నుండి ఎలా తప్పించుకోవాలి
సాధారణంగా మాట్లాడండి: మీకు తగిన నిర్ణయాలు తీసుకునే ముందు, మనసు స్థిరంగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉండండి.
తక్షణ నిర్ణయాలు తీసుకోకండి: నిర్ణయాలను వాయిదా వేయండి. అవసరం అనుకుంటే మరింత సమయం తీసుకుని, నిపుణుల చర్చకు తీసుకువెళ్లడం మంచిది.
ప్రయోజనాన్ని అవగాహన చేసుకోండి: ఎప్పుడూ “అత్యంత లాభదాయకమైన” లేదా “వీడియో ఆధారంగా ” విన్న విషయాలను పూర్తిగా నమ్మకండి. పలువురి అభిప్రాయం తీసుకున్న తర్వాతే నిర్ధారణకు రండి.
మనస్తత్వ శాస్త్రంలో చెప్పిన ఈ సూచనలు మనస్సులో ఉంచుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్లు నిజం చెప్తున్నారా. అబద్దాలతో మిమ్మల్ని ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారా అనే విషయాన్ని నిర్ధారించుకోండి.
సంబంధిత కథనం
టాపిక్