Thandel Review: తండేల్ రివ్యూ – నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి మూవీ హిట్టా? ఫ‌ట్టా?

Best Web Hosting Provider In India 2024

Thandel Review: తండేల్ రివ్యూ – నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి మూవీ హిట్టా? ఫ‌ట్టా?

Nelki Naresh Kumar HT Telugu
Feb 07, 2025 01:12 PM IST

Thandel Review: నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తండేల్ మూవీ శుక్ర‌వారం రిలీజైంది. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ప్రేమ‌క‌థా చిత్రం ఎలా ఉందంటే?

తండేల్ రివ్యూ
తండేల్ రివ్యూ

Thandel Review: ఈ ఏడాది తెలుగు ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూసిన సినిమాల్లో తండేల్ ఒక‌టి. ల‌వ్ స్టోరీ త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేశ‌భ‌క్తికి, ప్రేమ‌క‌థ‌ను జోడించి రూపొందిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తండేల్ మూవీ ఎలా ఉంది? నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జోడి మెప్పించారా? లేదా? అంటే?

yearly horoscope entry point

రాజు, స‌త్య ప్రేమ‌క‌థ‌…

రాజు (నాగ‌చైత‌న్య‌), స‌త్య (సాయిప‌ల్ల‌వి) చిన్న‌నాటి నుంచి క‌లిసి పెరుగుతారు. స్నేహంతో మొద‌లైన వారి జ‌ర్నీ ప్రేమ‌గా మారుతుంది. రాజు వార‌స‌త్వంగా వ‌చ్చిన మ‌త్స్య‌కార వృత్తిలో కొన‌సాగుతుంటాడు. చేప‌ల వేట కోసం ఏడాదిలో తొమ్మిది నెల‌లు స‌ముద్రంపైనే ఉంటాడు.ఆ తొమ్మిది నెల‌లు రాజు కోసం ఎదురుచూస్తూ బ‌తికేస్తుంది స‌త్య‌.

చేప‌ల వేట‌కు వెళ్లిన రాజుకు ఏం జ‌రుగుతుందోన‌ని ప్ర‌తిక్ష‌ణం భ‌య‌ప‌డుతుంటుంది స‌త్య. ప్రియురాలి బాధ‌, భ‌యం చూసిన రాజు మ‌ళ్లీ వేట కోసం స‌ముద్రంపైకి వెళ్ల‌న‌ని స‌త్య‌కు మాటిస్తాడు.

కానీ స‌త్య‌కు ఇచ్చిన మాట త‌ప్పుతాడు రాజు. త‌న‌కు తండేల్ ముఖ్య‌మ‌ని స‌ముద్రంలోకి వెళ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? చేపల వేట‌కు వెళ్లిన రాజు పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్‌కు ఎలా దొరికిపోయాడు? పాకిస్థాన్ జైలులో రాజుకు ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి?

స‌త్య‌కు ఇచ్చిన ప్రామిస్‌ను రాజు నిల‌బెట్టుకోలేక‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి? రాజుపై కోపంతో అత‌డిని కాద‌ని మ‌రొక‌రితో స‌త్య పెళ్లికి ఎందుకు సిద్ధ‌ప‌డింది? రాజు జైలు నుంచి విడుద‌ల‌య్యాడా? అత‌డి ప్రేమ‌ను స‌త్య అర్థం చేసుకుందా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో…

దేశ‌భ‌క్తి అన్న‌ది ఓ ఎమోష‌న్. బాక్సాఫీస్ స‌క్సెస్ ఫార్ములాగా అనేక సార్లు నిరూపిత‌మైన ఈ ఎమోష‌న్‌కు ల‌వ్ స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెర‌కెక్కించాడు.

మ‌త్స్య‌కారుల జీవితంలో జ‌రిగిన కొన్ని య‌థార్థ సంఘ‌ట‌న‌ల‌ను తీసుకొని వాటికి ఫిక్ష‌న‌ల్ అంశాలు జోడించి తండేల్ క‌థ రాసుకున్నాడు.

తండేల్ మూవీకి బ్యాక్‌డ్రాప్ ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది. స‌ముద్రం, జాల‌ర్ల జీవితాల‌ను తెర‌పై చూపించే క‌థ‌ల‌తో తెలుగులో చాలా త‌క్కువ సినిమాలొచ్చాయి. రా అండ్ ర‌స్టిక్‌గా ఈ నేటివిటీని సినిమాలో చూపించాడు డైరెక్ట‌ర్. యాస నుంచి లైఫ్ స్టైల్ వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలో స‌హ‌జ‌త్వానికి ప్రాముఖ్య‌త‌నిచ్చాడు.

విర‌హ‌వేద‌న‌…

రాజుకు స‌త్య దూర‌మ‌య్యే సీన్‌తోనే తండేల్ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత వారి ప్రేమ‌క‌థ‌ను చూపిస్తూ క‌థ‌ను న‌డిపించారు. ప్రియురాలికి దూర‌మై రాజు ప‌డే సంఘ‌ర్ష‌ణ‌, మ‌రోవైపు స‌త్య విర‌హ వేద‌న‌ను, ఎదురుచూపుల‌ను పొయేటిక్‌గా చూపించారు.

ఈ ప్రేమ‌క‌థ‌తోపాటు స‌మాంత‌రంగా తండేల్ అంటే ఏమిటి? చేప‌ల వేట‌కు వెళ్లిన జాల‌ర్ల క‌ష్టాలు, క‌న్నీళ్ల‌తో పాటు యాస గొప్ప‌త‌నాన్ని చూపించారు. ల‌వ్ స్టోరీ భ‌లేగా అనిపించిన మిగిలిన‌ సీన్స్‌ను కావాల‌నే క‌థ‌లో ఇరికించిన‌ట్లు ఉ న్నాయి. నాచురాలిటీ మిస్స‌య్యింది.

దేశ‌భ‌క్తి…

దేశ‌భ‌క్తి…

రాజు పాకిస్థాన్ కోర్ట్ గార్డుల‌కు చిక్క‌డంతో క‌థ దేశ‌భ‌క్తి వైపు ట‌ర్న్ తీసుకుంటుంది. జైలులో రాజు అండ్ టీమ్‌కు ఎదుర‌య్యే అవ‌మానాలు, వందేమాత‌రం పాడి త‌మ దేశ‌భ‌క్తి నిరూపించుకోవ‌డం, దేశం పేరును గోడ‌పై రాసి అవ‌మానించిన శ‌త్రువుల‌కు రాజు బుద్ధి చెప్ప‌డం లాంటివి ఆడియెన్స్‌కు హై ఫీల్‌ను ఇవ్వ‌లేక‌పోయాయి.

రాజు కోసం ఢిల్లీలో హీరోయిన్‌ చేసే పోరాటం కూడా సోసోగానే అనిపిస్తుంది. ప‌డుతూ లేస్తూ సెకండాఫ్ సాగింది. త‌మ టీమ్‌లోని ఓ మెంబ‌ర్‌ను రాజు కాపాడే సీన్ డైరెక్ట‌ర్ థ్రిల్లింగ్‌గా రాసుకున్నాడు. అలాంటివి సెకండాఫ్‌లో మ‌రికొన్ని ప‌డుంటే సినిమా స్థాయి మారిపోయేది.

పోటీప‌డి…

నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి పోటీప‌డి న‌టించారు. వారిద్ద‌రి ల‌వ్‌స్టోరీ, కెమిస్ట్రీని అందంగా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. చాలా చిన్న చిన్న భావాల‌ను నుంచే ప్రేమ క‌థ‌ను హృద్యంగా ప‌డించ‌డం బాగుంది. రాజు పాత్ర నాగ‌చైత‌న్య కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలుస్తుంది. సాయిప‌ల్ల‌వి గ‌త సినిమాల‌కు భిన్నంగా క‌నిపించింది. గుండె నిండా బాధ‌ను మోస్తున్న‌ అమ్మాయిగా సినిమా మొత్తం ఒకే ర‌క‌మైన ఎమోష‌న్‌తో అద‌ర‌గొట్టింది.

మ్యూజిక్ బ‌లం…

దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ ఈ సినిమాకు బ‌లంగా నిలిచింది. త‌న పాట‌లు, బీజీఎమ్‌తో దేవిశ్రీప్ర‌సాద్‌ మ్యాజిక్ చేశాడు. బుజ్జిత‌ల్లి, శివోహం పాట‌లు బాగున్నాయి. విజువ‌ల్‌గా తండేల్‌ ఆక‌ట్టుకుంటుంది..

విందు భోజ‌నం…

తండేల్ నాగ‌చైత‌న్య ఫ్యాన్స్‌కు విందు భోజ‌నంలా ఉంటుంది. పోటీగా పెద్ద సినిమాలు లేక‌పోవ‌డం తండేల్‌కు ప్ల‌స్ అయ్యేలా కనిపిస్తోంది.

రేటింగ్‌:3/5

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024