![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Maryade_Prashne_1738914875573_1738914881774.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Maryade_Prashne_1738914875573_1738914881774.jpg)
OTT Revenge Action: ఓటీటీలోకి వచ్చిన కన్నడ రివేంజ్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Revenge Drama Movie: మర్యాదే ప్రశ్నే సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన సుమారు 70 రోజుల తర్వాత స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
రాకేశ్ అడిగ ప్రధాన పాత్ర పోషించిన మర్యాదే ప్రశ్నే చిత్రం గతేడాది నవంబర్‌లో థియేటర్లలో రిలీజైంది. ఈ రివేంజ్ యాక్షన్ డ్రామా మూవీలో సునీల్ రోహ్, పూర్ణచంద్ర మైసూర్ కూడా లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి నాగరాజ్ సోమయాజి దర్శకత్వం వహించారు. మర్యాదే ప్రశ్నే మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా.. పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేదు. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
స్ట్రీమింగ్ వివరాలివే..
మర్యాదే ప్రశ్నే చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. కన్నడ ఆడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
70 రోజుల తర్వాత..
మర్యాదే ప్రశ్నే చిత్రం గతేజాది 2024 నవంబర్ 22న థియేటర్లలో రిలీజైంది. అయితే, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమైంది. ఎట్టకేలకు సుమారు 70 రోజుల తర్వాత ఈ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
మర్యాదే ప్రశ్నే సినిమాను మిడిల్ క్లాస్ జనాలకు కనెక్ట్ అయ్యేలా రివేంజ్ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగరాజ్ సోమయాజి. ఈ మూవీలో రాకేశ్ అడిగ, సునీల్, పూర్ణచంద్రతో పాటు తేజు బెలవాది, ప్రభు మంద్కుర్, రేఖా కుడ్లిగి, షైన్ శెట్టి, మహేశ్ నెంజుదయ్య, శ్రవణ్ కుమార్ కీలకపాత్రలు పోషించారు.
మర్యాదే ప్రశ్నే చిత్రాన్ని శ్వేత ప్రసాద్, విద్యా గాంధీ రాజన్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి అర్జున్ రాము సంగీతం అందించారు. సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి సంకేత్ శివప్ప ఎడిటింగ్ చేశారు.
మర్యాదే ప్రశ్నే స్టోరీలైన్
మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువకులు సూరి (రాకేశ్ అడిగ), సతీశ్ (సునీల్), మంజేశ్ (పూర్ణ చంద్ర) వేర్వేరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటాయి. ఈ క్రమంలో ఓ బర్త్ డే పార్టీ రాత్రి జరిగే ఘటన వారి జీవితాలను మార్చేస్తుంది. ధనవంతుడైన రాకీ (ప్రభు ముంద్‍కుర్) కారు ఢీ కొని సతీష చనిపోతాడు. సతీష మృతికి రాకీపై పగ తీర్చుకోవాలని సూరి, మంజేశ్ డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ప్రతీకారం ఎలా తీర్చుకున్నారనే విషయాల చుట్టూ మర్యాదే ప్రశ్నే మూవీ సాగుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం నేడే (ఫిబ్రవరి 7) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. జనవరి 10న థియేటర్లలో రిలీజైన ఈ భారీ బడ్జెట్ చిత్రం నెలలోగానే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ పొలిటికల్ యాక్షన్ మూవీకి శంకర్ దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం