Best Web Hosting Provider In India 2024
Thandel OTT: తండేల్, పట్టుదల.. రెండు చిత్రాలు ఒకే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే.. ఐదు భాషల్లో!
తండేల్ చిత్రం మంచి అంచనాలతో నేడు (ఫిబ్రవరి 7) థియేటర్లలోకి అడుగుపెట్టింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విదాముయర్చి గురువారం (ఫిబ్రవరి 6) థియేటర్లలో రిలీజైంది. తెలుగులో పట్టుదల పేరుతో ఈ చిత్రం వచ్చింది. ఈ రెండు సినిమాలకు రిలీజ్‍కు ముందే ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఇవే..
తండేల్ ఓటీటీ డీల్
తండేల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. మంచి బజ్ ఉన్న ఈ చిత్రం కోసం రిలీజ్‍కు ముందు ఓటీటీ డీల్ జరిగింది. రూ.90కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. అందులో 50 శాతానికిపైగా మొత్తంతోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ఈ చిత్రం హక్కులను దక్కించుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. ఇలా తండేల్ మూవీకి భారీ స్ట్రీమింగ్ డీల్ జరిగింది.
థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీని తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకొస్తామని నెట్‍ఫ్లిక్స్ ఇప్పటికే వెల్లడించింది. మార్చిలో ఈ మూవీ ఓటీటీలోకి రావొచ్చు. కాగా, ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జీ తెలుగు టీవీ ఛానెల్ సొంతం చేసుకుంది.
తండేల్ చిత్రంలో శ్రీకాకుళం మత్స్యకారుడు రాజుగా నాగచైతన్య, బుజ్జితల్లిగా సాయిపల్లవి నటించారు. నిజజీవిత ఘటనలతో ఈ మూవీని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించారు. లవ్ స్టోరీ, దేశభక్తి కలిసి ఉన్న కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు ప్రొడ్యూజ్ చేసిన ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్నారు.
తండేల్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవి పర్ఫార్మెన్స్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, లవ్ స్టోరీ ఈ చిత్రానికి ప్లస్‍గా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
విదాముయర్చి (పట్టుదల)
తమిళ సీనియర్ హీరో అజిత్, స్టార్ హీరోయిన్ త్రిష కలిసి నటించిన విదాముయర్చి చిత్రం భారీ అంచనాలతో ఫిబ్రవరి 6న విడుదలైంది. తెలుగులో పట్టుదల పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి మేయిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు.
విదాముయర్చి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామే సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్‍కు వస్తుందని గతంలోనే అప్‍డేట్ ఇచ్చింది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మొత్తంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తుందని పేర్కొంది. ఈ చిత్రానికి కూడా భారీ మొత్తంతోనే ఓటీటీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది.
విదాముయర్చి చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. తమిళంలో కలెక్షన్లు బాగానే ఉన్నా.. తెలుగులో సరిగా పర్ఫార్మ్ చేయలేకపోతోంది. ఈ మూవీలో అర్జున్ సర్జా విలన్ పాత్ర పోషించారు. రెజీనా కసాండ్రా, అరవ్, నిఖిల్ నాయర్ కీలకపాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్ నిర్మించిన ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం