The Greatest Rivalry Review: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లాగే థ్రిల్లింగ్ వాచ్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ డోన్ట్ మిస్

Best Web Hosting Provider In India 2024

The Greatest Rivalry Review: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లాగే థ్రిల్లింగ్ వాచ్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ డోన్ట్ మిస్

Hari Prasad S HT Telugu
Feb 07, 2025 03:02 PM IST

The Greatest Rivalry: India vs Pakistan Review: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లో ఉండే థ్రిల్ మరోసారి కావాలంటే నెట్‌ఫ్లిక్స్ లోకి తాజాగా వచ్చిన ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ డాక్యుమెంటరీ చూడాల్సిందే. మూడు ఎపిసోడ్ల ఈ డాక్యుమెంటరీ శుక్రవారం (ఫిబ్రవరి 7) ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లాగే థ్రిల్లింగ్ వాచ్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ డోన్ట్ మిస్
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లాగే థ్రిల్లింగ్ వాచ్.. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ డోన్ట్ మిస్

The Greatest Rivalry: India vs Pakistan Review: ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. క్రికెట్ ఫీల్డ్ లో ఈ పదం తరచూ వినే ఉంటారు. ఇదే టైటిల్ తో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి ఓ డాక్యుమెంటరీ వచ్చింది. ఈ దాయాదుల మధ్య క్రికెట్ ఫీల్డ్ లో జరిగే యుద్ధాన్ని అభిమానులే కాదు క్రికెటర్లు కూడా ఎలా ఓ నిజమైన యుద్ధంలాగే చూస్తారో ఈ డాక్యుమెంటరీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేకర్స్ చేశారు.

yearly horoscope entry point

డాక్యుమెంటరీ: ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్

ఓటీటీ ప్లాట్‌ఫామ్: నెట్‌ఫ్లిక్స్

రిలీజ్ డేట్: ఫిబ్రవరి 7, 2025

డైరెక్టర్: స్టివార్ట్ సగ్, చంద్రదేవ్ భగత్

ఎపిసోడ్లు: 3 (ఒక్కోటి సుమారు 36 నిమిషాలు)

భాషలు: హిందీ, తెలుగు, ఇంగ్లిష్, తమిళం

ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ ఎలా ఉందంటే?

ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎందుకంత పాపులర్? క్రికెట్ లో యాషెస్ ను మించిన క్రేజ్ ఎందుకు? రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వం, రాజకీయాలు దానికి కారణం కావచ్చు. కానీ ఇండోపాక్ క్రికెట్ వార్ గ్రేటెస్ట్ రైవల్రీ ఎందుకు అయిందన్న మూలాల్లోకి ఈ డాక్యుమెంటరీ వెళ్లలేదు.

అయితే క్రికెట్ అభిమానులకు కావాల్సిన మసాలాను జోడించడానికి అక్తర్, సెహ్వాగ్, గంగూలీలాంటి వాళ్లను రంగంలోకి దించారు. క్రికెట్ ఫీల్డ్ లో ఎప్పుడు ఇండోపాక్ మ్యాచ్ జరిగినా అది పాకిస్థాన్ పేస్ బౌలింగ్ వర్సెస్ ఇండియా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అన్నట్లే సాగుతుంది. ఈ డాక్యుమెంటరీని కూడా బహుషా అలాగే రూపొందించారేమో అనిపిస్తుంది.

అటు అక్తర్.. ఇటు సెహ్వాగ్, గంగూలీ.. క్రికెట్ ఫీల్డ్ లో వీళ్ల మధ్య ఎలాంటి వార్ జరిగిందో మనకు తెలుసు. ఇప్పుడీ డాక్యుమెంటరీలోనూ వీళ్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే ఈ డాక్యుమెంటరీ చాలా వరకు 2004లో పాకిస్థాన్ లో టీమిండియా టూర్ చుట్టూ తిరిగింది.

ఫ్రెండ్షిప్ సిరీస్ పేరుతో రెండు దేశాల మధ్య సయోధ్య కోసం ప్రభుత్వాలు కూడా ఈ క్రికెట్ టూర్ ను వాడుకున్నాయి. “పేరుకే ఫ్రెండ్షిప్ టూర్ అయినా షోయబ్ అక్తర్ లాంటి బౌలర్ గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేస్తుంటే ఇక ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంటుంది” అనే గంగూలీ డైలాగ్ ఈ డాక్యుమెంటరీకి హైలైట్ అని చెప్పొచ్చు.

అంతా ఆ టూర్ చుట్టూనే..

మూడు ఎపిసోడ్ల ఈ డాక్యుమెంటరీలో 2004 సిరీస్ కు ఇచ్చినంత ప్రాధాన్యత మిగిలిన వాటికి ఇవ్వలేదనిపించింది 2008లో తొలిసారి ఇండియా, పాకిస్థాన్ క్రికెటర్లు కలిసి ఐపీఎల్లో ఆడటం, తర్వాత ముంబై దాడుల కారణంగా రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంలాంటి అంశాలను లోతుగా చూపించలేదు. అయితే ఈ డాక్యుమెంటరీ క్రికెట్ అభిమానులను మరోసారి 20, 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిని, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే దాయాదుల తలపడుతున్న వేళ ఈ డాక్యుమెంటరీ ఒకప్పటి ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ యుద్ధాలు ఎలా ఉండేవో కళ్లకు కట్టిందని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా 1999 నుంచి 2008 మధ్య రెండు దేశాల మధ్య జరిగిన సిరీస్ లు తీవ్ర ఉత్కంఠను రేపిన జ్ఞాపకాలు ఈ డాక్యుమెంటరీ చూస్తే మరోసారి కళ్ల ముందు మెదులుతాయి.

వాళ్లు మిస్సయ్యారు

ఇరు దేశాల నుంచి సెహ్వాగ్, గంగూలీ, గవాస్కర్, అక్తర్, ఇంజమాముల్ హక్, రమీజ్ రాజాలాంటి ప్లేయర్స్ ఇండోపాక్ క్రికెట్ వార్ పై తమ అభిప్రాయాలను ఇందులో షేర్ చేసుకున్నారు. అయితే సచిన్, ద్రవిడ్ లాంటి లెజెండరీ ప్లేయర్స్ ను మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

మొత్తానికి సుమారు రెండు గంటల పాటు ఉన్న ఈ డాక్యుమెంటరీ.. ఇండోపాక్ క్రికెట్ వార్ లోని మజాను అందించడంలో ఎంతోకొంత సక్సెస్ అయిందనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్ లో శుక్రవారం (ఫిబ్రవరి 7) నుంచే స్ట్రీమింగ్ కు వచ్చిన ది గ్రేటెస్ట్ రైవల్రీని క్రికెట్ అభిమానులు అస్సలు మిస్ కావద్దు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024