Bottle Gourd Momos: పిల్లలు మోమోస్ కావాలని మారం చేస్తున్నారా? సొరకాయతో ఆరోగ్యకరమైన మోమోస్ చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు!

Best Web Hosting Provider In India 2024

Bottle Gourd Momos: పిల్లలు మోమోస్ కావాలని మారం చేస్తున్నారా? సొరకాయతో ఆరోగ్యకరమైన మోమోస్ చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు!

Ramya Sri Marka HT Telugu
Feb 07, 2025 03:30 PM IST

ఆరోగ్యకరమైన మొమోస్ రెసిపీ: సొరకాయ తినడానికి పిల్లలు మొహం మురిపించడం ఆపేస్తారు. ఈ రుచికరమైన ఆరోగ్యకరమైన సొరకాయ మొమోస్‌ను తయారు చేయండి, చాలా సులభమైన రెసిపీని గమనించండి.

సొరకాయతో  ఆరోగ్యకరమైన మోమోస్ చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు!
సొరకాయతో ఆరోగ్యకరమైన మోమోస్ చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు! (shutterstock)

సొరకాయ పేరు వింటనే చాలా మంది పిల్లలు, పెద్దలు ముఖం విరిచేస్తారు. మీ ఇంట్లో కూడా అలాంటి వారే ఉంటే ఈ రెసిపీ మీకు చాలా బాగా సహాయపడుతుంది. ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేసే సొరకాయను మీ పిల్లలకు, కుటుంబ సభ్యులకు తినిపించడానికి ఇక్కడ మీకొక మార్గం దొరుకుతుంది. సాధారణంగా పిల్లలకు, పెద్దలకు మోమోస్ అంటే చాలా ఇష్టముంటుంది. కనుక సొరకాయతో కూరలు, పచ్చళ్లు తినని వారికి రుచికరమైన మోమోస్ తయారు చేసి పెట్టండి. ఇలా చేయడం వల్ల వారు ఇష్టంగా తినడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. బయట చిరుతుళ్లు తినడం కూడా తగ్గిస్తారు. సొరకాయ మొమోస్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి..

yearly horoscope entry point

సొరకాయ మోమోస్ తయారీకి కావలసిన పదార్థాలు:

  • ఒక చిన్న సొరకాయ
  • ఒక ఉల్లిపాయ
  • ఎనిమిది నుండి పది రెబ్బలు వెల్లుల్లి
  • ఒక అంగుళం అల్లం ముక్క
  • రెండు పచ్చిమిర్చి
  • సోయా సాస్ ఒక టీస్పూన్
  • రెడ్ చిల్లీ సాస్ ఒక టీస్పూన్
  • వెనిగర్ ఒక టీస్పూన్
  • ఉప్పు రుచికి సరిపడా
  • చిల్లీ ఫ్లేక్స్
  • అర కప్పు మైదా
  • అర కప్పు గోధుమ పిండి

సొరకాయ మోమోస్ తయారీ విధానం

  1. సొరకాయతో మోమోస్ తయారు చేయడం కోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో మైదా పిండి, గోధుమ పిండిని వేసి కలపండి.
  2. తరువాత దాంట్లో కాస్త ఉప్పు వేడి నీరు వేసి చపాతీల పిండిలాగా చక్కగా పిసికి పక్కక్కు పెట్టుకోండి.
  3. ఇప్పుడు ఈ పిండిని గాలిచొరబడని గిన్నెలో లేదా కవర్ లో వేసి మూత పెట్టండి.
  4. ఇప్పుడు సొరకాయను తీసుకుని దాని తొక్క తీసి సన్నగా తురుముకుని పక్కకు పెట్టుకోండి.
  5. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, మిర్చిని వేసి మెత్తటి పేస్టులా తయారు చేయండి.
  6. తరువాత ఒక ఫ్రైయింగ్ పాన్‌ తీసుకుని దాంట్లో నూనె పోయండి.
  7. నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో వెల్లుల్లి-ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించండి. ఈ పేస్టంతా పచ్చి వాసన పోయేదాక వేయించిన తర్వాత దాంట్లోనే తురిమిన సొరకాయను వేయండి.
  8. కొంత సేపు వీటన్నింటినీ చిన్న మంట మీద వేయించండి. తర్వాత మూత పెట్టి ఉడికించండి.
  9. సొరకాయ ఉడికిన తర్వాత, మంటను పెంచి దాంట్లో కొంచెం నీటిని పోయండి. తర్వాత ఉప్పు, సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ వేసి కాసేపు ఉడికించి ఇదంతా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
  10. మొమోస్ కోసం రొట్టెలను తయారు చేసి దాంట్లో ఈ సొరకాయ మిశ్రమాన్ని పెట్టి మోమెస్‌ను తయారు చేయరు చేయండి.
  11. తరువాత ఒక పెద్ద గిన్నె లేదా ఇడ్లీ పాత్రను తీసుకుని దాంట్లో నీరు పోసి ఆవిరి మీద మోమోస్ ను పావు గంట పాటు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
  12. అంతే టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ మోమోస్ రెడీ అయినట్టే. వీటిని మీకు నచ్చిన సాస్ లేదా చట్నీతో తిన్నారంటే అదిరిపోతుంది.
Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024