Male Fertility : స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేసే 5 ఆహారాలు.. అతిగా మాత్రం తినకండి!

Best Web Hosting Provider In India 2024

Male Fertility : స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేసే 5 ఆహారాలు.. అతిగా మాత్రం తినకండి!

Anand Sai HT Telugu
Feb 07, 2025 04:30 PM IST

Male Fertility : ఈ మధ్యకాలంలో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి సంతానోత్పత్తి విషయం. సరైన ఆహారాలు తినకపోవడంతో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. దీనితో పిల్లలు కాకపోవడం లేదా ఆలస్యం అవ్వడంలాంటి సమస్యలను చూస్తున్నారు. ఎలాంటి ఆహారాలు అతిగా తింటే ఈ సమస్యలు వస్తాయో చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత మారుతున్న జీవనశైలి మన ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఒత్తిడితో కూడిన పని, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ చూపరు. ఇప్పుడు ఆహారపు అలవాట్లలో భారీగా మార్పు వస్తోంది. ఈ పేలవమైన ఆహారపు అలవాట్ల ప్రభావం మొత్తం ఆరోగ్యం, ముఖ్యంగా సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. చిన్న వయసులోనే వీర్యకణాల సంఖ్య తగ్గుతున్నట్లుగా చాలా మంది చెబుతున్నారు. ఇది అనేక ఆరోగ్య సమస్యల వల్ల వచ్చినప్పటికీ, ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పురుషుడి స్పెర్మ్ కౌంట్ తగ్గితే.. అది బిడ్డను కనడంలో సమస్యలను తెస్తుంది.

yearly horoscope entry point

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి వివిధ కారణాలు ఉన్నాయి. వీటిలో ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాల వ్యసనం, ఊబకాయం, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. దీనితో పాటు ఆహారం కూడా పురుషుల స్పెర్మ్ కౌంట్ పై ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. పురుషుడి స్పెర్మ్ కౌంట్ తగ్గకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అతను తినే ఆహారాలపై శ్రద్ధ పెట్టాలి. ఏ ఆహారాలు స్పెర్మ్ కౌంట్‌ను ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం..

ప్రాసెస్ చేసిన మాంసాలు

ప్రాసెస్ చేసిన మాంసాలు రుచికరంగా ఉంటాయి. కానీ ఆ మాంసాన్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే రసాయనాలు స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. దాని చలనశీలతను ప్రభావితం చేస్తాయి. పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్‌ను నివారించడానికి ప్రాసెస్ చేసిన మాంసాలను ఎక్కువగా తినకుండా ఉండాలి.

సోయా ఉత్పత్తులు

సోయా ఉత్పత్తులలో కాల్షియం ఎక్కువగా ఉండవచ్చు. పురుషులు ఈ సోయా ఉత్పత్తులను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ సోయా ఉత్పత్తులలో మొక్కల ఆధారిత ఈస్ట్రోజెన్‌లు, ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి. అధికంగా తీసుకుంటే ఇది పురుషులలో వంధ్యత్వానికి కారణమయ్యే ఛాన్స్ ఉంది.

ట్రాన్స్ ఫ్యాట్స్

గుండె జబ్బులకు ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రధాన కారణం. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరగడమే కాకుండా, స్పెర్మ్ కౌంట్ తగ్గి, పురుషుల సంతానోత్పత్తి తగ్గుతుంది. అలాంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. బేక్‌డ్ గుడ్స్, చిప్స్, కాల్చిన, వేయించిన వీధి, రెస్టారెంట్ ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.

అధిక కొవ్వు పాలు

పాలు శరీరానికి ఆరోగ్యకరమైనవే. కానీ పూర్తి కొవ్వు పాలు హానికరం కావచ్చు. పశువులకు ఇచ్చే స్టెరాయిడ్లు శరీరానికి హానికరం, స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. మీరు ఈ రకమైన ఆహారాలను ఎక్కువగా తినకుండా చూసుకోవాలి.

పురుగుమందులు

కూరగాయలు, పండ్లపై పురుగుమందులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పురుగుమందులు వేసిన ఆహార ఉత్పత్తులను మనం సరిగ్గా కడగకుండా తీసుకుంటే అది పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నాన్‌స్టిక్ వంట సామాగ్రిలోని కొన్ని రసాయనాలు పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. నాన్‌స్టిక్ వంట సామాగ్రిలో ఎక్కువగా వండటం మానుకోవాలి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024