Best Web Hosting Provider In India 2024
Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ పొరపాట్లు పిల్లలను సోమరిపోతుల్లా తయారు చేస్తాయి!
Parenting Tips: తల్లిదండ్రులు అనుకోకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు పిల్లల భవిష్యత్తును పాడు చేస్తాయి. వారిని సోమరిపోతుల్లా మారుస్తాయి. మీ పిల్లలు సోమరిపోతుల్లా మారకుండా ఉండాలంటే మీరు చేయకూడని ఆ తప్పులేంటో తెలుసుకోండి.
పిల్లల వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలోనూ, దెబ్బతీయడంలోనూ వారి స్నేహితులతో పాటు వారి తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ఉంటుంది. పిల్లల్లో మంచి విలువలు, నీతిబోధన చేసేది తల్లిదండ్రులే. కొన్ని విషయాల్లో అమ్మానాన్నల నిర్లక్ష్యం లేదా అజ్ఞానం వల్ల పిల్లల వ్యక్తిత్వం పూర్తిగా బలహీనపడుతుంది, వారిని సోమరిపోతుల్లా మార్చేస్తుంది. ఫలితంగా వారు జీవితాంతా పనిదొంగల్లానే వ్యవహరిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పిల్లలను సోమరితపోతుల్లా మార్చేస్తాయట. అవేంటో తెలుసుకుని మీ పిల్లల విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పిల్లలు ఎంత చురుగ్గా ఉంటే వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుంది.
పిల్లలను సోమరిపోతుల్లా మార్చేసే తల్లిదండ్రుల చెడు అలవాట్లు ఏంటి?
పిల్లల పనిని వారు చేయడం:
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా, రక్షణాత్మకంగా ఉంటారు. పాఠశాల పనుల నుండి ఆటల వరకు ప్రతి చిన్నపనిని వారే చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. పిల్లల విషయంలో జాగ్రత్త, రక్షణ మంచివే కానీ అవి మితిమీరితేనే ప్రమాదం. ఇలా ప్రతి పనినీ తల్లిదండ్రులే చేయడం వల్ల పిల్లలకు తమ పనిని తాము చేసుకునే అవకాశం దొరకదు, కొత్త విషయాలను నేర్చుకోలేరు.
దీర్ఘకాలికంగా ఇది సోమరితనంగా తయారవుతుంది. పనుల చేయడం అలవాటు లేక చేసే ఓపిక రాక, వాటి నుంచి తప్పించుకునేలా చేస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు వారి పనిని వారు చేసుకోవడం అలవాటు చేయాలి. అవసరమైతే మాత్రమే సహాయం చేయాలి. పని చేయడంలో వారిని ప్రోత్సహించాలి. కానీ వారి పనిని తాము చేయకూడదు.
కష్టాలను ఎదుర్కోనివ్వకపోవడం
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల చిన్న చిన్న సమస్యలను కూడా తామే పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది, కష్టం రాకూడదు అంటూ గారాబంగా చూసుకుంటూ కష్టాలను ఎదుర్కోనివ్వరు. ఇలా చేయడం వల్ల పిల్లల వ్యక్తిత్వం దెబ్బతింటుంది. జీవితంలో ఏదైనా అనుకోన కష్టం వస్తే ఎదుర్కొనే ధైర్యం, ఆత్మవిశాసం వారిలో ఉండవు.
ఇలాంటి తల్లిదండ్రుల దగ్గర పెరిగిన పిల్లలు పెద్దయ్యాక కూడా జీవితానికి సంబంధించిన ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోలేరు, తల్లిదండ్రులపైనే పూర్తిగా ఆధారపడతారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు కొన్నిసార్లు పోరాడే అవకాశం ఇవ్వాలి. దీనివల్ల వారు సమస్యలను స్వయంగా పరిష్కరించుకోగలుగుతారు, వాటి నుంచి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఆత్మనిర్భరతను పెంచుకుంటారు.
తల్లిదండ్రుల చెడు అలవాట్లు
చాలా మంది తల్లిదండ్రులు తమ సమయాన్ని ఎక్కువగా టీవీ, ఫోన్‌లో రీల్స్ చూడడంలో గడుపుతారు, దీన్ని చూసి పిల్లలు చెడిపోతారు. వారు కూడా చదువుకు బదులు వాటికే బానిసలు అవుతారు. అడిగితే నువ్వు చూడచ్చు గానీ నేను చూడకూడదా అని ఎదురుతిరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. తల్లిదండ్రులకున్న ఈ అలవాట్ల కారణంగా సమయం వృథా అవడమే కాక, పిల్లల కళ్లకు, మెదడుకు హాని జరుగుతుంది.
అందుకే అమ్మానాన్మలుగా మీరు మీ పిల్లల కోసం వారు ఉన్నప్పుడు టీవీ, ఫోన్ లకు వీలైనంత దూరంగా ఉండాలి. మీకున్న ఖాళీ సమయాన్ని పిల్లలతో ఆడుకోవడానికి, వారి సమస్యలను వినడానికి, లేదంటే వారితో కలిసి ఏదైనా పుస్తకం చదవడానికి కేటాయించడం చాలా మంచిది. ఇది మీకు, పిల్లల భవిష్యత్తు చాలా బాగా సహాయపడుతుంది.
సంబంధిత కథనం