Best Web Hosting Provider In India 2024
Nagarjuna Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన నాగార్జున, నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల.. గిఫ్ట్‌గా ఏఎన్ఆర్ బుక్
Nagarjuna Meets PM Modi: నాగ చైతన్య తండేల్ మూవీ రిలీజ్ రోజే ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు నాగార్జున కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ప్రధానికి ఏఎన్నార్ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం విశేషం.
Nagarjuna Meets PM Modi: అక్కినేని నాగార్జున తన కుటుంబంతో కలిసి శుక్రవారం (ఫిబ్రవరి 7) ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఓవైపు నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ ఇదే రోజు రిలీజ్ కాగా.. అతడు మాత్రం ఢిల్లీలో బిజీగా గడిపాడు. నాగార్జునతోపాటు భార్య అమల, నాగ చైతన్య, అతని భార్య శోభితా ధూళిపాళ్ల ఉన్నారు. మోదీని నాగార్జున ఫ్యామిలీ కలిసి ఫొటోను ఎంపీ బైరెడ్డి శబరి ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీతో నాగార్జున ఫ్యామిలీ
నాగార్జున కుటుంబం ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఎంపీ బైరెడ్డి శబరి వాళ్లతో కలిసి దిగిన ఫొటోను ఎక్స్ లో షేర్ చేశారు. పార్లమెంట్ ఆవరణలోని టీడీపీ ఆఫీసులో నాగార్జున కుటుంబాన్ని కలిసినట్లు ఆమె ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ప్రధాని మోదీని నాగార్జున కుటుంబం కలవడం వెనుక కారణమేంటన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.
అయితే మోదీని కలిసి ఆయనకు అక్కినేని నాగేశ్వర రావు పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. మోదీతో నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత ఉన్నారు. చైతన్య, నాగార్జున బ్లాక్ సూట్లలో కనిపించగా.. శోభిత క్రీమ్, గోల్డ్ చీరలో, అమలు పింక్ శారీలో కనిపించారు.
నాగ చైతన్య తండేల్ మూవీ
నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ శుక్రవారమే (ఫిబ్రవరి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన తండేల్ మూవీలో నాగ చైతన్య, సాయి పల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఈ ఇద్దరూ పోటీ పడి నటించినట్లు అభిమానులు అభిప్రాయపడ్డారు. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందని, దేశభక్తి కంటే వీళ్ల లవ్ స్టోరీయే సినిమాలో హైలైట్ గా నిలిచినట్లు అభిమానుల ఎక్స్ రివ్యూలలో చెప్పారు.
అటు నాగార్జున గతేడాది సంక్రాంతికి నా సామిరంగా మూవీలో నటించాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల మూవీ కుబేర, రజనీకాంత్ కూలీ సినిమాల్లో అతడు నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జున తన కుటుంబంతో కలిసి వెళ్లి ప్రధాని మోదీని కలవడం విశేషం.
సంబంధిత కథనం