Best Web Hosting Provider In India 2024
TG New Ration Cards : రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్ – ఇకపై మీసేవాలో కూడా అప్లయ్ చేసుకోవచ్చు, తాజా ప్రకటన ఇదే
తెలంగాణ రేషన్ కార్డు దరఖాస్తులపై కీలక అప్డేట్ వచ్చేసింది. నూతన రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పాత రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పులకు కూడా అవకాశం కల్పించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ వివరాలను పేర్కొంది.
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తుకు కూడా వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త కార్డుల కోసం ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరోవైపు పాత రేషన్ కార్డుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పులకు అవకాశం కల్పించింది. ఫలితంగా పేరు మార్పులే కాకుండా కొత్త సభ్యులను కూడా చేర్చుకునే వీలు ఉంటుంది.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో కొత్త కార్డులను జారీ చేశారు. అయితే మిగతా చోట్ల వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా… ఇటీవలే గ్రామాల వారీగా ప్రాథమిక జాబితాలను ప్రకటించారు. వీటి కూడా అప్రూవల్ ఇచ్చి కార్డులను జారీ చేయనున్నారు.
నూతన రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం ప్రజాపాలన – గ్రామసభల ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో భారీగా దరఖాస్తులు వచ్చాయి. కేవలం కొత్త కార్డుల కోసమే కాకుండా… కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుకునేందుకు చాలా మంది ఇచ్చినవారిలో ఉన్నారు. అయితే కేవలం ఆఫ్ లైన్ లోనే దరఖాస్తుల స్వీకరణ ఉండటంతో… ప్రజలకు ఇబ్బందిగా మారింది. గ్రామసభలు లేదా ప్రజాపాలన ప్రత్యేక కేంద్రాల్లో ఇచ్చేందుకు ప్రత్యేకంగా వెళ్లాల్సి వస్తోంది. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా… మీసేవా ద్వారా దరఖాస్తులను స్వీకరించేలా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇకపై కొత్త దరఖాస్తులు లేదా మార్పులు చేర్పుల కోసం మీసేవా కేంద్రాలను సంప్రదింవచ్చు.
టాపిక్