Best Web Hosting Provider In India 2024
YS Sharmila : ‘విజయసాయిరెడ్డి చెబుతుంటే చాలా బాధ వేసింది… జగన్ క్యారెక్టర్ సున్నా’ – వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ క్రెడిబులిటి సున్నా అంటూ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందంటూ విమర్శలు గుప్పించారు. విజయసాయి రెడ్డి మాట్లాడాల్సిన అంశాలపై స్వయంగా జగన్ నోట్ ఇచ్చారని చెప్పారు. సాయిరెడ్డి చెప్పిన విషయాలు విని చాలా బాధ వేసిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ క్రెడిబులిటి ఖాలీ బాటిల్ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ క్రెడిబులిటి సున్నా అని… సొంత మేనల్లుడు,మేన కోడలు ఆస్తులు కాజేయ్యలని కుట్రలు చేశాడని ఆరోపించారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు ఉందని దుయ్యబట్టారు.
సాయిరెడ్డితో బలవంతంగా చెప్పించారు…
“ విజయసాయిరెడ్డి తో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. జగన్ దగ్గర పడ్డ ఇబ్బందులు చాలా చెప్పారు. నా బిడ్డలకు సంబంధించిన ఒక విషయం చెప్తున్నాను. జగన్ గారు సొంత తల్లి మీద కేసు పెట్టించారు. ఆ కుట్రను నేను బయట పెట్టా. నేను నిజాలు చెప్పాను అని జగన్ నా మీద అబద్ధాలు చెప్పాలని సాయి రెడ్డికి చెప్పాడు. సాయి రెడ్డి చెప్పను అంటే బలవంతంగా ఒప్పించారు. స్వయంగా సాయి రెడ్డికి జగన్ కాల్ చేశాడు. ప్రెస్ మీట్ పెట్టమని ఒత్తిడి చేశారు. కుదరదు అని సాయి రెడ్డి చెప్తే జగన్ ఒప్పుకోలేదు” అని షర్మిల సంచలన విషయాలు చెప్పారు.
ఇంతలా దిగజారా …? వైఎస్ షర్మిల
వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉంది అని సాయి రెడ్డి చెప్పాడని షర్మిల గుర్తు చేశారు. “నన్ను వదిలేయమని సాయి రెడ్డి వేడుకొంటే సుబ్బారెడ్డి తో మాట్లాడించారు. సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ సాయి రెడ్డి మీద ఒత్తిడి తెచ్చారు. నాకు ఇష్టంలేదు అని సాయి రెడ్డి వేడుకున్నా వదిలి పెట్టలేదు. ఈ విషయం స్వయంగా సాయిరెడ్డి చెప్పారు. సాయి రెడ్డి మాట్లాడాల్సిన అంశాలు అన్ని స్వయంగా జగన్ నోట్ ఇచ్చారు. 40 నిమిషాల పాటు జగన్ చెప్తుంటే నోట్ చేసుకున్నాడు. జగన్ నైజం ఇదే అని సాయి రెడ్డి అర్థం చేసుకున్నారు. సాయి రెడ్డి చెప్తుంటే చాలా బాధ వేసింది. జగన్ ఇంతలా దిగజారాలా..? అని షర్మిల ప్రశ్నించారు.
టాపిక్