Kolkata rape case : అమ్మ తిట్టిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక- రేప్​, చేసి చంపేసి..

Best Web Hosting Provider In India 2024


Kolkata rape case : అమ్మ తిట్టిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక- రేప్​, చేసి చంపేసి..

Sharath Chitturi HT Telugu
Feb 08, 2025 07:20 AM IST

Kolkata rape case : తల్లి తిట్టిందని ఓ బాలిక రాత్రిపూట ఇంటి నుంచి వెళ్లిపోయింది! మరుసటి రోజు ఆమె మృతదేహం కనిపించింది! బాలికను రేప్​ చేసి చంపేశారని పోలీసులు చెబుతున్నారు.

13ఏళ్ల బాలిక రేప్​, హత్య..
13ఏళ్ల బాలిక రేప్​, హత్య..

పశ్చిమ్​ బెంగాల్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! తల్లి తిట్టిందని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలిక హత్యకు గురైంది. ఆమెను రేప్​ చేసి చంపేశారని పోలీసులు చెబుతున్నారు.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

కోల్​కతా న్యూ టౌన్​లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. తల్లి తిట్టడంతో 8వ తరగతి చదువుకుంటున్న బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాగా శుక్రవారం ఉదయం బాలిక ఇంటికి 6 కిలోమీటర్ల దూరంలో ఆమె మృతదేహం కనిపించింది.

“ఒక బాలిక అర్ధనగ్న మృతదేహం ఈ ఉదయం ఒక ఒంటరి ప్రదేశంలో లభించింది. మేము హత్య కేసు నమోదు చేసి, పోక్సో చట్టం సెక్షన్లను కూడా చేర్చాము. దర్యాప్తు జరుగుతోంది. ఇప్పటివరకు ఎవరూ అరెస్ట్ కాలేదు,” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

పోలీసుల ప్రకారం, ఆ బాలిక గురువారం రాత్రి 10 గంటల ప్రాంతంలో తల్లి తిట్టడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు, పొరుగువారు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. బాలిక.. చివరిసారిగా ఆమె నివాసానికి 4 కిలోమీటర్ల దూరంలో ఒంటరిగా కనిపించింది. చివరకు, కుటుంబం న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ దాఖలు చేసింది.

శుక్రవారం ఉదయం 9:50 గంటల ప్రాంతంలో ఒక ఒంటరి ప్రదేశంలో బాలిక మృతదేహాన్ని కొంతమంది స్థానికులు గుర్తించారు.

ఆమె శరీరంపై మొత్తం గీతలు ఉన్నాయని ఆమె తల్లి మీడియాకు తెలిపింది.

“నేను ఆమెపై కోపంగా ఉండి తిట్టాను. ఆ తర్వాత ఆమె వెళ్లిపోయింది. ఆమె ఏ ఆభరణాలు ధరించలేదు,” అని బాలిక తల్లి ఆసుపత్రిలో మీడియాకు తెలిపింది.

ఆ బాలిక తన తల్లి, చెల్లెలితో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి నావికాదళంలో ఉద్యోగం చేస్తూ ముంబైలో ఉంటున్నాడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ నేరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

గర్భిణి అని కూడా చూడకుండా..!

దేశంలో బాలికలు, మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచార యత్నాన్ని అడ్డుకుంటోందన్న కోపంతో ఓ గర్భిణీని కదులుతున్న రైలులో నుంచి ఓ వ్యక్తి బయటకు తోసేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్​ప్రెస్​లో తమిళనాడులోని తిరుప్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరుకు గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఆ మహిళ ఒంటరిగా వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

బాధితురాలు ఉదయం 6.40 గంటల సమయంలో అన్​రిజర్వ్​డ్ టికెట్​తో రైలు ఎక్కి లేడీస్ కోచ్​లో కూర్చుంది. ఆ సమయంలో మరో ఏడుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఉదయం 10:15 గంటల సమయంలో రైలు జోలార్​పేట రైల్వ్​స్టేషన్​కు చేరుకునేసరికి బాధితురాలు ఒంటరిగా ఉంది. రైలు కదులుతున్న సమయంలో నిందితుడు హేమరాజ్ (27) లేడీస్ బోగీలో ఎక్కాడు. కొద్దిసేపు అక్కడే కూర్చొని మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అతను ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించి నిందితుడిని అడ్డుకుంది. కోపంతో ఊగిపోయిన అతను కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేశాడు. దీంతో మహిళ చేతులు, కాళ్లు, తలకు గాయాలయ్యాయి. అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం వేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link