![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Razakar_OTT_1738996426865_1738996444596.jpg)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Razakar_OTT_1738996426865_1738996444596.jpg)
OTT: 16 రోజులుగా ఓటీటీ టాప్ 1 మూవీగా తెలుగు హిస్టారికల్ థ్రిల్లర్ ట్రెండింగ్- 50 మిలియన్ మినిట్స్‌కుపైగా వ్యూయర్షిప్!
Razakar OTT Trending With 50 Million Minutes Plus Views: ఓటీటీలో తెలుగు హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రజాకార్ నెంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతూ సత్తా చాటుతోంది. యాంకర్ అనసూయ నటించిన రజాకార్ మూవీకి 50 మిలియన్ మినిట్స్‌కు పైగా వ్యూస్ వచ్చి అదరగొడుతోంది.
Razakar OTT Trending With 50 Million Minutes Plus Views: ఓటీటీలో ఇటీవల కాలంలో ఎన్నో తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఓటీటీ రిలీజ్ అయిన చాలా రోజులకు కూడా టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. హారర్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్‌తోపాటు హిస్టారికల్ మూవీస్ కూడా ఓటీటీ తెలుగు ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నాయి.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చి
అలా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చి ఇప్పటికీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోన్న సినిమా రజాకార్. యాంకర్ అనసూయ భరద్వాజ్, పాపులర్ యాక్టర్ బాబీ సింహ, గ్లామరస్ హీరోయిన్ వేదిక, అనిష్క త్రిపాఠి, సీనియర్ హీరోయిన్ ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్. ఈ చిత్రాన్ని సమర్వీర్ క్రియేషన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు.
1940 దశకంలో ఆకృత్యాలు
రజాకార్ సినిమాకు యాట సత్యనారాయణ దరకత్వం వహించారు. 1940 దశకంలో రజాకార్లు సాగించిన అకృత్యాలకు తెరరూపమిచ్చిందీ మూవీ. గతేడాది మార్చి 15న థియేటర్స్‌లో రిలీజై మంచి విజయాన్ని అందుకున్న రజాకార్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే, ప్రతి రివ్యూలోనూ సినిమా మేకింగ్ , సీన్స్ బాగున్నాయంటూ విశ్లేషకులు అప్రిషియేట్ చేశారు.
50 మిలియన్ మినిట్స్ ప్లస్ వ్యూయర్షిప్
ఇక థియేట్రికల్ రిలీజ్ అయిన పది నెలల తర్వాత రజాకార్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. జనవరి 24వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న రజాకార్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్టార్ హీరోలతో పోటీ పడుతూ ఈ సినిమా నెం.1 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే 50 మిలియన్ మినిట్స్ ప్లస్ వ్యూయర్షిప్ అందుకుని దూసుకెళుతోంది.
16 రోజులుగా ట్రెండింగ్
ఓటీటీలో రిలీజ్ అయి గత 16 రోజులుగా రజాకార్ ట్రెండ్ అవుతూ సత్తా చాటుతోంది. అయితే, రజాకార్ వ్యవస్థను నేపథ్యంగా ఎంచుకుని కథే హీరోగా దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు. ఆద్యంతం ఆకట్టుకునేలా రజాకార్ సినిమాను దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన తీరు సాధారణ ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల దాకా అందరి ప్రశంసలు అందుకుంటోంది.
హైలెట్‌గా బతుకమ్మ సీన్
సాంకేతిక నిపుణుల ప్రతిభతో పాటు బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ నటన ఈ సినిమాకు ఆకర్షణగా నిలుస్తోంది. అలాగే, బతుకమ్మ సీన్లో యాంకర్ అనసూయకు మంచి మార్కులు పడ్డాయి. రజాకార్ సినిమాలో అనసూయతో చేయించిన బతుకమ్మ సీన్ మరింత హైలెట్‌గా నిలిచింది. అప్పటి రజాకార్ ఆకృత్యాలకు అద్దం పట్టే విధంగా సినిమాలో ఎన్నో సన్నివేశాలు ఉన్నాయని విమర్శకులు ప్రశంసించారు.
ఆహా ఓటీటీ టాప్ 5 సినిమాలు
యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో ఆద్యంతం ఎంగేజింగ్‌గా రజాకార్ సినిమా ఉన్నందునే ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన 16 రోజుల నుంచి టాప్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమా తర్వాత ఆహా ఓటీటీలో టాప్ 2గా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 4 టాక్ షో, టాప్ 3లో నీలి మేఘ శ్యామ, టాప్ 4లో కథా కమామీషు, టాప్ 5లో జీబ్రా సినిమాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్