Chiranjeevi: చిరంజీవికి మరో గౌరవం.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

Best Web Hosting Provider In India 2024

Chiranjeevi: చిరంజీవికి మరో గౌరవం.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 08, 2025 12:03 PM IST

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న సదస్సుకు సంబంధించిన అడ్వయిజరీ బోర్డులో చిరూ భాగమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు.

Chiranjeevi: చిరంజీవికి మరో గౌరవం.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్
Chiranjeevi: చిరంజీవికి మరో గౌరవం.. ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి.. గతేడాది దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. డ్యాన్సులకు గాను గిన్నీస్ వరల్డ్ రికార్డును కూడా కైవసం చేసుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దిగ్గజ స్థాయికి చేరిన చిరంజీవికి విశేష గుర్తింపులు దక్కుతూనే ఉన్నాయి. తాజాగా ఆయనకు మరో గౌరవం కైవసం అయింది. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‍మెంట్ సమిట్ (WAVES) అడ్వయిజరీ బోర్డులో చిరంజీవికి చోటు దక్కింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమిట్ తొలిసారి ఈ ఏడాది ఇండియాలో జరగనుండగా.. చిరూకు ఈ బోర్డులో చోటిచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చిరంజీవి నేడు (ఫిబ్రవరి 8) ధన్యవాదాలు తెలిపారు.

yearly horoscope entry point

ఎందుకు ఈ సమిట్

వేవ్స్ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఎంటర్‌టైన్‍మెంట్, మీడియా రంగాల నుంచి ప్రమఖులు హాజరుకానున్నారు. ఈ రంగాల భవిష్యత్తుకు తీసుకోవాల్సిన చర్యలు, సవాళ్లు, ఇండియాలో కంటెంట్ డెవలప్‍మెంట్ సహా అనేక విషయాలపై చర్చలు జరుగుతాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేవ్స్ సమిట్ అడ్వయిజరీ కమిటీలో చిరూకు చోటు దక్కింది. ఇండియాను గ్లోబల్ కంటెంట్ హబ్‍గా తయారు చేసే క్రమంలో వేసే ఓ అడుగు వేవ్స్ సమిట్ అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

మోదీ చిరంజీవి థ్యాంక్స్

ఈ గౌరవం తనకు ఇచ్చిన ప్రధాన మంత్రి మోదీకి థ్యాంక్స్ అంటూ నేడు ట్వీట్ చేశారు చిరంజీవి. వేవ్స్ సమిట్ గురించి మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ వీడియోను పోస్ట్ చేశారు. “ఈ గౌరవం కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. వేవ్స్ అడ్వయిజరీ కమిటీలో భాగమవడం, ఇతర సభ్యులతో నా అభిప్రాయాలను పంచుకోవడం నాకు గర్వకారణంగా ఉంది. మోదీ మెదడులో నుంచి పుట్టిన వేవ్స్.. ఇండియా సాఫ్ట్ పవర్‌ను ప్రపంచంలో అత్యున్నత శిఖరాలకు తీసుకెళుతుందనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

సంక్రాంతి వేడుకల్లో మోదీ, చిరూ

గత నెల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ, చిరంజీవి హాజరయ్యారు. ఇద్దరూ కలిసి పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గతేడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనూ చిరంజీవితో ఆత్మీయంగా మాట్లాడారు మోదీ. చిరూ, పవన్ చేతులను ఎత్తి అభివాదం కూడా చేశారు.

చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర చిత్రం విడుదల కావాల్సింది. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించారు. షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా రిలీజ్ డేట్ కోసం సమాలోచనలు జరుగుతున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడితో తదుపరి ఓ మూవీ చేయనున్నారు చిరూ. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతోనూ ఓ చిత్రానికి గ్రీన్‍ సిగ్నల్ ఇప్పటికే ఇచ్చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024