Adventure Thriller OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన అప్స‌ర రాణి తెలుగు అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – ఎందులో చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

Adventure Thriller OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన అప్స‌ర రాణి తెలుగు అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – ఎందులో చూడాలంటే?

Nelki Naresh Kumar HT Telugu
Feb 08, 2025 03:08 PM IST

Thriller OTT: అప్ప‌ర రాణి హీరోయిన్‌గా న‌టించిన త‌ల‌కోన మూవీ శ‌నివారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి న‌గేష్ నార‌దాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది.

అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌ ఓటీటీ
అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌ ఓటీటీ

అప్స‌ర‌రాణి హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ త‌ల‌కోన స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా శ‌నివారం సెలైంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఫ్రీ స్ట్రీమింగ్ కాకుండా రెంట‌ల్ విధానంలో విడుద‌లైంది. 99 రూపాయ‌లు రెంట‌ల్ ఛార్జెస్‌గా ఫిక్స్ చేశారు. థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌ది నెల‌ల త‌ర్వాత త‌ల‌కోన ఓటీటీలోకి వ‌చ్చింది.

yearly horoscope entry point

యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌…

యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన త‌ల‌కోన‌ మూవీలో అప్స‌ర రాణితో పాటు అజ‌య్ ఘోష్‌, అశోక్ కుమార్ కీలక పాత్ర‌లు పోషించారు. న‌గేష్ నార‌దాసి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. గ‌త ఏడాది మార్చిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. అప్ప‌ర‌రాణి గ్లామ‌ర్‌, యాక్టింగ్ త‌ల‌కోన సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాయి. ఐఎమ్‌డీబీలో 8.7 రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకున్న‌ది.

త‌ల‌కోన క‌థ ఇదే…

త‌ల‌కోన మూవీలో సారా అనే మోడ‌ల్ క్యారెక్ట‌ర్‌లో అప్ప‌ర‌రాణి క‌నిపించింది. ఓ బ్యూటీ కంటెస్ట్‌లో సారా విజేత‌గా నిలుస్తుంది. ఆ స‌క్సెస్‌ను సెల‌బ్రేట్ చేసుకునేందుకు త‌ల‌కోన ఫారెస్ట్ మ‌ధ్య‌లో ఉన్న ఓ రిసార్ట్‌కు వెళుతుంది. ఆ పార్టీలో మినిస్ట‌ర్ త‌మ్ముడితో సారా గొడ‌వ ప‌డుతుంది.

సారాపై ప‌గ‌ను పెంచుకున్న మినిస్ట‌ర్ ఆమెను త‌ల‌కోన ఫారెస్ట్‌లోనే చంపాల‌ని చూస్తాడు. మినిస్ట‌ర్ మ‌నుషుల బారి నుంచి సారా ఎలా త‌ప్పించుకున్న‌ది? అడ‌విలోని సంజీవ‌కోన‌లో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా ర‌హ‌స్యంగా ఓ స్వామిజీ చేస్తోన్న ప్ర‌యోగాల‌కు సంబంధించిన గుట్టును సారా ఎలా బ‌య‌ట‌పెట్టింది అన్న‌దే త‌ల‌కోన మూవీ క‌థ‌.

గ్లామ‌ర్ ప్ల‌స్ యాక్ష‌న్‌..

ఈ సినిమాలో గ్లామ‌ర్‌, యాక్ష‌న్ క‌ల‌బోసిన క్యారెక్ట‌ర్‌లో అప్ప‌ర‌రాణి క‌నిపించింది. రిస్కీ ఫైట్ సీక్వెన్స్‌ల‌లో న‌టించింది. త‌ల‌కోన మూవీకి సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించాడు.

రాచ‌రికం…

అప్ప‌ర‌రాణి హీరోయిన్‌గా న‌టించిన రాచ‌రికం మూవీ ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ మూవీలో పొలిటీషియ‌న్‌గా ఛాలెంజింగ్ రోల్‌లో అప్ప‌ర‌రాణి క‌నిపించింది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ మూవీలో వ‌రుణ్ సందేశ్ విల‌న్‌గా న‌టించాడు.

ఆర్‌జీవీ డేంజ‌ర‌స్‌లో…

ఫోర్ లెట‌ర్స్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అప్ప‌ర‌రాణి. క్రాక్‌, సీటీమార్‌, హంట్ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసింది. రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డేంజ‌ర‌స్‌లో ఓ కీల‌క పాత్ర చేసింది. ఆర్‌జీవీ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన బాలీవుడ్ మూవీ ఢీ కంపెనీలో ఓ సాంగ్‌లో త‌ళుక్కున మెరిసింది.

అప్ప‌ర రాణి హీరోయిన్‌గా న‌టించిన త‌ల‌కోన మూవీ శ‌నివారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024