![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497842_358_newTwitterIcon.png)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497843_996_facebook1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1736497844_122_wapp1.webp.webp)
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
Best Web Hosting Provider In India 2024
Delhi Election Results : బీఆర్ఎస్ భస్మాసుర హస్తమే.. ఆప్ పరాజయానికి కారణం : కొండా సురేఖ
Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణలో రాజకీయ కాక రేపుతున్నాయి. కాంగ్రెస్‌పై కారు పార్టీ సెటైర్లు వేస్తే.. ఆప్ పరాజయానికి కారణం బీఆర్ఎస్ భస్మాసుర హస్తమే అని చేయి పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయానికి కారణం అని.. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత, కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్.. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీ ప్రజలకు దూరం చేసిందన్నారు. ఢిల్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. అహంకారపూరితమైనవి అని ఫైర్ అయ్యారు. ఈ అహంకారాన్ని అణచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారని విమర్శించారు. అధికార పక్షమైన, ప్రతిపక్షమైనా కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ పోరాట పంథానే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ప్రజా సంక్షేమమే అని వివరించారు.
![yearly horoscope entry point](https://www.netisamajam.com/wp-content/uploads/2025/01/1738027479_122_astro-entry-point-mobile.png)
బీఆర్ఎస్ భస్మాసుర హస్తం..
‘బీఆర్ఎస్ భస్మాసుర హస్తం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని నిండా ముంచింది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో కేజ్రీవాల్ లిక్కర్ వ్యాపారం ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలకు దూరం చేసింది. ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చతికిలపడింది. రాష్ట్రాన్ని అగాథంలోకి నెట్టిన బీఆర్ఎస్.. ఆ పార్టీ నాయకులు దేశంలోని మిగతా పార్టీలను భ్రష్టు పట్టిస్తున్నారు. బీజేపీని నిలబెడుతున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. లిక్కర్ స్కామ్‌తో ఆప్ ప్రభుత్వం, కేజ్రీవాల్‌పై వ్యతిరేకత పెరిగింది. ఇదే ఆప్ పరాజయానికి దారితీసింది. ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఇదే చెప్పారు’ అని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు.
ఫలితం మరోలా ఉండేది..
‘ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌తో కలిసి నడిస్తే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితం మరోలా ఉండేది. కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయడం వల్ల.. బీజేపీకి మేలు జరిగింది. కేజ్రీవాల్ వ్యూహాత్మక తప్పిదాలే బీజేపీకి కలిసి వచ్చాయి. ఈ ఫలితాలన్నింటికి కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే కారణం. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. అహంకారపూరితమైనవి. ఈ అహంకారమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి, పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితమవడానికి కారణమైంది’ అని కొండా సురేఖ స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌కు కొత్త కాదు..
‘పోరాటానికి ప్రత్యామ్నాయ పదమే కాంగ్రెస్ పార్టీ. గెలుపోటములు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. అధికార పక్షమైన, ప్రతిపక్షమైన నిత్యం ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాట పంథాను వీడదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడే బీఆర్ఎస్ పార్టీ.. గెలుపోటముల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ప్రజల ఆదరణతో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధిస్తుంది’ అని సురేఖ ధీమా వ్యక్తం చేశారు.
కేటీఆర్ వర్సెస్ పొన్నం..
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కంగ్రాట్స్ రాహుల్ గాంధీ అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. బీజేపీని గెలిపించిన రాహుల్ గాంధీకి కంగ్రాట్స్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్‌పై మంత్రి పొన్నం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్‌కు లోలోపల సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా.. బీజేపీ గెలుపు కేటీఆర్‌కు ఆనందం కలిగించినట్టు ఉందని.. కేసుల మాఫీ కోసమే కేటీఆర్ బీజేపీ భజన చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
టాపిక్