Best Web Hosting Provider In India 2024
OTT Revenge: ఓటీటీలో దంచికొడుతున్న తెలుగు రివేంజ్ థ్రిల్లర్.. 8.1 రేటింగ్.. రిలీజైన 7 భాషల్లోనూ టాప్‌లో ట్రెండింగ్!
Kobali OTT Streaming And Trending In 7 Languages: ఓటీటీలో ఇటీవల డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోబలి దంచికొడుతోంది. ఏకంగా ఓటీటీ రిలీజ్ అయిన 7 భాషల్లోనూ టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతూ దూసుకుపోతోంది. మరి కోబలి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..!
OTT Telugu Revenge Crime Thriller Series Trending Top 1 Place: ఓటీటీలో దంచికొడుతోన్న తెలుగు రివైంజ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోబలి. పచ్చి బూతులు, అడల్ట్ కంటెంట్, రక్తపాతం, పగ, ప్రతికారం నేపథ్యంలో తెరకెక్కిన కోబలి సిరీస్ ఇటీవలే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఓటీటీ రిలీజ్ డే నుంచే ఇప్పటివరకు టాప్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతోంది.
రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా
అది కూడా ఏకంగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన 7 భాషల్లోనూ కోబలి ట్రెండింగ్‌లో ఉంటూ సత్తా చాటుతోంది. కోబలి వెబ్ సిరీస్‌లో పాపులర్ యాక్టర్ రవి ప్రకాష్, రాకీ సింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, యాంకర్ శ్యామల, యోగి ఖత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యాక్షన్ డ్రాప్‌లో రివెంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి గొప్ప స్పందన వస్తోంది.
ఇంతకుముందు చూడనివిధంగా
ఇదివరకు ఓటీటీలో ఇలాంటి కంటెంట్ ఇంతకు ముందు చూడలేదు అనేలా యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందించారని చెబుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ రివెంజ్ డ్రామాలోని ఇంటెన్స్‌కు ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు. రేవంత్ లెవక డైరెక్ట్ చేసిన ఈ సిరీస్‌తో ఇన్నాళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కనిపించిన రవి ప్రకాష్ మెయిన్ లీడ్‌కు వచ్చి అద్భుతంగా ఆకట్టుకున్నాడు.
సరికొత్తగా రివేంజ్ ప్లాట్
యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో రవి ప్రకాష్ నటన కట్టిపడేస్తుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలోని సినిమాల్లో రివేంజ్ అనేది కామన్ గానే ఉన్నా.. ఈ సిరీస్‌లోని రివేంజ్‌కు సంబంధించిన ప్లాట్ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు మరింత థ్రిల్ అవుతున్నారు. తెలుగు ఆడియెన్స్‌ను కాకుండా ఇతర భాషా ప్రేక్షకులను అలరిస్తోన్న కోబలి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
7 భాషల్లో స్ట్రీమింగ్
ఫిబ్రవరి 4న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో కోబలి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయింది. అది కూడా తెలుగుతోపాటు మలయాళం, కన్నడ, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ వంటి 7 భాషల్లో కోబలి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇప్పుడు అదే 7 భాషల్లో కోబలి ట్రెండింగ్ అవుతోంది. అయితే, వీటిలో నిన్నటి (ఫిబ్రవరి 7) వరకు 5 భాషల్లో టాప్ 1 స్థానంలో సత్తా చాటితే.. మరో రెండింట్లో టాప్ 2 ప్లేసుల్లో కోబలి అదరగొట్టింది.
టాప్ 5 లోపే ఓటీటీ ట్రెండింగ్
అయితే, ఇవాళ (ఫిబ్రవరి 8) సాయంత్రం సమయానికల్లా కోబలి ట్రెండింగ్ టాప్ స్థానాలు మారిపోయాయి. ప్రస్తుతం కోబలి తెలుగు, తమిళం వెర్షన్ టాప్ 1 ప్లేస్‌లో, కోబలి హిందీ వెర్షన్ టాప్ 2 స్థానంలో, బెంగాలీ, కన్నడ వెర్షన్స్ టాప్ 4, మరాఠీ టాప్ 3, మలయాళంలో టాప్ 5 ప్లేస్‌లో ఉంది. అంటే, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లో దాదాపుగా టాప్ 5 స్థానాల్లో కోబలి ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.
కోబలికి 8.1 రేటింగ్
ఇలా ఓటీటీలో ఏడు భాషల్లో విడుదలైన కోబలి అన్నింటిలోనూ సూపర్ హిట్ అనిపించుకుంటోంది. ఈ సిరీస్‌కు ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. కోబలి వెబ్ సిరీస్‌ను టీఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తిరుపతి శ్రీనివాసరావు నిర్మించారు. ఇక కోబలి వెబ్ సిరీస్ ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8.1 రేటింగ్ (ఫిబ్రవరి 8 నాటికి) సాధించడం విశేషం.
సంబంధిత కథనం