Akhanda 2: అఖండ 2లో స‌రైనోడు విల‌న్ – ఈ సారి తాండ‌వ‌మే అంటోన్న బోయ‌పాటి – సీక్వెల్‌పై కొత్త అప్‌డేట్

Best Web Hosting Provider In India 2024

Akhanda 2: అఖండ 2లో స‌రైనోడు విల‌న్ – ఈ సారి తాండ‌వ‌మే అంటోన్న బోయ‌పాటి – సీక్వెల్‌పై కొత్త అప్‌డేట్

Nelki Naresh Kumar HT Telugu
Feb 08, 2025 08:37 PM IST

Akhanda 2: బాల‌కృష్ణ అఖండ 2పై మేక‌ర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రివీల్ చేశారు. ఈ సీక్వెల్‌లో ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. స‌రైనోడు త‌ర్వాత బోయ‌పాటి శ్రీనుతో ఆది పినిశెట్టి చేస్తోన్న మూవీ ఇది. ప్ర‌స్తుతం అఖండ 2 షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

అఖండ 2
అఖండ 2

Akhanda 2: బాల‌కృష్ణ అఖండ 2పై మేక‌ర్స్ కొత్త అప్‌డేట్‌ను శ‌నివారం రివీల్ చేశారు. ఈ యాక్ష‌న్ మూవీలో ఆది పినిశెట్టి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలో బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన స‌రైనోడు మూవీలో ఆది పినిశెట్టి విల‌న్‌గా న‌టించాడు బోయ‌పాటి శ్రీనుతో అత‌డు చేస్తోన్న సెకండ్ మూవీ ఇది.

yearly horoscope entry point

ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో…

అఖండ 2లో విల‌న్‌గా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో ఆది పినిశెట్టి క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. స‌రైనోడు మూవీలో వైరం ధ‌నుష్ అనే పాత్ర‌లో విల‌న్‌గా అల్లు అర్జున్‌కు ధీటైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు ఆది పినిశెట్టి. అలాంటి ఇంటెన్స్‌ క్యారెక్ట‌ర్‌నే అఖండ 2లో చేయ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు. బాల‌కృష్ణ‌ను ఢీ కొట్టే విల‌న్‌గా ఆది పినిశెట్టి ఈ మూవీలో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

నెగెటివ్ షేడ్స్‌తో డిఫ‌రెంట్‌గా ఆది పినిశెట్టి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి లుక్ చాలా కొత్త‌గా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు. బాల‌కృష్ణ‌, ఆది పినిశెట్టి కాంబినేష‌న్‌లో వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్ థ్రిల్లింగ్‌ను పంచుతాయ‌ని అంటున్నారు.

హైద‌రాబాద్‌లో షూటింగ్‌…

అఖండ 2 మూవీ సెట్స్‌లో ఆది పినిశెట్టి అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం ఈ సీక్వెల్ మూవీ షూటింగ్ అన్న‌పూర్ణ సెవ‌న్ ఎక‌ర్స్‌లో జ‌రుగుతోంది. బాల‌కృష్ణ‌, ఆది పినిశెట్టిల‌పై ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తోన్నాడు. ఈ ఫైట్ సీక్వెన్స్‌కు రామ్ ల‌క్ష్మ‌ణ్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఈ మూవీ కోసం అన్న‌పూర్ణ సెవ‌న్ ఎక‌ర్స్‌లో ఆర్ట్ డైరెక్ట‌ర్ ఏఎస్ ప్ర‌కాష్ స్పెష‌ల్ సెట్‌ను తీర్చిదిద్దారు. ఆ సెట్‌లోనే మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. అఖండ 2కు ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

పాన్ ఇండియ‌న్ మూవీ…

అఖండ 2లో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌నున్నారు. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీ ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు.

150 కోట్ల క‌లెక్ష‌న్స్‌…

2021లో రిలీజైన అఖండ మూవీ బాల‌కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 150 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో శ్రీకాంత్ విల‌న్ పాత్ర‌నుఉ పోషించాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024