Bandi Sanjay : కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు ‘గాడిద గుడ్డు’ గిఫ్ట్, కులగణన వెనుక పెద్ద కుట్ర- బండి సంజయ్

Best Web Hosting Provider In India 2024

Bandi Sanjay : కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు ‘గాడిద గుడ్డు’ గిఫ్ట్, కులగణన వెనుక పెద్ద కుట్ర- బండి సంజయ్

HT Telugu Desk HT Telugu Feb 08, 2025 09:24 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Feb 08, 2025 09:24 PM IST

Bandi Sanjay : కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చి తగిన బుద్ధి చెప్పారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుకు పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు.

కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు ‘గాడిద గుడ్డు’ గిఫ్ట్, కులగణన వెనుక పెద్ద కుట్ర- బండి సంజయ్
కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు ‘గాడిద గుడ్డు’ గిఫ్ట్, కులగణన వెనుక పెద్ద కుట్ర- బండి సంజయ్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Bandi Sanjay : బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడంవల్ల భవిష్యత్తులో తెలంగాణలోని బీసీలు పోటీ చేసే స్థానాల్లో హిందూ సమాజం గెలిచే పరిస్థితి ఉండబోదని హెచ్చరించారు. కాంగ్రెస్ కు దిల్లీ ప్రజలు గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చి తగిన బుద్ది చెప్పారని… అలానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి రేవంత్ రెడ్డికి గాడిద గుడ్డు ఇవ్వాలని పిలుపునిచ్చారు.‌

yearly horoscope entry point

ఉత్తర తెలంగాణలో కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో బీజేపీ పట్టభద్రుల సంకల్ప యాత్ర నిర్వహించింది. రాంనగర్ నుంచి తెలంగాణ చౌక్ వరకు సాగిన యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఉమ్మడి మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు భారీ ఎత్తున యువకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

యాత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను బండి సంజయ్ ఆవిష్కరించి కాంగ్రెస్ తీరు, బీఆర్ఎస్ వైఖరిపై మండిపడ్డారు.‌ ముస్లింలకు రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లింలు గెలిచారన్నారు. ఒకవైపు కుల గణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారు. ఇంకోవైపు బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి యావత్ హిందూ సమాజాన్నే దెబ్బతీసే ఘోరమైన కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

“ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు? వాళ్ల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి?’’అని బండి సంజయ్ మండిపడ్డారు. మేధావులు, పట్టభద్రులు ఈ విషయంలో మౌనంగా ఉండటం సమాజానికే అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణ పాఠం చెప్పాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ కు గాడిద గుడ్డు

దిల్లీలో కాంగ్రెస్ కు ఏం మిగిలింది…దిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు ఇచ్చింది గాడిద గుడ్డు. ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చేది గాడిద గుడ్డేనని బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగభృతి 4 వేల రూపాయలిస్తామన్నారు… 14 నెలలైంది… ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికి 56 వేల రూపాయలు బాకీ పడింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. ఒక్కరికైనా నయాపైసా ఇచ్చారా? ఏమిచ్చారు గాడిద గుడ్డు? అని ఎద్దేవా చేశారు. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు…డిగ్రీ పూర్తి చేస్తే 50 వేలు, పీజీ చేస్తే లక్ష రూపాయలిస్తామన్నారు. నయాపైసా సాయం చేశారా? ఈ లెక్కన ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయల బాకీ పడ్డారు. కానీ ఏమిచ్చారు…గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి స్కూటీ ఇస్తామన్నారు. విద్యారంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ మాదిరిగానే 7 శాతం నిధులు దాటలేదు…. మాట తప్పిన కాంగ్రెస్ కు పట్టభద్రులు, టీచర్లు ఇవ్వాల్సింది కూడా ‘గాడిద గుడ్డే’నని సూచించారు. నిరుద్యోగ సమస్యపై గల్లీగల్లీలో పోరాడింది బీజేపీ. పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన కొట్లాడింది బీజేపీనే. కానీ పొరపాటున గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయడంతో గాడిద గుడ్డు తప్ప మీకేం మిగిలిందని ప్రశ్నించారు.

కేసీఆర్ మాదిరిగానే రేవంత్ ఐరన్ లెగ్

కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా ఐరన్ లెగ్ అని బండి సంజయ్ విమర్శించారు. వారు ఎక్కడ ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసినా ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలు మటాష్ అవుతున్నాయని ఆరోపించారు. ‘రేవంత్ రెడ్డి హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తే.. అక్కడ కాంగ్రెస్ పార్టీ మటాష్ అయ్యింది. ఇగ కేసీఆర్ కూడా ఏ సీఎంను కలిస్తే ఆ సీఎం ప్రాతినిధ్యం వహించిన పార్టీ అధికారంలోకి రాకుండా ఓడిపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేస్తే మీ ప్రమోషన్ల గురించి, డీఏల గురించి, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడే వారుండరు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ దే.

ఫీజు రీయంబర్స్ మెంట్ అందక లక్షలాది మంది డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులు అల్లాడుతున్నారు. కాలేజీల యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు మూసుకునే దుస్థితి ఏర్పడింది. డబ్బులిస్తామని టోకెన్లు ఇచ్చి కూడా నయాపైసా చెల్లించకుండా విద్యార్థుల, కాలేజీల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓటు హక్కు లేని రైతులు, మహిళలు కూడా కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని గెలిపించాలని కోరుకుంటున్నారు’ అని బండి సంజయ్ తెలిపారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థే లేరు. ఎందుకో తెలుసా? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది. ఆ రెండు పార్టీలు ఒక్కటే. మీకో విషయం తెలుసా? డ్రగ్స్ కేసులో ఆధారాలున్నా అరెస్ట్ చేయలే. కాళేశ్వరం స్కాంలో, ఫాంహౌజ్ కేసు ఏమైంది? ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ తప్పదని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఎందుకు ముఖం చాటేశారో తెలుసా? ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది. దిల్లీలోనే కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్ కు సహకరిస్తోంది’- బండి సంజయ్

కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీసీ కులగనణను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.‌ బీసీల్లో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని బీసీలలో ముస్లింలను చేర్చినా, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించినా బీజేపీ ఊర్కోదని హెచ్చరించారు.

కులగణన బోగస్

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన పెద్ద భోగస్ అని బండి సంజయ్ మండిపడ్డారరు. ఎన్నికల సంఘం తెలంణాలో 3.35 కోట్ల మంది ఓటర్లుంటే… జనాభా మాత్రం 3 కోట్ల 70 లక్షల మంది మాత్రమే ఉన్నారట. తెలంగాణలో 4 కోట్ల 30 లక్షల మంది ఉన్నారని మేధావులు, నిపుణులు, గణాంకాలు చెబుతున్నయ్. మరి 70 లక్షల మంది ఎటు పోయారు? ఇదేమి అన్యాయం? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51 శాతం ఉంటే… రేవంత్ రెడ్డి కుల గణన సర్వేలో 46 శాతానికి ఎట్లా పడిపోయారు… బీసీలను అణిచివేసే కుట్ర జరుగుతోందనడానికి, బీసీలను దెబ్బతీయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.‌

మోదీ మాట ఇస్తే తప్పరు

మోదీ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని, ఇచ్చిన మాట మేరకు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. 12.75 లక్షల రూపాయల పన్ను మినహాయింపు ఇచ్చింది. మేధావులు తప్పు చేస్తే సమాజానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. దయచేసి మాట ఇచ్చి తప్పిన కాంగ్రెస్ ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించేలా గ్రాడ్యుయేట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంజిరెడ్డిని, టీచర్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్క కొమరయ్యను గెలిపించాలని కోరారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Bandi Sanjay
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024