CM Chandrababu : ఏపీ లిక్కం స్కాం ముందు దిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నది – సీఎం చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

CM Chandrababu : ఏపీ లిక్కం స్కాం ముందు దిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నది – సీఎం చంద్రబాబు

Bandaru Satyaprasad HT Telugu Feb 08, 2025 09:46 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Feb 08, 2025 09:46 PM IST

CM Chandrababu : ఏపీ మద్యం స్కాంతో పోలిస్తే దిల్లీ మద్యం కుంభకోణం చాలా చిన్నదని సీఎం చంద్రబాబు అన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేలకోట్లు దోచుకున్నారన్నారు.

ఏపీ లిక్కం స్కాం ముందు దిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నది - సీఎం చంద్రబాబు
ఏపీ లిక్కం స్కాం ముందు దిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నది – సీఎం చంద్రబాబు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

CM Chandrababu : ‘ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం స్కాంతో పోల్చుకుంటే, దిల్లీలో జరిగిన స్కాం చాలా చిన్నది. మద్యం కుంభకోణంలో వచ్చే డబ్బు, పాపిష్టి డబ్బు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్నారు’ అని గత వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

yearly horoscope entry point

‘దిల్లీలో కేజ్రీవాల్ షీష్ మహల్, ఏపీలో రుషికొండ ప్యాలెస్.. ఇలాంటి విచ్చలవిడితనాన్ని ప్రజలు ఆమోదించరని చెప్పటానికి, మొన్న ఆంధ్రప్రదేశ్, ఇవాళ దిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక ఉదాహరణ. రెండు చోట్లా వాళ్లు కట్టుకున్న ప్యాలెస్ లోకి ప్రజలు వెళ్లనివ్వకుండా తీర్పు ఇచ్చారు’ అని చంద్రబాబు అన్నారు.

ప్రతిపక్ష హోదాపై చురకలు

ప్రతిపక్ష హోదాపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ‘నీ స్థానాన్ని బట్టి నీకు హోదా ఇస్తారు. నాకు కావాల్సిన స్థానం ఇవ్వాలి, ప్రధానితో సమానంగా హోదా ఇవ్వాలంటే, ఎవరు ఇస్తారు? ఎందుకు ఇస్తారు ? ప్రజాస్వామ్య విలువలు అర్థం కాకపోతే, ఇలాగే వితండవాదం చేసుకుంటూ, నాకు కావాల్సింది ఇవ్వాల్సిందే అంటూ తిరుగుతారు’ అని మండిపడ్డారు.

ఫుడ్ బాస్కెట్ గా ఏపీ

గత 30 ఏళ్లుగా తెచ్చిన పాలసీలు, ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించాయో చర్చించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏ నాయకుడి వల్ల ప్రజలకు, రాష్ట్రానికి న్యాయం జరిగిందో చర్చ జరగాలన్నారు. పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఏపీ రైతులు చాలా తెలివైనవాళ్లని, చెబితే చాలు అల్లుకుపోతారన్నారు. సాగునీరు పుష్కలంగా ఉన్న అనేకచోట్లకు రైతులు వెళ్లారన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తులకు మంచి ధర వస్తోంది. ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్‌గా మారే శక్తి ఏపీకి ఉందన్నారు.

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లు

2047 నాటికి రాష్ట్రంలో 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఉండాలని ఒక విజన్ పెట్టుకున్నామన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం 42,000 డాలర్లు ఉండే దిశగా పాలసీలు రూపొందిస్తున్నామన్నారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుంది.. మౌలికవసతులు వస్తాయన్నారు. సుపరిపాలన ఇస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్లేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 1991 తర్వాత దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయని గుర్తుచేశారు. ఆర్థిక సంస్కరణలను తెలుగుబిడ్డ పీవీ తీసుకువచ్చారు. 1995-2024 మధ్య ఏపీ తలసరి ఆదాయం 9 రెట్లు పెరిగిందన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Chandrababu NaiduYs JaganAndhra Pradesh NewsTrending ApTelugu NewsAp Politics
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024